ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కోవిడ్‌19 కేసులు కొన్ని దేశాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా కంపెనీలతో అవసరమైన మందులు మరియు ఔషధాల స్థితిని సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా


కోవిడ్ డ్రగ్స్‌తో సహా అన్ని ఔషధాల తగినంత నిల్వలు మరియు లభ్యతను నిర్ధారించడానికి ప్రపంచ సరఫరా గొలుసు (గ్లోబల్‌ సప్లయ్‌ చైన్‌) పరిస్థితిని నిశితంగా గమనించాలని ఫార్మా కంపెనీలను కోరారు

Posted On: 29 DEC 2022 5:34PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు & ఎరువుల మంత్రి, డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ రోజు ఇక్కడ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో కోవిడ్  పరిస్థితి, నిర్వహణ సమర్ధత మరియు ఉత్పత్తి సామర్థ్యాలను సమీక్షించారు, తద్వారా భారతదేశం ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కోవిడ్‌19 కేసుల పెరుగుదల దృష్ట్యా ఈ సమీక్షా సమావేశం జరిగింది.

 

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ మహమ్మారి   వాస్తవ పరిస్థితి కి సంబంధించిన నేపధ్యాన్ని ప్రదర్శన రూపంలో కేంద్ర మంత్రికి వివరించారు. దేశంలో కోవిడ్ మహమ్మారి సమయంలో అమూల్యమైన సహకారం అందించినందుకు ఫార్మా కంపెనీలను డాక్టర్ మన్సుఖ్ మాండవియా అభినందించారు. “భారతదేశం యొక్క ఔషధ పరిశ్రమ దృఢమైనది, తట్టుకోగలిగేది మరియు ప్రతిస్పందించేది. వారి సామర్ధ్యం కారణంగానే మహమ్మారి సమయంలో డిమాండ్ తగ్గడమే కాకుండా 150 దేశాలకు మందులను సరఫరా చేసే స్థితిలో ఉన్నాం. నాణ్యత తగ్గకుండా, మందుల ధరల పెంపుదల లేకుండానే దీనిని సాధించామని ఆయన నొక్కి చెప్పారు.

 

ప్రపంచ సరఫరా గొలుసు  (గ్లోబల్‌ సప్లయ్‌ చైన్‌) పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని ఫార్మా కంపెనీలను కోరారు. ఏ పీ ఐ ల ఉత్పత్తి మరియు లభ్యతను అలాగే కోవిడ్ నిర్వహణ కోసం అవసరమైన ముడి ఔషధాల లభ్యతను నిశితంగా పర్యవేక్షించాలని కూడా వారిని కోరారు. కోవిడ్ డ్రగ్స్‌తో సహా అన్ని మందులు తగినంత నిల్వలు మరియు లభ్యతను  సరఫరా గొలుసులో రిటైల్ స్థాయి వరకు  నిర్ధారించాలని వారిని కోరారు.

 

కేంద్ర మంత్రి అధ్యక్షతన సకాలంలో జరిగిన ఈ సమీక్షా సమావేశాన్ని ఫార్మా కంపెనీలు అభినందించాయి మరియు తమ మద్దతును కొనసాగిస్తామని హామీ ఇచ్చాయి. కోవిడ్ ఔషధాల సరఫరా గొలుసును తాము నిర్వహించగలమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

 

సమీక్షా సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, శ్రీమతి ఎస్ అపర్ణ, సెక్రటరీ (ఫార్మా), శ్రీ కమలేష్ పంత్, చైర్మన్, ఎన్‌పిపిఎ, డిసిజిఐ డాక్టర్ వి జి సోమాని మరియు ఫార్మాస్యూటికల్ కంపెనీల ప్రతినిధులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

 

****



(Release ID: 1887351) Visitor Counter : 123