శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కంబోడియాలో 3వ ఆసియాన్ దేశాల భారత క్షేత్రస్థాయ నవకల్పన పోటీలు విజేతగా నిలిచి భారతదేశానికి గర్వకారణంగా మారిన యువతి

Posted On: 22 DEC 2022 9:31AM by PIB Hyderabad

భారతదేశానికి చెందిన శాలినీ కుమారి కంబోడియాలో జరిగిన 3వ ఆసియాన్ దేశాల క్షేత్రస్థాయ నవకల్పన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు.  సర్దుబాటు చేయగల కాళ్లతో మార్పులు చేసిన వాకర్ తయారు చేశారామె.  ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమకు బదలాయించారు. దేశంలో కృత్రిమ అవయవాలు తయారు చేసే పేరుమోసిన సంస్థ విస్కో రిహాబిలిటేషన్ ఎయిడ్స్ ద్వారా కొనుగోలు చేసే అవకాశముంది. బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్స్ ద్వారా, అమెజాన్ ఇండియా ద్వారా కూడా దేశంలోని సామాన్యులు కొనుగోలు చేసే అవకాశముంది.

కంబోడియా కోస్టీ  ఛైర్మన్, సైన్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హాల్ సీంఘెంఘ్ నుంచి శాలినీ కుమారి ఈ బహుమతి అందుకున్నారు.  ఈ విభాగం కాంబోడియాలోని ఇండస్ట్రీ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ మంత్రిత్వశాఖ కిందికి వస్తుంది. మొదటి బహుమతిగా శాలినీ కుమారికి 1500  అమెరికా డాలర్లు లభించాయి..

ఆసియాన్ కమిటీ ఆన్ సైన్స్ , టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన 3 వ ఆసియాన్ ఇండియా క్షేత్రస్థాయి నవకల్పనల వేదికలో నేడు కాంబోడియాలోని నాంఫెన్ లో  చివరిదైన మూడో రోజు ఫలితాలు ప్రకటించారు.  పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామంత్రి  చేతులమీదుగా ఈ బహుమతి ప్రధాన జరిగింది. రెండు విభాగాలలో నవకల్పనలకు పోటీలు జరపటంతోబాటు విద్యార్థుల విభాగం ఏర్పాటు చేయటం, చర్చా వేదికల నిర్వహణ, ఆసియాన్ సభ్యదేశాల ప్రతినిధుల వక్తల ప్రసంగాలు, ప్రదర్శనలు జరిగాయి. భారత్ చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  

ఈ సందర్భంగా కంబోడియా గౌరవ మంత్రి మాట్లాడుతూ ఇలా పాల్గొనటం వలన ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకునే అవకాశం ఉందన్నారు. 9 దేశాలకు చెందిన వందకు పైగా సాంకేతిక పరిజ్ఞానాలను ఈ మూడు రోజుల ప్రదర్శనలో ప్రదర్శించారు. కాంబోడియాలో భారత రాయబారి రిచ్ పాల్ సింగ్, కంబోడియా సైన్స్ అండ్ టెక్నాలజీ అధిపతి డాక్టర్ జూరీనా మోక్తార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  అదే సమయంలో వివిధ దేశాల ప్రతినిధులు కూడా చర్చలు జరిపారు.

రెండు, మూడు బహుమతులను ఫిలిప్పైన్స్, మయన్మార్ గెలుచుకున్నాయి. వారికి వెయ్యి డాలర్లు, 500 డాలర్లు చొప్పున ఇచ్చారు.  మొత్తంగా క్షేత్రస్థాయి నవకల్పనలతో 9 దేశాలకు చెందిన 45 మంది పోటీపడ్డారు. విద్యార్థి విభాగంలో మొదటి రెండు బహుమతులు థాయిలాండ్ దక్కించుకోగా మూడో బహుమతి లావో పీడీఆర్ కు వచ్చింది. ఈ విభాగంలో 9 దేశాలకు చెందిన 37 మంది పోటీ పడ్డారు.   

భారతదేశానికి చెందిన మొదటి బహుమతి విజేత శాలినీ కుమారి బీహార్ లోని పాట్నా నివాసి. ఆమెలోని శక్తిని ముందుగా భారత్ లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గుర్తించింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ కిందికి వస్తుంది.   

 

క్షేత్రస్థాయి నవకల్పనల పోటీ  

మొదటి బహుమతి

భారత్ - శాలినీ కుమారి

సర్దగల కాళ్ళతో మార్చిన వాకర్ 

రెండో బహుమతి

ఫిలిప్పైన్స్ - మెరియం బౌకీయా

బహుళార్థసాధక ఫైబర్ స్ట్రి ప్పర్

మూడో బహుమతి

 మయన్మార్  - మయో థా

తాటి కల్లుతో తాటికొబ్బరి

నవకల్పనలో విద్యార్థుల పోటీ  

మొదటి బహుమతి  

థాయిలాండ్  - నాపాశ్చోల్  ఇంతపాన్

ఓఆర్ఎ (ఆస్టియో ఆరథ్రైటీస్ రిహాబిలిటేషన్ అసిస్టెంట్ )

రెండో బహుమతి

థాయిలాండ్ - తనపత్ చరుణ్ వోరాఫాన్

గుండెను అదుపులో ఉంచే హెల్త్ టెక్

మూడో బహుమతి

లావో పీడీఆర్ - ఫోన్సేనా. చాంతావాంగ్

నదిని శుభ్రంగా ఉంచే తెలివైన పడవ

 

***(Release ID: 1885987) Visitor Counter : 128