హోం మంత్రిత్వ శాఖ

కేంద్రపాలిత ప్రాంతాల సదస్సుకు అధ్యక్షత వహించిన, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


కేంద్ర పాలిత ప్రాంతాలు సుపరిపాలనకు, అభివృద్ధికి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఒక నమూనాగా ఉండేలా తీర్చిదిద్దాలన్న

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికత దిశగా ఈ సదస్సు ఒక గొప్ప ముందడుగు.

కేంద్రపాలితప్రాంతాలు దేశానికి రోల్ మోడళ్లుగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
కేంద్రపాలిత ప్రాంతాల సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించుకున్నట్టయితేఅవి ఇండియాను ప్రపంచంలో
తృతీయ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.

2047 సంవత్సరానికి తమ దార్శనిక లక్ష్యాలను నిర్దేశించుకోవలసిందిగా శ్రీ అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.

కేంద్రపాలిత ప్రాంతాలు తమ సంస్కృతి పట్ల గర్వించాలని అమిత్ షా అన్నారు.
అమృత్ కాలానికి సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచప్రాణ్లను నిర్దేశించారని , ప్రతి కేంద్రపాలిత ప్రాంత పాలనాయంత్రాంగం,

ఈ ఐదు పంచ్ ప్రాణ్ల స్ఫూర్తిని తమ విధుల నిర్వహణలో చూపాలని శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు.
సురక్షిత కేంద్రపాలిత ప్రాంతాలగురించి కేంద్ర హోంమంత్రి నొక్కిచెబుతూ, ఫ్లాగ్షిప్ కార్యక్రమాలను పూర్తిచేయడం, కనీస ప్రభుత్వం, గరిష్ఠపాలన,

Posted On: 29 DEC 2022 8:13PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, కేంద్ర పాలిత ప్రాంతాలు సుపరిపాలన, అభివృద్ధి విషయంలో దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండాలి.ఇందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ , కేంద్ర హోం, సహకార శాఖమంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన కేంద్రపాలిత ప్రాంతాలపై ఒక సదస్సును న్యూఢిల్లీలో ఏర్పాటు చేసింది. ఈ సదస్సును అమృత్ కాల్ కు సంబంధించిన పంచ్ ప్రాణ్ ప్రేరణతో నిర్వహించారు.
ఈ సదస్సుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానందరాయ్, కేబినెట్ సెక్రటరీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పాలనా యంత్రాంగం సలహాదారులు, కేంద్రపాలిత ప్రాంతాల ఇతర అధికారులు, హోంమంత్రిత్వశాఖకు చెందిన అధికారులు, వివిధ మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రసంగిస్తూ కేంద్ర హోం, సహకార శాఖమంత్రి శ్రీ అమిత్ షా, కేంద్ర పాలిత ప్రాంతాలను దేశానికి రోల్ మోడల్గా చేయాల్సిన అవసరం గురించి ప్రస్తావించారు. కేంద్రపాలిత ప్రాంతాల శక్తి  సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించుకున్నట్టయితే ఇండియా, ప్రపంచంలో తృతీయ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యాన్ని చేరుకోగలదని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలు 2047 దార్శని క పత్రాన్ని  రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ పిలుపులను అందిపుచ్చుకుని ప్రేరణ పోందాలని అన్నారు.  దీని నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలను పర్యాటక హబ్ లుగా , అభివృద్ధి , సంక్షేమ హబ్ లుగా రూపుదిద్దుకోవాలన్నారు.

