సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తగిన నిధులతో జాతీయ ఎవీజీసీ-ఎక్స్ ఆర్ మిషన్ నెలకొల్పాలని నివేదికలో సిఫార్స్ చేసిన ఎవీజీసీ టాస్క్ ఫోర్స్


భారతదేశం, ప్రపంచ దేశాలకు అవసరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి 'క్రియేట్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభించాలి.. టాస్క్ ఫోర్స్ సూచన

ప్రతిభను వెలికి తీయడానికి, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి అనువైన పరిస్థితి కల్పించాలి.. టాస్క్ ఫోర్స్

పాఠశాల స్థాయిలో ఎవీజీసీ పాఠ్య అంశాలు ప్రవేశ పెట్టి ఎన్ఈపీ సహకారంతో సృజనాత్మక ఆలోచనలు అభివృద్ధి చేయడానికి చర్యలు అమలు జరగాలి..టాస్క్ ఫోర్స్ సూచన

Posted On: 26 DEC 2022 3:13PM by PIB Hyderabad

దేశంలో యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్ మరియు కామిక్స్ (ఎవీజీసీ) రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేయడానికి తగిన నిధులతో జాతీయ ఎవీజీసీ-ఎక్స్ ఆర్ మిషన్ నెలకొల్పాలని యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్ మరియు కామిక్స్ (ఎవీజీసీ) ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సూచించింది. సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన దేశంలో  టాస్క్ ఫోర్స్ యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్ మరియు కామిక్స్ (ఎవీజీసీ) రంగం అభివృద్ధికి అమలు చేయాల్సిన చర్యలపై సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు ఒక వివరణాత్మక నివేదిక సమర్పించింది.  భారతదేశంలోభారతదేశం కోసం ప్రపంచం కోసం పేరిట తగిన నిధులతో జాతీయ ఎవీజీసీ-ఎక్స్ ఆర్ మిషన్ నెలకొల్పాలని టాస్క్ ఫోర్స్ తన నివేదికలో సూచించింది. 

నాలుగు విభాగాల కింద టాస్క్ ఫోర్స్ తన నివేదిక సిద్ధం చేసింది. 

ఎ. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా స్వదేశీ రంగం అభివృద్ధి 

i. ఎవీజీసీ రంగానికి ప్రోత్సాహం అందించి సమగ్ర అభివృద్ధి సాధించేందుకు తగిన నిధులతో జాతీయ ఎవీజీసీ-ఎక్స్ ఆర్ మిషన్ ఏర్పాటు 
ii. 
అంశాలను గుర్తించి అభివృద్ధి చేయడానికి  ప్రత్యేక దృష్టితో భారతదేశంలోభారతదేశం కోసంప్రపంచం కోసం 'భారతదేశంలో సృష్టించు 'కార్యక్రమాన్ని  ప్రారంభించడం.  

iii. ఎవీజీసీ రంగంలో భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చే లక్ష్యంతోఎఫ్‌డిఐకో-ప్రొడక్షన్ ఒప్పందాలు మరియు ఆవిష్కరణలపై దృష్టి సారించిగేమింగ్ ఎక్స్‌పోతో పాటు అంతర్జాతీయ ఎవీజీసీ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయడం. 
iv. 
ఎవీజీసీ రంగానికి అవసరమైన  నైపుణ్యంవిద్యపరిశ్రమల అభివృద్ధి మరియు పరిశోధనఆవిష్కరణలలో భారతదేశం గుర్తింపు సాధించేలా చూడడానికి  ఎవీజీసీ రంగం  కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)ని ఏర్పాటు చేయడం. స్థానిక పరిశ్రమలకు సహకారం  అందించడానికి మరియు స్థానిక ప్రతిభను మరియు కంటెంట్‌ను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రాంతీయ  సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయాలి. 

