రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 2022 వరకు సరుకు లోడింగ్‌లో రూ. 120478 కోట్లను ఆర్జించిన రైల్వేలు
గత ఏడాది ఇదే కాలంలతో పోలిస్తే 16% పెరిగిన సరుకురవాణా ఆర్జన
డిసెంబర్ 22 వరకు 11093 మెట్రిక్ టన్నుల సరుకు లోడింగ్‌ను సాధించిన రైల్వే
గత ఏడాది సాధించిన 1029.86 మెట్రిక్ టన్నుల లోడింగ్‌తో పోలిస్తే 8% మెరుగుదల
Posted On:
02 JAN 2023 3:45PM by PIB Hyderabad
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి తొమ్మిది నెలల్లో భారతీయ రైల్వేల సరుకు లోడింగ్ రవాణా మిషన్ మోడ్ (లక్ష్యిత రీతి)లో గత సంవత్సరం లోడింగ్‌లో అదే కాలం ఆర్జించిన ఆదాయాలను అధిగమించింది.
ఏప్రిల్-డిసెంబర్ 22 వరకు సంచిత ప్రాతిపదికన, గత ఏడాది సాధించిన 1029.96 మిలియన్ టన్నుల సరుకు రవాణాతతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో 1109.38 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం రవాణా/ నింపిన సరుకు కంటే 8% మెరుగుదల. రైల్వేలు గత ఏడాది ఆర్జించిన రూ. 104040 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రూ. 120478 కోట్లను ఆర్జించి, 16% మెరుగుదలను సాధించింది.
ప్రారంభ స్థానం సరుకు లోడింగ్ విషయంలో డిసెంబర్ 21లో నింపిన 126.8 మెట్రిక్ టన్నుల సరుకుతో పోలిస్తే డిసెంబర్ 22లో 130.66 మెట్రిక్ టన్నుల సరుకును నింపి రవాణా చేసి, గత ఏడాదికన్నా 3% మెరుగుదలను సాధించింది. డిసెంబర్ 21లో సాధించిన రూ. 12914 కోట్ల సరుకు ఆర్జనతో పోలిస్తే ఈ ఏడాది రూ.14573 కోట్లను ఆర్జించి, గత ఏడాదితో పోలిస్తే 13% మెరుగుదలను సాధించింది.
హంగ్రీ ఫర్ కార్గో (సరుకు కోసం ఆకలి) అనే మంత్రాన్ని అనుసరించి, వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు, పోటీ ధరలకు సేవల బట్వాడాను మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వేలు నిరంతరం చేసిన ప్రయత్నాల ఫలితంగా సంప్రదాయ, సంప్రదాయేతర సరుకు ప్రవాహాల నుంచి నూతన ట్రాఫిక్ రైల్వేలకు రావడం ప్రారంభమైంది.
వినియోగదారులు కేంద్ర విధానం, వ్యాపార అభివృద్ధి యూనిట్ల పని, చురుకైన విధాన నిర్ణయాల మద్దతు ఈ మైలురాయిని సాధించేందుకు రైల్వేలకు తోడ్పడింది.
***
(Release ID: 1888190)
Visitor Counter : 205