దేశాన్ని అభివృద్థి పథంలో ముందుకు తీసుకువెళ్ళేందుకు , జాతీయ లక్ష్యాలు, దార్శనికతను సాధించేందుకు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలసికట్టుగా ముందుకువచ్చి ఒక ఉమ్మడి వేదిక ద్వారా ప్రగతిప్రస్థానం సాగించేందుకు ముందుకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. కేంద్రపాలిత ప్రాంతాలు భౌగోళికంగా చిన్నవని, ఇతర వ్యవస్థలతో పోలిస్తే ఇవి సులభతర పాలనా వ్యవస్థను కలిగి ఉంటాయని అందువల్ల కేంద్రపాలిత ప్రాంతాలు, పైలట్‌ కార్యక్రమాల అమలులో ప్రయోగాలు చేసేందుకు ఎంతో అనువైనవని ఆయన  అన్నారు. ఈ ప్రయోగాలను కేంద్రపాలిత ప్రాంతాలలో పరీక్షించి చూసి ఆతర్వాత వీటిని పెద్ద ప్రాంతాలలో ఇతర రాష్ట్రాలలో పరీక్షించవచ్చునని ఆయన అన్నారు. సహకార సంఘాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రత్యేకించి  మత్స్యరంగం అభివృద్ధికి, ప్రజల భాగస్వామ్యానికి ఈ అంశంపై దృష్టిపెట్టాలన్నారు. అదే సమయంలో కేంద్రపాలిత ప్రాంతాలు తయారీ రంగంపై దృష్టిపెట్టాలని, విదేశీ వనరులపై ఆధారపడడం తగ్గించుకోవాలన్నారు. ఈ క్రమంలో రెవిన్యూ నష్టాన్ని తగ్గించుకోవచ్చని శ్రీ అమిత్‌ షా అన్నారు.మరింత మంది టూరిస్టులను ఆకర్షించేందుకు  టూరిస్టు సర్క్యూట్‌లను అభివృద్ధి చేయాలని, రవాణా తదితర వ్యయాలను తగ్గించుకోవాలని సూచించారు.

ప్రస్తుత అమృతకాలంలో , భారతదేశాన్ని అత్యుత్తమ భారతదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి భారతీయుడు సంకల్పం చెప్పుకోవాలని శ్రీ అమిత్‌ షా పిలుపునిచ్చారు.  2047 నాటికి భారతదేశం 100 స్వాతంత్య్రం సాధించి శతవసంతాలు పూర్తి చేసుకుంటుందని అన్నారు. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు 2047 రోడ్‌ మ్యాప్‌ ఇవ్వడం జరిగిందని, రాగల ఐదు సంవత్సరాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని ఆయన కోరారు. వార్షిక ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యాచరణ ప్రణాళికల పురోగతిని పర్యవేక్షించి దానిని ఎప్పటికప్పుడు సమీక్షించి, గరిష్ఠ ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అభివృద్ధి ఫలితాలు క్షేత్రస్థాయివరకు వెళ్లాలని అంటూ శ్రీ అమిత్‌ షా, కేవలం జిడిపి అంకెలలో వృద్ధిని బట్టి అభివృద్ధి సూచికను అంచనావేయరాదన్నారు. సమాజంలోని అత్యంత అణగారిన ప్రజలపైన, మారుమూల ప్రాంతాల ప్రజలపైన ఇది ఎంతవరకు సానుకూల ప్రభావాన్నిచూపిందన్న దానినిబట్టి దీనిని అంచనావేయాలన్నారు. అమృత్‌ కాల్‌కు సంబంధించిన పంచప్రాణాలను ప్రధానమంత్రినరేంద్రమోదీ ప్రకటించారని, దీనిని ప్రతి కేంద్ర పాలిత ప్రాంతం పుణికిపుచ్చుకోవాలని కేంద్రహోంమంత్రి అన్నారు. తమ విధులను నిర్వర్తించడంలో ఈ పంచప్రాణ్‌స్ఫూర్తిని అలవరచుకోవాలని ఆయనఅన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు  ఈ ఐదు సూత్రాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రపాలిత ప్రాంతాలను భద్రమైన, సురక్షితమైన వాటిగా తీర్చిదిద్దాలన్నారు.ఫ్లాగ్‌షిప్‌ పథకాలను గరిష్ఠస్థాయిలో అమలుచేయాలని, కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన ఉండాలన్నారు. అలాగే అవినీతికి ఏమాత్రం తావుండరాదన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అత్యుత్తమ విధానాలను అమలు చేయాలన్నారు.