భౌగోళిక పరంగా అందుబాటులో ఉన్న అవకాశాలను గుర్తించి విధంగా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం 

i. పాఠశాల స్థాయిలో ప్రత్యేక ఎవీజీసీ కోర్సు అంశాలతో  సృజనాత్మక ఆలోచనలు  అభివృద్ధి చేయడానికి,  నైపుణ్యాలను పెంపొందించడానికి మరియు ఎవీజీసీ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవడానికి గల అవకాశాలు వివరించి జాతీయ విద్యా విధానం ద్వారా అవగాహన కల్పించడం. 
ii. 
ప్రామాణిక పాఠ్యాంశాలు మరియు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డిగ్రీలతో ఎవీజీసీ కి ప్రాధాన్యత ఇస్తూ యూజీ/పీజీ  కోర్సులు ప్రారంభించాలి . ఎవీజీసీ సంబంధిత కోర్సుల (అనగా, MESC ద్వారా MECAT) ప్రవేశ పరీక్షలు ప్రవేశపెట్టడం 
iii. 
ఈ దశాబ్దంలో ఎవీజీసీ విభాగంలో 20 లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఉంటుంది అన్న అంశాన్ని దృష్టిలో  ఉంచుకుని  MESC కింద ఎవీజీసీ రంగానికి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. . నాన్-మెట్రో నగరాలు మరియు ఈశాన్య ప్రాంత  రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ  ఉపాధి అవకాశాలు పొందేలా చూడడానికి పరిశ్రమ సహకారం తీసుకోవాలి. 
iv. 
అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల తరహాలో విద్యా సంస్థలలో ఎవీజీసీ యాక్సిలరేటర్లు మరియు ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేయాలి. 

సి. భారతదేశ  ఎవీజీసీ రంగం ఆర్ధికంగాసాంకేతికంగా అభివృద్ధి 

i. ఎంఎస్ఎంఈ స్టార్ట్-అప్‌లు మరియు సంస్థలకు  సబ్‌స్క్రిప్షన్-ఆధారిత ధరల నమూనాలను అందించడం ద్వారా  ఎవీజీసీ రంగానికి సాంకేతికత సహకారం అందించడం 

ii. పరిశోధన అభివృద్ధి  మరియు ఐపీ ఆవిష్కరణల కోసం  ప్రోత్సాహక పథకాలు అమలు చేసి 'మేడ్ ఇన్  ఇండియాద్వారా  ఎవీజీసీ రంగానికి అవసరమైన  స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం.     ఎవీజీసీ   హార్డ్‌వేర్ తయారీదారులను ప్రోత్సహించడానికి పీఎల్ఐ  పథకాన్ని అమలు చేయడం. 

iii.పన్ను ప్రయోజనాలుదిగుమతి సుంకాలుపైరసీని అరికట్టడం మొదలైన చర్యల ద్వారా ఎవీజీసీ రంగంలో సులభతర వ్యాపార నిర్వహణ ప్రోత్సహించడం 

iv. పరిశోధనఅభివృద్ధి కార్యక్రమాలకుస్థానిక ఐపీ అభివృద్ధి  ప్రోత్సహించడానికి  ఎవీజీసీ వ్యవస్థాపకులకు సాంకేతికఆర్థిక మరియు మార్కెట్ అవకాశాలు అందించడానికి స్టార్ట్-అప్ ఇండియా సహకారం తీసుకోవడం. 

సమ్మిళిత అభివృద్ధి ద్వారా భారతదేశం బలీయ శక్తిగా రూపొందేందుకు చర్యలు 

i.                    ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి,వారసత్వాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం అంతటా దేశీయ కంటెంట్ సృష్టి కోసం ప్రత్యేక ఉత్పత్తి నిధిని ఏర్పాటు చేయాలి. . ప్రసారకర్తల ద్వారా అధిక-నాణ్యత గల దేశీయ కంటెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి 

ii.                  .  భారతదేశంలోని టైర్ 2, 3 పట్టణాలు మరియు గ్రామాలలో  నివసిస్తున్న యువత  నైపుణ్యంప్రతిభ గుర్తించడానికిఉపాధి కల్పన ద్వారా వారిని ప్రోత్సహించి సమ్మిళిత భారతదేశం కోసం కృషి జరగాలి. ఎవీజీసీ రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించాలి. 

iii.                 పిల్లలు మరియు యువతలో భారతదేశ గొప్ప సంస్కృతి మరియు చరిత్ర పై అవగాహన పెంచడానికి స్థానిక పిల్లల ఛానెల్‌లను ప్రోత్సహించాలి 

iv.                 డిజిటల్ ప్రపంచంలో బాలల హక్కుల రక్షణను నిర్ధారించడానికి వ్యవస్థ  ఏర్పాటు కావాలి. 

