ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
తామరస్సెరీలో విద్యార్ధులు, యువ భారతీయులతో ముచ్చటించనున్న సహాయమంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
న్యూ ఇండియా ఫర్ యంగ్ ఇండియా ః టెకేడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్న సెషన్‌లో పాల్గొననున్న కేరళలలోని 20 కాలేజీలకు చెందిన 1000మంది విద్యార్ధులు
కోరాన్‌ఘడ్‌లో ఆల్ఫోన్సా ఇంగ్లీష్ హయ్యర్ సెకెండరీ పాఠశాలలో యువ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్న సహాయ మంత్రి
प्रविष्टि तिथि:
29 DEC 2022 12:44PM by PIB Hyderabad
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంట్రప్రెన్యూర్‌షిప్ (ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక, నైపుణ్యల అభివృద్ధి & వ్యవస్థాపకత) శాఖ సహాయమంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ నెలలో రెండవసారి కేరళలో పర్యటించి, విద్యార్ధులతో & యువ భారతీయులతో ముచ్చటించనున్నారు. తన పర్యటన సందర్భంగా శుక్రవారం నాడు దక్షిణ తీర నగరమైన కొఝికొడెలో రెండు కార్యక్రమాలలో పాల్గొంటారు.
న్యూ ఇండియా ఫర్ యంగ్ ఇండియా - టెకేడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ (యువ భారతం కోసం నూతన భారతం - దశాబ్దంలో భిన్న సాంకేతిక అవకాశాలు)అన్న చొరవ కింద తామరస్సెరీలోని కేథలిక్ బిషప్ హౌజ్ క్యాంపస్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో కేరళలోని 20 కళాశాలలకు చెందిన 1000 మంది విద్యార్ధులు, యువతను ఉద్దేశించి మంత్రి ప్రసంగించి, ముచ్చటించనున్నారు. భారతదేశపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్నందున, నూతన ఉద్యోగాలు & వ్యవస్థాపకతలకు అవకాశాలను సృష్టిస్తున్నందున డిజిటల్ రంగంలో ఆవిష్కరణలకు మార్గాలను అన్వేషించేందుకు యువ భారతీయులను ప్రోత్సహించడం ఈ సెషన్‌ల లక్ష్యం.
మాజీ చిప్ డిజైనర్, సాంకేతిక వాణిజ్యవేత్త నుంచి రాజకీయవేత్తగా పరిణామం చెందిన శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ దేశవ్యాప్తంగా స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు సహా యువ భారతీయులను ఆకర్షించి, ప్రోత్సహిస్తున్నారు. అటువంటి సంభాషణలు విద్యార్ధులు, విద్యార్ధులు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు చెందిన వ్యక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలే, ఈ సంభాషణల ఫలితంగా గుజరాత్‌లో సంపన్న వ్యక్తులు, కుటుంబ యాజమాన్యాలలోని వ్యాపారులు గుజరాత్‌లోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు ప్రేరణను అందించేందుకు రూ. 1500 కోట్ల విలువైన వెంచర్ నిధులు ( వ్యాపారం కోసం నిధుల)ను ఏర్పాటు చేశారు.
మంత్రి కోరాన్‌ఘడ్‌లో ఆల్ఫోన్సా ఇంగ్లీష్ హయ్యర్ సెకెండరీ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న మలబార్ యువజన సంగమం కార్యక్రమానికి హాజరై, భారీ స్థాయిలో హాజరుకానున్న యువ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వీరి సంఖ్య వేలల్లో ఉంటుందని అంచనా.
ఇంతకు ముందు, డిసెంబర్ మొదటివారంలో ఆయన ఐదేళ్ళ వయసులో తాను చదువుకున్న కేరళలోని త్రిస్సూర్‌లో గల సెయింట్ పాల్స్ పాఠశాలను సందర్శించారు.
***
(रिलीज़ आईडी: 1887390)
आगंतुक पटल : 158