దేశ భవిష్యత్‌ తరం పంచ్‌ప్రాణ్‌ను తమలో ఇముడ్చుకోవాలంటే ప్రాథమిక విద్య ముఖ్యమైనదని అన్నారు. అరబిందో గారి స్ఫూర్తిదాయక జీవితం నుంచి ఎన్నో పాఠాలు, అర్ధాలు పాలనాయంత్రాంగానికి లభిస్తాయని శ్రీఅమిత్‌షా అన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రత్యేకించి పుదుచ్చేరి, శ్రీఅరబిందో గారి జీవితంనుంచి నేర్చుకోదగిన పాఠాలను గ్రంథస్థం చేసి వాటిపై విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సురక్షిత కేంద్రపాలిత ప్రాంతాల గురించి నొక్కి చెబుతూ కేంద్ర హోంమంత్రి, ఆయా కేంద్రపాలిత ప్రాంతాలు, అనుసరించే అత్యుత్తమ పద్ధతులను పరస్పరం తెలియజేసుకోవాలన్నారు. ఫ్లాగ్‌స్కీమ్‌ పథకాలను పూర్తిచ చేయడం, కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన, అవినీతి రహిత సమాజం వంటివాటిపై దృష్టికేంద్రీకరించాలన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు స్వావలంబనకు నమూనాలుగా ఉండాలని, ప్రతి కేంద్రపాలితప్రాంతం తమ వారసత్వం గురించి  గొప్పగా భావించాలని చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతాలలో అద్భుత పర్యాటక అవకాశాలను అభివృద్ధిచేయనున్నట్టు ఉన్నట్టు ఆయన తెలిపారు.  కేంద్రపాలితప్రాంతాలు ఇప్పటివరకు సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూ శ్రీ అమిత్‌ షా, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్య సాధనకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశం కేంద్రపాలిత ప్రాంతాలు పరస్పరం తమ అనుభవాలు తెలుసుకోవడానికి, తమ పరిజ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి, ఇతర స్టేక్‌హొల్డర్ల అభిప్రాయాలు తెలుసుకోవడానికి, ఆయా కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఆకాంక్షలు, విజయాలు, స్థానిక ప్రాధాన్యతలు, తమకుమాత్రమే ప్రత్యేకంగా గల సవాళ్లు తెలియజేయడానికి వీలు కల్పించింది. ఈ సమావేశానికి ముందస్తుగా ఈ ఏడాది నవంబర్‌ లో పుదుచ్చేరిలో మేథో మధన సదస్సు జరిగింది. ఇందులో కేంద్ర హోంమంత్రిత్వశాఖకు చెందిన అధికారులు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు, రెండు రోజులు సమావేశమై పలు విషయాలు చర్చించారు. ఆర్థిక అభివృద్ధి, పర్యాటక రంగం, ఫ్లాగ్‌షిపÊ ప్రణాళికలు, అత్యుత్తమ విధానాలు వంటి వాటిని సుదీర్ఘంగా చర్చించి, ఈ సదస్సుకు అజెండాను సిద్ధం చేశారు.

కేంద్రహోం శాఖ కార్యదర్శి స్వాగతోపన్యాసంతో ఈ సదస్సు ప్రారంభమైంది. మూడు ప్రధాన అంశాలకు సంబంధించిన దానిపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. దానితర్వాత ఆయా అంశాలపై చర్చను చేపట్టారు. ప్రతి ప్రజెంటేషన్‌ అనంతరం లోతైన చర్చను చేపట్టారు. ఇందులో కనుగొన్న అంశాలను ప్రస్తావించారు. మూడు రంగాలకు సంబంధించిన బలాలు, సవాళ్లు, ప్రత్యేకతలు, అవకాశాలకు  సంబంధించి ప్రతి కేంద్రపాలిత ప్రాంతం ిని  అభివృద్ధి చోదకశక్తులుగా మారడానికి ఎలా వ్యవహరించాలన్నదానిపై చర్చించారు. రాగల 5  సంవత్సరాలకు  కేంద్రపాలిత ప్రాంతాల ఆకాంక్షలను ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. ఈ ఆకాంక్షలను నెరవేర్చడానికి తీసుకోవలసిన చర్యలు, ఇందుకు సంబంధించిన లక్ష్యాలను సమావేశం ముందుంచడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ, ఈసమావేశంలో పాల్గొన్న వారందరినీ అభినందించారు.కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో సమావేశంలో పాల్గొన్నవారు ఎంతో విలువైన చర్చచేశారని అభినందించారు.కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్‌షా మార్గనిర్దేశం, భవిష్యత్తుకు చేసిన సూచనలతో ఈ సదస్సు ముగిసింది. 

***



(Release ID: 1887769) Visitor Counter : 170