కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
తగినంత ఫైబర్ నెట్‌వర్క్‌లు
Posted On:
23 DEC 2022 1:26PM by PIB Hyderabad
దేశంలో 30.09.2022 నాటికి మొత్తం 35.5 లక్షల రూట్ కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఒఎఫ్‌సి) ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మెరుగైన బ్యాండ్ విడ్త్, స్థితిస్థాపక,అధిక వాల్యూమ్ అనుసంధానత కోసం పెరుగుతున్న డిమాండ్‌ను సులభతరం చేస్తుంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌కు 5జి అనుసంధానతను నిర్వహించగల అపారమైన సామర్ధ్యం ఉంటుంది. అంతేకాక, మరింత వేగవంతమైన, సులవైన టెలికాం మౌలిక సదుపాయాల మోహరింపును సులభతరం చేసేందుకు ఇండియన్ టెలిగ్రాఫ్ రైట్ ఆఫ్ వే రూల్స్, 2016ను ఆగస్టు 17, 2022న ప్రభుత్వం సవరించింది. ఈ సవరణలు, ప్రస్తుతం ఉన్న రహదారి అవస్థాపనపై 5జి చిన్న సెల్స్‌ను, ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను వేసేందుకు మార్గాన్ని సుగమం చేస్తాయి.
ప్రభుత్వంతో పాటుగా టెలికాం కంపెనీలు కేవలం దేశం నలుమూలలా మాత్రమే కాక, నగర, మారుమూల ప్రాంత అనుసంధానతను బలోపేతం చేసేందుకు పఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను వేశాయి. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలు తగినంతగా అనుసంధానమయ్యాయి. దేశంలోని గ్రామ పంచాయతీలు (జిపిలు) అన్నింటికీ పైబర్ అనుసంధానతను అందించేందుకు దశలవారీగా భారత్ నెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దేశంలోని జిపిల ఆవల ఉన్న గ్రామాలకు కూడా భారత్ నెట్ ప్రాజెక్ట్ పరిధిని విస్తరించడం జరిగింది.
ఈ సమాచారాన్ని కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ శుక్రవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1886292)
Visitor Counter : 129