రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అహ్మదాబాద్‌లో తొలిసారిగా రెండు అంతస్తుల 3-డి ప్రింటెడ్ డ్వెలింగ్ యూనిట్‌ను ప్రారంభించిన భారత సైన్యం

Posted On: 29 DEC 2022 11:39AM by PIB Hyderabad

భారత సైన్యం 28 డిసెంబర్ 2022న అహ్మదాబాద్ కాంట్ వద్ద సైనికుల కోసం తన మొదటి 3-డి ప్రింటెడ్ హౌస్ డ్వెల్లింగ్ యూనిట్‌ను (గ్రౌండ్ ప్లస్ వన్ కాన్ఫిగరేషన్‌తో) ప్రారంభించింది. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్‌)ఎంఐసిఓబి ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సరికొత్త 3-డి రాపిడ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీతో ఈ భవంతిని నిర్మించింది.

3డి ప్రింటెడ్ ఫౌండేషన్, గోడలు మరియు స్లాబ్‌లను ఉపయోగించడం ద్వారా గ్యారేజ్ స్థలంతో 71 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నివాస యూనిట్ నిర్మాణ పనులు కేవలం 12 వారాల్లో పూర్తయ్యాయి. విపత్తులను తట్టుకునే విధంగా జోన్-3 భూకంప నిర్మాణాలకు అనుగుణంగా మరియు గ్రీన్ బిల్డింగ్ నిబంధనలను అనుసరించి ఈ నిర్మాణం చేపట్టారు. సాయుధ దళాల సిబ్బందికి పెరుగుతున్న వసతి అవసరాలను తీర్చడానికి ఆధునిక రోజుల్లో వేగవంతమైన నిర్మాణ ప్రయత్నాలకు ప్రతీక ఈ  3-డి నిర్మాణ గృహాలు. 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్'ను ప్రోత్సహించడంలో భారత సైన్యం యొక్క నిబద్ధతకు ఈ నిర్మాణం నిదర్శనం.

ఈ సాంకేతికత కాంక్రీట్ 3డి ప్రింటర్‌ను ఉపయోగించుకుంటుంది. ఇది కంప్యూటరైజ్డ్ త్రీ-డైమెన్షనల్ డిజైన్‌ను అందిస్తుంది. అలాగే దీనికోసం రూపొందించిన ప్రత్యేకమైన కాంక్రీటును వెలికితీసి లేయర్-బై-లేయర్ పద్ధతిలో 3-డి నిర్మాణాన్ని రూపొందించింది.

అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఆర్మీకి చెందిన గోల్డెన్ కటార్ డివిజన్ కూడా అనేక రకాల అప్లికేషన్‌లతో ప్రాజెక్ట్‌ను కొనసాగించడంలో కీలకపాత్ర పోషించింది. ఇండియన్ ఆర్మీ యూనిట్‌లు ఇప్పటికే 3డి ప్రింటింగ్ టెక్నాలజీని ముందుగా అమర్చిన శాశ్వత రక్షణ మరియు ఆపరేషన్‌ల కోసం ఉద్దేశించిన ఓవర్‌హెడ్ ప్రొటెక్షన్‌ల నిర్మాణంలో ఉపయోగించాయి. ఈ నిర్మాణాలు ప్రస్తుతం ఒక సంవత్సరం వ్యవధిలో రూపొందుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఉన్న అన్ని భూభాగాలలో ఇటీవల వీటిని గమనించవచ్చు.

 

image.png

*****



(Release ID: 1887317) Visitor Counter : 143