వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

22-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- నవంబర్ లో వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు గత ఏడాది ఇదే కాలం తో పోలిస్తే 16 శాతం పెరుగుదలతో 17.43 బిలియన్ డాలర్లు గా నమోదు


2022-23 మొత్తం ఎగుమతి లక్ష్యంలో 74% ఎనిమిది నెలల (ఏప్రిల్-నవంబర్ 22-23) లోనే పూర్తి

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో 32.60% పెరిగి 1310 మిలియన్ డాలర్లకు చేరిన ప్రాసెస్ చేసిన పండ్లు ,కూరగాయల ఎగుమతులు

Posted On: 30 DEC 2022 4:08PM by PIB Hyderabad

2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 ఎనిమిది నెలల్లో (ఏప్రిల్-నవంబర్) వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు 16 శాతం పెరిగాయి.

 

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డిజిసిఐ అండ్ ఎస్) తాత్కాలిక డేటా ప్రకారం, వ్యవసాయ ,ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎపిఇడిఎ) ఉత్పత్తుల మొత్తం ఎగుమతి 2022 ఏప్రిల్-నవంబర్ కాలంలో గత ఏడాది ఇదే కాలం తో పోలిస్తే 16 శాతం పెరిగి 17.43 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

 

వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎపిఇడిఎ (వ్యవసాయ ,ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ) తీసుకున్న చొరవలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో 2022-23 సంవత్సరానికి మొత్తం ఎగుమతి లక్ష్యంలో 74 శాతం సాధించడానికి దేశానికి దోహదపడ్డాయి.

 

ప్రస్తుత 2022-23 సంవత్సరానికి వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మొత్తానికి 23.56 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని నిర్దేశించగా , మొదటి ఎనిమిది నెలల్లో ఇప్పటికే 17.435 బిలియన్ డాలర్ల ఎగుమతిని సాధించారు.

 

డిజిసిఐ అండ్ ఎస్ తాత్కాలిక డేటా ప్రకారం, ప్రాసెస్ చేసిన పండ్లు ,  కూరగాయలు 32.60 శాతం (ఏప్రిల్-నవంబర్ 2022) వృద్ధిని నమోదు చేశాయి. తాజా పండ్లు గత ఏడాది ఇదే నెలలతో పోలిస్తే నాలుగు శాతం వృద్ధిని నమోదు చేశాయి.

 

అలాగే, తృణధాన్యాలు ,ఇతర ప్రాసెస్ చేసిన వస్తువులు వంటి ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు గత సంవత్సరం మొదటి ఎనిమిది నెలలతో పోలిస్తే 28.29 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

 

2021 ఏప్రిల్-నవంబర్లో తాజా పండ్లు 954 మిలియన్ డాలర్ల మేర ఎగుమతి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే నెలల్లో 991 మిలియన్ డాలర్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో 988 మిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలల్లో ప్రాసెస్ చేసిన ఎఫ్ అండ్ వి ఎగుమతులు 1310 మిలియన్ డాలర్లకు పెరిగాయి.

 

పప్పుధాన్యాల ఎగుమతి గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో 90.49 శాతం పెరిగింది, కాయధాన్యాల ఎగుమతి 206 మిలియన్ డాలర్ల (ఏప్రిల్-నవంబర్ 2021-22) నుండి 392 మిలియన్ డాలర్లకు (ఏప్రిల్-నవంబర్ 2022-23) పెరిగింది.

 

బాస్మతి బియ్యం ఎగుమతులు 2022-23 ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో 39.26 శాతం వృద్ధిని సాధించాయి, దీని ఎగుమతులు 2063 మిలియన్ల డాలర్లు (ఏప్రిల్-నవంబర్ 2021) నుండి 2873 మిలియన్ల (ఏప్రిల్-నవంబర్ 2022) డాలర్లకు పెరిగాయి, కాగా, నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతి గత ఏడాది ఇదే నెలల్లో 3930 మిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  ఎనిమిది నెలల్లో 4109 మిలియన్ డాలర్లకు పెరిగింది.

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు 88.45 శాతం, ఇతర తృణధాన్యాల ఎగుమతులు 12.90 శాతం పెరిగాయి.

పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతి గత ఏడాది ఇదే నెలల్లో 43 మిలియన్ డాలర్ల నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో 82 మిలియన్ డాలర్లకు పెరిగింది.

 

అదేవిధంగా, పాల ఉత్పత్తుల ఎగుమతి 2022 ఏప్రిల్-నవంబర్లో 33.77 శాతం వృద్ధిని నమోదు చేసింది, అంతకుముందు ఏడాది ఇదే నెలల్లో 315 మిలియన్ డాలర్ల నుండి 421 మిలియన్ డాలర్లకు పెరిగింది.

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో గోధుమల ఎగుమతి 29.29 శాతం పెరిగింది, 2021 ఏప్రిల్-నవంబర్ లో 1166 మిలియన్ డాలర్ల నుండి 2022 ఏప్రిల్-నవంబర్ లో 1508 మిలియన్ డాలర్లకు ఎగుమతి పెరిగింది.

 

ఇతర తృణధాన్యాల ఎగుమతులు 2021 ఏప్రిల్-నవంబర్ లో 619 మిలియన్ డాలర్ల నుండి 2022 ఏప్రిల్-నవంబర్ లో 699 మిలియన్ డాలర్లకు పెరిగాయి పశువుల ఉత్పత్తుల ఎగుమతులు 2021 ఏప్రిల్-నవంబర్ లో 2665 మిలియన్ డాలర్ల నుండి 2022 ఏప్రిల్-నవంబర్ లో 2709 మిలియన్ డాలర్లకు పెరిగాయి.

 

అపెడా చైర్మన్ ఎం. అంగముత్తు మాట్లాడుతూ, "నాణ్యమైన వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు దేశం నుండి ఎగుమతి అయ్యేలా చూడటానికి రైతులు, ఎగుమతిదారులు, ప్రాసెసర్లు వంటి వాటాదారులందరితో కలిసి పనిచేస్తున్నాము‘‘ అని చెప్పారు.

 

వివిధ దేశాలలో బి 2 బి ఎగ్జిబిషన్లను నిర్వహించడం, భారతీయ రాయబార కార్యాలయాల చురుకైన ప్రమేయం ద్వారా ఉత్పత్తి-నిర్దిష్ట ,సాధారణ మార్కెటింగ్ ప్రచారం ద్వారా కొత్త సంభావ్య మార్కెట్లను అన్వేషించడం వంటి వ్యవసాయ ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి తీసుకున్న వివిధ కార్యక్రమాల ఫలితం గానే ఎగుమతిలో పెరుగుదల సాధ్యమైందని చెప్పారు.

 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై , అమెరికా తో హస్తకళలతో సహా జి ఐ ఉత్పత్తులపై వర్చువల్ గా కొనుగోలుదారు- అమ్మకందారుల సమావేశాలను నిర్వహించడం ద్వారా భారతదేశంలో రిజిస్టర్డ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్(జిఐ ) కలిగి ఉన్న ఉత్పత్తులను ప్రోత్సహించడానికి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు.

 

భారతదేశ ఎగుమతి తులనాత్మక ప్రకటన: అపెడా ఉత్పత్తులు

 

 

ఉత్పత్తి పేరు

ఏప్రిల్- నవంబర్, 2021

 

                 యు ఎస్ డి

ఏప్రిల్- నవంబర్, 2022

 

మిలియన్

% తేడా (ఏప్రిల్- నవంబర్, 2022)

 

పండ్లు ,కూరగాయలు

954

991

3.90

తృణధాన్యాల తయారీ, ఇతర ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు

2232

2863

28.29

మాంసం, పాల ,పౌల్ట్రీ ఉత్పత్తులు

2665

2709

1.65

బాస్మతి బియ్యం

2063

2873

39.26

నాన్ బాస్మతి బియ్యం

3930

4109

4.57

ఇతర ఉత్పత్తులు

3228

3890

17

మొత్తం

15072

17435

15.68

 

మూలం: డిజిసిఐఎస్ ప్రధాన వస్తువుల డేటా ఏప్రిల్-నవంబర్, 2022 (తాత్కాలిక డేటా)

 

****


(Release ID: 1887765) Visitor Counter : 142