సహకార మంత్రిత్వ శాఖ
కర్ణాటకలోని మాండ్యలో మెగా డెయిరీని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు ప్రారంభించారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి మృతికి సంతాపం తెలుపుతూ, శ్రీ అమిత్ షా ఆమెకు నివాళులర్పించారు మరియు ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం ప్రధానమంత్రికి అండగా నిలుస్తుందని అన్నారు.
రూ. 260 కోట్ల పెట్టబడితో ఈరోజు ప్రారంభించిన మెగా డెయిరీ ప్రతిరోజూ 10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తుంది, దీని సామర్థ్యం రోజుకు 14 లక్షల లీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది, 10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తే, లక్షలాది మంది రైతులకు ఆనందాన్ని కలిగిస్తుంది.
నేడు కర్ణాటకలో 15,210 గ్రామస్థాయి సహకార డెయిరీలు ఉన్నాయి, వీటిలో 16 జిల్లా స్థాయి డెయిరీల ద్వారా రోజుకు సుమారు 26.22 లక్షల మంది రైతులు తమ పాలను పంపిణీ చేస్తారు మరియు ప్రతిరోజూ 26 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 28 కోట్లు వెళ్తాయి.
1975లో 4 కోట్లుగా ఉన్న కే ఎం ఎఫ్ టర్నోవర్ ఇప్పుడు 25000 కోట్లకు పెరిగింది, అందులో 80% రైతుల ఖాతాలోకి వెళ్తుంది.
జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డిడిబి) మరియు సహకార మంత్రిత్వ శాఖ రాబోయే మూడేళ్లలో దేశంలోని ప్రతి పంచాయతీలో ప్రాథమిక డెయిరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి పూర్తి కార్యాచరణ ప్రణాళి
Posted On:
30 DEC 2022 4:33PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు కర్ణాటకలోని మాండ్యాలో మెగా డెయిరీని ప్రారంభించారు. మాండ్యలోని శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం 72వ పీఠాధిపతి నిర్మలానందనాథ మహాస్వామీజీ, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, మాజీ ప్రధాని శ్రీ హెచ్‌డి దేవెగౌడ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి మృతికి సంతాపం తెలుపుతూ, శ్రీ అమిత్ షా ఆమెకు నివాళులు అర్పించారు మరియు ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం ప్రధానమంత్రికి అండగా నిలుస్తోందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలోని రైతులు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి విడిగా సహకార మంత్రిత్వ శాఖ కావాలని డిమాండ్ చేశారని కేంద్ర హోం, సహకార మంత్రి తెలిపారు. ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రైతుల అభివృద్ధికి బాటలు వేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మాండ్య మెగా డెయిరీ ప్రారంభోత్సవ వేదిక నుంచి సహకార సంఘాలకు ఎలాంటి అన్యాయం జరగకూడదనేది భారత ప్రభుత్వ నిర్ణయమని దేశవ్యాప్తంగా ఉన్న సహకార కార్మికులకు చెప్పాలనుకుంటున్నట్లు శ్రీ షా తెలిపారు.
రూ.260 కోట్లతో నేడు ప్రారంభించిన మెగా డెయిరీ రోజుకు 10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తుందని, అలాగే దీని సామర్థ్యం రోజుకు 14 లక్షల లీటర్ల వరకు పెంచే అవకాశం ఉందని కేంద్ర సహకార మంత్రి తెలిపారు. 10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తే లక్షలాది మంది రైతుల ఇళ్లకు సంపద చేరుతుందని అన్నారు. కర్ణాటకలో సహకార డెయిరీ బాగా పనిచేస్తోందని శ్రీ షా అన్నారు. నేడు కర్ణాటకలో 15,210 గ్రామ స్థాయి సహకార డెయిరీలు ఉన్నాయి, వీటి ద్వారా రోజుకు సుమారు 26.22 లక్షల మంది రైతులు తమ పాలను పంపిణీ చేస్తారు. 16 జిల్లా స్థాయి డెయిరీల ద్వారా ప్రతిరోజూ 26 లక్షల మంది రైతుల ఖాతాలలో 28 కోట్ల రూపాయలు జమ చేయబడ్డాయి.
