ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 సమాచారం


చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు, 1 జనవరి 2023 నుంచి, ఆయా దేశాల్లో బయలుదేరే ముందే తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి, ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఆ నివేదికను అప్‌లోడ్ చేయాలి

భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ చేసే 2% ర్యాన్డమ్‌ పరీక్షలకు ఇది అదనం

Posted On: 29 DEC 2022 3:07PM by PIB Hyderabad

చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ మరియు థాయిలాండ్ నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు, ఆయా దేశాలు/గమ్యస్థానాల నుంచి బయలుదేరే ముందు తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్‌ నెగటివ్ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నివేదికను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. 1 జనవరి 2023 నుంచి ఇది జరగాలి. భారతదేశానికి ప్రయాణించే తేదీకి 72 గంటల ముందు ఈ పరీక్ష చేయించుకోవాలి.

 భారతదేశానికి వచ్చే అన్ని అంతర్జాతీయ విమానాల్లోని అందరు అంతర్జాతీయ ప్రయాణీకులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న  2% ర్యాన్డమ్‌ పరీక్షలకు అదనంగా ఇది ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పైన పేర్కొన్న దేశాల్లో పెరుగుతున్న కొవిడ్‌-19 కేసుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం ఇచ్చారు.

 

****


(Release ID: 1887322) Visitor Counter : 287