శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కవలూరులోని వైను బప్పు అబ్జర్వేటరీలో 40 అంగుళాల టెలిస్కోప్ యొక్క ఖగోళ నక్షత్ర ఆవిష్కరణలు 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల వేడుకలో ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి.

Posted On: 21 DEC 2022 9:01AM by PIB Hyderabad

తమిళనాడులోని కావలూర్‌లోని వైను బప్పు అబ్జర్వేటరీలో 40-అంగుళాల టెలిస్కోప్ యొక్క అనేక ఖగోళ నక్షత్రాల ఆవిష్కరణలు డిసెంబర్ 15-16న  50 సంవత్సరాల స్వర్ణోత్సవాల వేడుకలో ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి.

 

ప్రొఫెసర్ వైను బప్పు ఏర్పాటు చేసిన టెలిస్కోప్ యురేనస్ గ్రహం చుట్టూ వలయాలు ఉండటం, యురేనస్ యొక్క కొత్త ఉపగ్రహం, బృహస్పతి ఉపగ్రహమైన గనిమీడ్ చుట్టూ వాతావరణం ఉండటం వంటి ప్రధాన ఆవిష్కరణలతో ఖగోళ శాస్త్రంలో గణనీయమైన పాత్ర పోషించింది. ఈ టెలిస్కోప్‌తో నిర్వహించబడిన ఇతర ముఖ్యమైన పరిశోధనలలో అనేక 'బి స్టార్స్' యొక్క ఆవిష్కరణ మరియు అధ్యయనం, జెయింట్ స్టార్‌లలో లిథియం క్షీణత, బ్లేజర్‌లలో ఆప్టికల్ వేరియబిలిటీ, ప్రసిద్ధ సూపర్‌నోవా ఎస్ ఎన్ 1987 ఏ యొక్క గతి శీలత మొదలైనవి ఉన్నాయి.

 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST)కి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) ఆధ్వర్యంలోని అబ్జర్వేటరీలోని టెలిస్కోప్, ఇంజనీర్లు మరియు ఖగోళ శాస్త్రవేత్తలు గత 50 సంవత్సరాలుగా నిర్మించిన సాంకేతిక సాధనాల కారణంగా సంబంధిత రంగం లో అన్వేషణ కొనసాగుతోంది. ఈ టెలిస్కోప్  విదేశీ సహచరుల మధ్య పోటీ లో నిలుస్తోంది. 1976లో క్యాస్‌గ్రెయిన్ ఫోటోమీటర్ మరియు ఎచెల్ స్పెక్ట్రోగ్రాఫ్ నుండి ప్రారంభించి, 1978లో కొత్త గ్రేటింగ్ స్పెక్ట్రోగ్రాఫ్, 1988లో ఫాస్ట్-ఛాపింగ్ పోలారిమీటర్ 2016లో దాని ప్రత్యామ్నయం తో మరియు 2021లో సరికొత్త ఎన్ ఐ ఆర్ ఫోటోమీటర్, అబ్జర్వేటరీ తన సౌకర్యాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తూనే ఉంది.

 

"ఈ టెలిస్కోప్ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ల నుండి ఆధునిక సి సి డి ల వరకు ఖగోళ పరిశీలనలలో సాంకేతిక మార్పులకు సాక్షిగా నిలుస్తుంది" అని ఐ ఐ ఎ డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమణ్యం అన్నారు. "ఈ సదుపాయం తో ఖగోళ అన్వేషణ ఉత్పాదకత కొనసాగుతుందని మరియు రాబోయే సంవత్సరాల్లో శాస్త్రవేత్తలచే ఉపయోగించబడుతుందని నేను విశ్వసిస్తున్నాను" అని ఆమె అన్నారు.

 

1960ల నాటికి, ఆధునిక ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు చేయడానికి భారతదేశానికి అధిక-నాణ్యత గల ఆప్టికల్ అబ్జర్వేటరీ అవసరమని స్పష్టమైంది మరియు విస్తృతమైన అన్వేషణ తర్వాత, ప్రొఫెసర్ వైను బప్పు అటువంటి అబ్జర్వేటరీ కోసం కావలూర్‌ను ఎంచుకున్నారు. కవలూర్ పైన ఉన్న ఆకాశం అద్భుతమైనది మరియు దాని దక్షిణ ప్రదేశం ఉత్తర మరియు దక్షిణ ఆకాశాలను చాలా వరకు చూడటానికి అనుమతిస్తుంది. అబ్జర్వేటరీ కార్యకలాపాలు ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత, ప్రొఫెసర్ బప్పు జెనా (అప్పటి తూర్పు జర్మనీ)కి చెందిన కార్ల్ జీస్‌తో 40-అంగుళాల టెలిస్కోప్ కోసం ఆర్డర్ ఇచ్చాడు, అది తదనంతరం 1972లో స్థాపించబడింది.

 

40 అంగుళాల (లేదా 102 సెం.మీ.) వ్యాసం కలిగిన టెలిస్కోప్ 1972లో వ్యవస్థాపించబడింది మరియు వెంటనే ముఖ్యమైన ఖగోళ ఆవిష్కరణలను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఒక తరం కంటే ఎక్కువ ఖగోళ శాస్త్రవేత్తలు ఈ టెలిస్కోప్‌లో శిక్షణ పొందారు. ఐ ఐ ఎ ఇంజనీర్లు పొందిన నైపుణ్యం తో 1980లలో పూర్తిగా స్వదేశీ 90-అంగుళాల (2.34 మీటర్లు) టెలిస్కోప్‌ను నిర్మించడానికి వీలు కల్పించింది.

 

ఈ అసాధారణ టెలిస్కోప్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని, ఐ ఐ ఎ తన బెంగళూరు క్యాంపస్‌లో డిసెంబర్ 15న సమావేశాన్ని నిర్వహించింది, ఆ తర్వాత 16న కావలూరులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అనేక మంది రిటైర్డ్ ఐ ఐ ఎ ఖగోళ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు టెలిస్కోప్ సహాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు డైరెక్టర్ ఐ ఐ ఎ పలువురిని సత్కరించారు. 40-అంగుళాల టెలిస్కోప్ అందించిన ముఖ్యమైన సైన్స్ ఆవిష్కరణల గురించి అనేక చర్చలు అలాగే ఆ సమయం నుండి పనిచేసిన సిబ్బంది వ్యక్తిగత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఐ ఐ ఎ విద్యార్థులు ప్రచురించిన ఖగోళ శాస్త్ర పత్రిక “దూత్” 7వ సంచిక కూడా ఈ కార్యక్రమంలో విడుదల చేయబడింది.

 

కావలూరు పరిసర గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు 40 అంగుళాల టెలిస్కోప్‌ అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విజేతలకు 16వ తేదీన ఆబ్జర్వేటరీలో జరిగిన కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేశారు.

 

 

 

 

***


(Release ID: 1885372) Visitor Counter : 165