సమాచార ప్రసార మంత్రిత్వ  శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర అధ్యక్షతన ఎవీజీసీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటయింది.దేశంలో  ఎవీజీసీ రంగం  పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలు పరిశీలించడానికి ఎవీజీసీ రంగంతో సంబంధం ఉన్న అన్ని వర్గాలు, ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటయింది. సభ్యులుగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యా శాఖ, ఉన్నత విద్య, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంతర్గత వాణిజ్య, పరిశ్రమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ  కార్యదర్శులు ఉన్నారు. కర్ణాటకమహారాష్ట్రతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సభ్యులుఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వంటి విద్యా సంస్థల అధిపతులు మరియు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులుఫిక్కీ సీఐఐ ప్రతినిధులు టాక్స్ ఫోర్స్ సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు  ఎవీజీసీ రంగం నుంచి  

 శ్రీ బీరెన్ ఘోష్కంట్రీ హెడ్టెక్నికలర్ ఇండియా,  శ్రీ ఆశిష్ కులకర్ణిపునర్యుగ్ ఆర్ట్‌విజన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడుశ్రీ జేష్ కృష్ణ మూర్తిఅని బ్రెయిన్  వ్యవస్థాపకుడు మరియు సీఈవో శ్రీ కీతన్ యాదవ్, COO మరియు VFX నిర్మాతరెడ్ చిల్లీస్ VFX, శ్రీ చైతన్య చించ్లికర్చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్విజిలింగ్  వుడ్స్ ఇంటర్నేషనల్,  శ్రీ కిషోర్ కిచిలీసీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ హెడ్జింగా ఇండియా మరియు శ్రీ నీరజ్ రాయ్హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో టాస్క్ ఫోర్స్ సభ్యులుగా వ్యవహరించారు. 

రంగాల వారీగా అభివృద్ధి వ్యూహాలను రూపొందించడానికి నాలుగు సబ్-టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేయబడ్డాయిఎ) సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి  శ్రీ అపూర్వ చంద్ర  నేతృత్వంలో పరిశ్రమవిధానం  బి)  AICTE పూర్వ అధ్యక్షుడు శ్రీ అనిల్ షహష్రబుధే నేతృత్వంలో విద్య,  సి) నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ పూర్వ కార్యదర్శి  శ్రీ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని నైపుణ్యం, d) సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  శ్రీ విక్రమ్ సహాయ్ నేతృత్వంలో గేమింగ్  విభాగాల సబ్-టాస్క్ ఫోర్స్‌ బృందాలు అందించిన సిఫార్సులు ఆధారంగా  టాస్క్ ఫోర్స్ సమగ్ర  నివేదిక సిద్దమయ్యింది. 

మన మార్కెట్‌లకు మరియు ప్రపంచ డిమాండ్‌కు సేవలందించడానికి దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేయాల్సిన చర్యలను గుర్తించడానికి ఎవీజీసీ  టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అవుతుందని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో  ప్రకటించింది.
AVCG-XR రంగం  యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు అందించిఈ రంగంలో భారతదేశం కీలక శక్తిగా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచన సాకారం అయ్యేలా చూడడానికి టాస్క్ ఫోర్స్ నివేదిక సహకరిస్తుంది. 
భారతదేశంలో ఎంఈ  పరిశ్రమ అభివృద్ధికి  ఎవీజీసీ  రంగం ఒక ప్రధాన వృద్ధి చోదకంగా ఉపయోగపడుతుందని కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ గుర్తించారు.  ఆర్థిక అభివృద్ధి సాధించడంతో పాటు  భారతీయతను మరింత మెరుగ్గా వ్యాప్తి చేయడానికి మరియు ప్రోత్సహించే సామర్థ్యాన్ని ఎవీజీసీ  కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు.  ప్రపంచానికి సంస్కృతిప్రవాస భారతీయులను భారత్‌తో మరింత బలంగా అనుసంధానించండిప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నాణ్యమైన ఉపాధి అవకాశాలు అందించి   పర్యాటకం మరియు ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది. సమాచార మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ https://mib.gov.in/sites/default/files/AVGC-XR%20Promotion%20Taskforce%20Report%20-%202022.pdf లో పూర్తి నివేదిక అందుబాటులో ఉంది.

 

***


(Release ID: 1886718) Visitor Counter : 202