1975లో కర్ణాటకలో రోజుకు దాదాపు 66,000 కిలోల పాలను ప్రాసెస్ చేసేవారని, ఈరోజు 82 లక్షల కిలోల పాలను ప్రాసెస్ చేస్తున్నారని, మొత్తం టర్నోవర్‌లో 80% రైతుకే దక్కుతుందని శ్రీ అమిత్ షా చెప్పారు. గుజరాత్‌లో వచ్చిన శ్వేత విప్లవం రైతుల అదృష్టాన్ని మార్చివేసిందని, అమూల్ ద్వారా ఏటా దాదాపు 36 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి 60,000 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయని కేంద్ర సహకార మంత్రి తెలిపారు. కర్ణాటకలోని ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక డెయిరీలను నెలకొల్పేందుకు అమూల్, నందిని కలిసి పనిచేస్తామని, వచ్చే మూడేళ్లలో కర్ణాటకలో ప్రాథమిక డెయిరీ లేకుండా ఒక్క గ్రామం కూడా ఉండదని కర్ణాటక రైతు సోదర సోదరీమణులందరికీ హామీ ఇస్తున్నట్లు చెప్పారు. జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డిడిబి) మరియు సహకార మంత్రిత్వ శాఖ రాబోయే మూడేళ్లలో దేశంలోని ప్రతి పంచాయతీలో ప్రాథమిక డెయిరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి సంబంధించి పూర్తి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని శ్రీ అమిత్ షా చెప్పారు. దీంతో మూడేళ్లలో దేశవ్యాప్తంగా గ్రామస్థాయిలో రెండు లక్షల ప్రాథమిక డెయిరీలను ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా దేశంలోని రైతులను శ్వేత విప్లవంతో అనుసంధానం చేసి పాల రంగంలో పెద్ద ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించనుందన్నారు.
కర్నాటక మిల్క్ ఫెడరేషన్‌కు సాంకేతిక సహకారం, సహకార రంగం మద్దతు మరియు అమూల్ నుండి మొత్తం కార్యాచరణ మద్దతు అందించబడుతుందని మరియు దాని అవసరాలన్నింటినీ సహకార మంత్రిత్వ శాఖ పరిష్కరిస్తుందని కేంద్ర హోం మరియు సహకార మంత్రి చెప్పారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు కలిసి దేశంలోని మొత్తం పాల ఉత్పత్తి రైతుల సంక్షేమానికి కృషి చేస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం పాల ఉత్పత్తి చేసే రైతులకు నేరుగా నగదు బదిలీ ద్వారా లీటరుకు రూ. 5 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలకు రూ. 1,250 కోట్లు జమ చేయడం పట్ల కేంద్ర సహకార మంత్రి ప్రశంసించారు. శ్రీ అమిత్ షా మాట్లాడుతూ శ్రీ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం పాల ఉత్పత్తిచేసే రైతుల ఖాతాలకు డీబీటీ ద్వారా ఏటా రూ. 1,250 కోట్లు బదిలీ చేసింది, క్షీర భాగ్య పథకం ద్వారా చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తొలగించేందుకు 51 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 65 లక్షల మంది పిల్లలకు, 64 వేల అంగన్‌వాడీల్లో 39 లక్షల మంది పిల్లలకు పాలు అందిస్తున్నది.మండ్య జిల్లాలోని రైతులందరికీ డెయిరీ ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేసినందుకు మండ్య పాల ఉత్పత్తిదారుల కమిటీ చైర్మన్ కు శ్రీ అమిత్ షా అభినందనలు తెలిపారు.
***
(Release ID: 1887571)
Visitor Counter : 201