గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
భారతదేశం పట్టణ పునరుజ్జీవన ప్రస్థానాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2 కీలక కార్యక్రమాలను ప్రారంభించింది.
Posted On:
28 DEC 2022 4:31PM by PIB Hyderabad
'నగర ఆర్థిక ర్యాంకింగ్స్' పట్టణ స్థానిక సంస్థలను మూల్యాంకనం చేయడానికి, గుర్తించడానికి మరియు కీలకమైన ఆర్థిక అంశాలలో వారి పనితీరు ఆధారంగా ప్రోత్సహించడం కోసం ప్రారంభించబడ్డాయి.
‘నగర సుందరీకరణ పోటీలు’ భారతదేశంలోని నగరాలు మరియు వార్డులు అందమైన, వినూత్నమైన మరియు సమగ్రమైన బహిరంగ ప్రదేశాలను రూపొందించడానికి చేసిన పరివర్తన ప్రయత్నాలను ప్రోత్సహించడం మరియు గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది.
“‘నగర ఆర్థిక ర్యాంకింగ్స్ 2022’ మూడు ఆర్థిక అంశలలో పట్టణ స్థానిక సంస్థలను వారి వనరుల సమీకరణ, వ్యయ పనితీరు మరియు ఆర్థిక పాలనా వ్యవస్థల సుస్థిరత లను మూల్యాంకనం చేయడం, గుర్తించడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందని" కేంద్ర గృహనిర్మాణం & పట్టణ వ్యవహారాలు మరియు పెట్రోలియం & సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి అన్నారు. గృహనిర్మాణం & పట్టణ వ్యవహారాలు మంత్రిత్వ శాఖ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మంత్రిత్వ శాఖ యొక్క రెండు కీలక కార్యక్రమాలు- ‘నగర ఆర్థిక ర్యాంకింగ్స్, 2022’ మరియు ‘నగర సుందరీకరణ పోటీలు’- ప్రారంభించబడ్డాయి. గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి మరియు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మే, 2014లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు, పట్టణీకరణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఆయన పట్టణీకరణను సవాలుగా స్వీకరించి విజయం సాధించారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ (SBM) వంటి కీలక పథకాలు ప్రారంభించబడ్డాయి, ఇదే ప్రభుత్వ ప్రాజెక్ట్ జన ఆందోళనగా రూపొందింది. 2014 నుండి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మరియు స్వచ్ఛ్ భారత్ మిషన్ (SBM) 2.0. ద్వారా వ్యర్థాల ప్రాసెసింగ్ మరియు నిర్వహణలో గణనీయమైన పెరుగుదల ఉందని ఆయన అన్నారు.
"ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పట్టణ పునరుజ్జీవనం ప్రణాళిక ను భారతదేశం ప్రారంభించింది" అని ఆయన అన్నారు.
ఈరోజు ప్రారంభించిన కార్యక్రమాల వెనుక ఉన్న ఆలోచన గురించి శ్రీ హర్దీప్ ఎస్. పూరి మాట్లాడుతూ, ఈ ఏడాది జూన్‌లో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కలిసినప్పటి సమావేశంలో ఆర్థిక విషయాలలో పట్టణ స్థానిక సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడానికి భారతదేశ నగరాల ర్యాంకింగ్ అనే ఆలోచన గౌరవ ప్రధానమంత్రి నుండి వచ్చిందని ఆయన ప్రధాని భవిష్య దృష్టిని గురించి వివరించారు.
ఆరోగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థ ఉంటే, ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉంటే భూమి విలువ పెరుగుతుందనే అవగాహన స్థానిక సంస్థల్లో పెరుగుతోందని, అదే ఈ ప్రణాళిక విశిష్టత అని ఆయన అన్నారు.
‘నగర సుందరీకరణ పోటీలు’ కార్యక్రమం గురించి మంత్రి మాట్లాడుతూ, భారతదేశంలోని నగరాలు మరియు వార్డులు అందమైన, వినూత్నమైన మరియు సమ్మిళిత బహిరంగ ప్రదేశాలను రూపొందించడానికి చేసిన పరివర్తన ప్రయత్నాలను ప్రోత్సహించడానికి మరియు గుర్తించడానికి దీనిని ప్రారంభించినట్లు చెప్పారు.
'నగర ఆర్థిక ర్యాంకింగ్స్, 2022':
‘నగర ఆర్థిక ర్యాంకింగ్స్, 2022’ భారతదేశంలోని నగరాలను (పట్టణ స్థానిక సంస్థలు) వారి ప్రస్తుత ఆర్థిక ఆరోగ్యం మరియు కాలక్రమేణా ఆర్థిక పనితీరులో మెరుగుదల యొక్క నాణ్యత ఆధారంగా మూల్యాంకనం చేయడం, గుర్తించడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
మునిసిపల్ ఆర్థిక సంస్కరణలను అమలు చేయడానికి నగర/రాష్ట్ర అధికారుల మరియు నిర్ణయాధికారులకు ప్రేరణ ఇవ్వడం ర్యాంకింగ్‌ల లక్ష్యం. పాల్గొనే పట్టణ స్థానిక సంస్థలు మూడు కీలక మునిసిపల్ ఫైనాన్స్ అసెస్‌మెంట్ అంశాలలో 15 సూచికలపై మూల్యాంకనం చేయబడతాయి, అవి: (i) వనరుల సమీకరణ, (ii) వ్యయ పనితీరు మరియు (iii) ఆర్థిక పాలన కింది నాలుగు జనాభా కేటగిరీలలో ఏదైనా ఒకదాని క్రింద నగరాలు వాటి స్కోర్‌ల ఆధారంగా జాతీయ స్థాయిలో ర్యాంకులు ఇవ్వబడతాయి: (i) 4 మిలియన్ల కంటే ఎక్కువ (ii) 1-4 మిలియన్ల మధ్య (iii) 1 లక్ష నుండి 1 మిలియన్ (iv) 100,000 కంటే తక్కువ జనాభా. జాతీయ స్థాయిలో ప్రతి జనాభా విభాగంలోని మొదటి 3 నగరాలు అలాగే ప్రతి రాష్ట్రం/రాష్ట్ర క్లస్టర్‌లో గుర్తించి ప్రోత్సహిస్తారు. www.cityfinance.in లో ఆన్‌లైన్ ద్వారా పాల్గొనే వారు అవసరమైన డేటా/పత్రాలను (ఆడిట్ చేయబడిన ఖాతాలు, వార్షిక బడ్జెట్‌లు మరియు స్వీయ-నివేదిత పనితీరు మెట్రిక్‌లతో సహా) సమర్పించడానికి ఆహ్వానించబడతాయి.
తమ పౌరులకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు మరియు మరింత మెరుగైన సేవలను అందించడానికి వీలుగా, పట్టణ స్థానిక సంస్థలను ఆర్థిక పనితీరులో ప్రాంతాలను విశ్లేషించి గుర్తించడంలో సహాయపడే ప్రయత్నం నగర ఆర్థిక ర్యాంకింగ్స్, 2022. మునిసిపల్ ఫైనాన్స్ సంస్కరణలను అమలు చేయడం కోసం అలాగే కొనసాగించడానికి నగర/రాష్ట్ర అధికారులకు ర్యాంకింగ్‌లు మంచి ప్రేరణగా ఉపయోగపడతాయి. రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ర్యాంకింగ్‌లు మునిసిపాలిటీలు సాధించిన ఫలితాలను హైలైట్ చేస్తాయి. పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక స్థితిపై కీలకమైన విధాన రూపకర్తలకు క్లిష్టమైన విశిష్ట లక్షణాలను అందిస్తాయి. నగర ఆర్థిక ర్యాంకింగ్స్‌లో పాల్గొనడం ద్వారా విపరీతంగా ప్రయోజనం పొందవచ్చు, ఎందుకంటే వారు భవిష్యత్తులో ఇతర నగరాలతో పోల్చి చూసుకొనేందుకు వారి స్వంత పనితీరును స్వీయ-మూల్యాంకనం చేసుకొనేందుకు వారి అభివృద్ధి కి సహాయపడగలదు. నగర ఆర్థిక ర్యాంకింగ్స్ 2022లో పాల్గొనడానికి అన్ని రాష్ట్రాలు/ యూ టీ లలోని మొత్తం 4500+ నగరాలు / పట్టణ స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తారు.
‘నగర ఆర్థిక ర్యాంకింగ్స్, 2022’ ఆర్థికంగా ఆరోగ్యకరమైన, పారదర్శకమైన మరియు సుస్థిరమైన నగరాలను ప్రోత్సహించడానికి బలమైన మునిసిపల్ ఆర్థిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
'నగర సుందరీకరణ పోటీ':
‘నగర సుందరీకరణ పోటీ’ అనేది భారతదేశంలోని నగరాలు మరియు వార్డులు అందమైన, వినూత్నమైన మరియు సమ్మిళిత బహిరంగ ప్రదేశాలను రూపొందించడానికి చేసిన పరివర్తన ప్రయత్నాలను ప్రోత్సహించడం మరియు గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది.
నగరాల వార్డులు మరియు బహిరంగ ప్రదేశాలు ఐదు విస్తృత అంశాలు (i) అందుబాటు మార్గాలు (ii) సౌకర్యాలు (iii) కార్యకలాపాలు (iv) సౌందర్యం మరియు (v) జీవావరణ శాస్త్రం వంటి అంశాల ఆధారంగా నిర్ణయించబడతాయి. నగర సుందరీకరణ పోటీ నగర స్థాయిలో అత్యంత అందమైన వార్డులు మరియు అందమైన బహిరంగ స్థలాలను ప్రోత్సహిస్తుంది. ఎంపిక చేయబడిన వార్డులు నగరం మరియు రాష్ట్ర స్థాయిలలో, నగరాలలో అత్యంత అందమైన బహిరంగ ప్రదేశాలు నగర స్థాయిలో సత్కరించబడతాయి. జలదృశ్యాలు, హరిత వనాలు, పర్యాటక/వారసత్వ ప్రదేశాలు, మార్కెట్/వాణిజ్య స్థలాలకు మొదటి దశ లో రాష్ట్ర స్థాయిలో ప్రదానం చేయబడి, ఆపై జాతీయ స్థాయిలో అవార్డు కోసం ఎంపిక చేయబడతాయి. వార్డులు మరియు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పట్టణ స్థానిక సంస్థలను వారి ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రోత్సహిస్తుందని మరియు పట్టణ ప్రాంతాలను అందంగా, ఆహ్లాదంగా మరియు అందరినీ కలుపుకొని పోయే సమ్మిళితం చేస్తుందని ఆశిస్తున్నాము.
పట్టణ ప్రణాళిక, డిజైన్, ఇంజనీరింగ్, సంస్కృతి నిపుణులు, పర్యావరణవేత్తలు వివిధ రంగాలకు చెందిన ఇతర నిపుణులు సభ్యులు గా ఉండే స్వతంత్ర జ్యూరీ వార్డులు మరియు నగరాల ఎంట్రీలను మూల్యాంకనం చేస్తారు.
పోటీపడే వార్డులు మరియు నగరాలు తమ ఎంట్రీలను సిటీ బ్యూటీ పోర్టల్‌లో సమర్పించబడతాయి, వీటిని మంత్రిత్వ శాఖ విజ్ఞాన భాగస్వాములు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రూపొందించారు. పోటీలో పాల్గొనే వారు తమ వార్డు/ బహిరంగ ప్రదేశాల అర్హతలసూచికలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. ఎంట్రీలు జ్యూరీచే నిర్ణయించబడతాయి. జ్యూరీని సులభతరం చేయడానికి, మూడవ పక్షం స్వతంత్ర అంచనా కూడా నిర్వహించబడుతుంది. విజేత ఎంట్రీలపై జ్యూరీ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది.
నగర సుందరీకరణ పోటీలో పాల్గొనడం స్వచ్ఛందంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ, అన్ని వార్డులు మరియు నగరాలు పాల్గొనమని ప్రోత్సహిస్తారు, ఇది వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీని సృష్టిస్తుంది, అదే సమయంలో సామాజిక యాజమాన్యం, స్థానిక ప్రతిష్ఠ గౌరవ భావాన్ని కూడా పెంచుతుంది. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఈ ప్రయత్నం, నగర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ, క్రియాత్మకంగా అందమైన బహిరంగ ప్రదేశాలను సృష్టించేందుకు వారి చొరవలు మరియు ప్రయత్నాలను ప్రదర్శించడానికి నగర సుందరీకరణలో ముందుకు రావడానికి వార్డులు మరియు నగరాలను ప్రోత్సహిస్తుంది.
***
(Release ID: 1887149)
Visitor Counter : 224