ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ గంగా మండలి సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని అధ్యక్షత
प्रविष्टि तिथि:
30 DEC 2022 10:21PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ గంగా మండలి సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా అధ్యక్షత వహించారు. నమామి గంగే కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చలకు ఇదొక సదవకాశమని శ్రీ మోదీ ఈ సందర్భంగా అన్నారు. చిన్న పట్టణాలలో మురుగు శుద్ధి కర్మాగారాల నెట్‌వర్క్ విస్తరణసహా పరిశుభ్రత చర్యలను మెరుగుపరిచే మార్గాలను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. అలాగే గంగా తీరాన వివిధ రకాల ఔషధ మూలికల సాగును పెంచే మార్గాల గురించి ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటించారు. అదే సమయంలో ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు నమామి గంగే-తాగునీరు-పారిశుధ్య ప్రాజెక్టులను శ్రీ మోదీ జాతికి అంకితం చేశారు.
ఈ సమావేశం గురించి ప్రధాని ఒక ట్వీట్ ద్వారా వివరిస్తూ:
“ఈ రోజు నిర్వహించిన జాతీయ గంగా మండలి సమావేశం నమామి గంగే కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చకు ఒక మంచి అవకాశమిచ్చింది. చిన్న పట్టణాల్లో మురుగు శుద్ధి కర్మాగారాల నెట్‌వర్క్ విస్తరణసహా పరిశుభ్రత చర్యల మెరుగుకు అనుసరించాల్సిన మార్గాల గురించి కూడా ఈ సందర్భంగా చర్చ సాగింది. అలాగే గంగానది వెంబడి వివిధ రకాల ఔషధ మూలికల సాగును పెంచే మార్గాల గురించి నొక్కిచెప్పాను. అనేక మందికి జీవనోపాధి అవకాశాలు కల్పించగల పర్యాటక మౌలిక సదుపాయాలను తీరం వెంబడి పెంచాల్సిన అవసరాన్ని కూడా ప్రముఖంగా వివరించాను” అని పేర్కొన్నారు.
******
(रिलीज़ आईडी: 1887897)
आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam