సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రశాసన్ గావ్ కి ఒరే 2022 విజన్ ఇండియా @ 2047 పై రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లు నిర్వహించి, పౌర ఫిర్యాదుల పరిష్కారం మరియు సేవ వినతుల పరిష్కారంలో గణనీయమైన పురోగతిని సాధించింది.


53.80 లక్షల పౌర ఫిర్యాదు కేసులు పరిష్కరించబడ్డాయి; 310 లక్షల సేవా వినతుల దరఖాస్తులు పరిష్కారించబడ్డాయి

జిల్లా స్థాయిలో సుపరిపాలనలో 949 ఆవిష్కరణలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో 563 విజయగాథలు నివేదించబడ్డాయి

విజన్ ఇండియా@2047 257 జిల్లాల్లో జిల్లా స్థాయి పత్రాలు తయారు చేయబడ్డాయి

Posted On: 27 DEC 2022 4:11PM by PIB Hyderabad

ప్రభుత్వం అమృత్ కాల వ్యవధిలో డిసెంబర్ 19-25, 2022 వారాన్ని రెండవ సుశాసన్ సప్తః (సుపరిపాలనా వారం)గా జరుపుకుంది. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవప్రధాన మంత్రి తన శుభాకాంక్షలు  తెలిపారు. గౌరవ ప్రధాన మంత్రి "ఈ సంవత్సరం కూడా ప్రశాసన్ గావ్ కి ఒరే ప్రచారం సుపరిపాలన వారంలో భాగంగా కొనసాగడం హర్షణీయం" అని అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ జీ“ప్రశాసన్ గావ్ కి ఒరే” రెండవ దేశవ్యాప్త ప్రచారాన్ని డిసెంబర్ 19, 2022న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, ముఖ్య కార్యదర్శులు/అడిషనల్ చీఫ్ సెక్రటరీలు మరియు 36 రాష్ట్రాలు/యూటీల ఏ ఆర్ కార్యదర్శులు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలు నుండి సీనియర్ అధికారులతో సహా 2700 మంది అధికారులు పాల్గొన్నారు. 

 

సుశాసన్ సప్త్ 2022 ప్రజా ఫిర్యాదుల పరిష్కారం మరియు సేవల మెరుగుపరచడం కోసం రెండవ దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించారు. ప్రశాసన్ గావ్ కి ఒరే 2022 గణనీయమైన పురోగతిని సాధించింది - 53.80 లక్షల ప్రజా ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి, 310 లక్షల సేవా దరఖాస్తులు పరిష్కరించబడ్డాయి, సుపరిపాలనలో 949 ఆవిష్కరణలు నమోదు చేయబడ్డాయి మరియు 257 విజన్ ఇండియా@2047 జిల్లా స్థాయి డాక్యుమెంట్‌లు జీ జీ డబ్ల్యూ 22 పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి.

 

విజన్ ఇండియా@2047ఆవిష్కరణలు పై చర్చించడానికి డిసెంబర్ 23, 2022న భారతదేశంలోని మొత్తం 768 జిల్లాల్లో జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లు జరిగాయి. జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లకు ఆ జిల్లాలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అధ్యక్షత వహించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు/ యూ టీ లకు చెందిన ఎల్ జీ లు ప్రశాసన్ గావ్ కి ఒరే ప్రచారానికి  సందేశాలు మరియు ట్వీట్లతో మద్దతు ఇచ్చారు. సిబ్బంది, పౌర సమస్యలు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 121వ నివేదికలో ప్రశాసన్ గావ్ కి ఒరే ప్రచారం యొక్క అద్భుతమైన విజయాన్ని ప్రశంసించింది. అటువంటి ప్రచారాలను మరింత తరచుగా నిర్వహించాలని సిఫార్సు చేసింది.

 

ప్రశాసన్ గావ్ కి ఒరే  ప్రచారం మరియు సుపరిపాలన వారోత్సవం 2022 మొత్తం ప్రభుత్వ విధానం అమలు విధానం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరియు జిల్లా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరియు తహసీల్ స్థాయి వరకు పనిచేసి,"గరిష్ట పాలన - కనిష్ట ప్రభుత్వం" అనే దేశ పాలనా నమూనాను బలంగా ముందుకు తీసుకెళ్లడంలో  సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచాయి.

***


(Release ID: 1886993) Visitor Counter : 146