ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


ఆరోగ్య రక్షణ, శరీర దారుద్ధ్యం కోసం ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలి.. డాక్టర్ మాండవీయ

సైకిల్ తొక్కడం ఫ్యాషన్ కాకుండా అభిరుచిగా మారాలి, సైకిల్ దనవంతుల వాహనంగా కాకుండా సామాన్యుని వాహనంగా మారాలి.. డాక్టర్ మాండవీయ

సైకిల్ ర్యాలీలు పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేస్తాయి.. డాక్టర్ మాండవీయ

Posted On: 19 DEC 2022 11:24AM by PIB Hyderabad

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన సైకిల్లో ర్యాలీలో  కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. “ధరిత్రిని రక్షించండి జీవితాలను రక్షించండి ” నినాదంతో  సైకిల్ ర్యాలీ జరిగింది. నిర్మాణ్ భవన్ నుంచి  ప్రారంభమైన ర్యాలీ  కర్తవ్య మార్గం మీదుగా సాగింది. అనేక మంది ఔత్సాహికులు  ఉదయం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.  శారీరక వ్యాయామం చేయడం ఆరోగ్యం రక్షించుకొనే విధంగా ప్రజలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ర్యాలీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించింది. 

''గ్రీన్ ఎంపీ''గా గుర్తింపు పొందిన డాక్టర్ మాండవీయ సైకిల్ తొక్కడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సైకిల్ తొక్కి ఆరోగ్యం, శరీర దారుద్ధ్యం రక్షించుకోవాలని డాక్టర్ మాండవీయ పిలుపు ఇచ్చారు. శీతాకాల చలిని లెక్క చేయకుండా ర్యాలీ లో పాల్గొన్న వారిని మంత్రి అభినందించారు. " సైకిల్ వల్ల వాతావరణం కలుషితం కాదు.  కాలుష్యం లేని వాహనం కాబట్టి పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి చక్రం గణనీయంగా సహాయపడుతుంది. అనేక అభివృద్ధి చెందిన దేశాలు పెద్ద ఎత్తున సైకిల్‌లను ఉపయోగిస్తున్నాయి. భారతదేశంలో సైకిల్ ని పేదవాడి వాహనంగా పిలుస్తారు, దీనిని ధనవంతుల వాహనంగా మార్చడం మా లక్ష్యం. ఇది "ఫ్యాషన్" నుండి "అభిరుచి"గా మార్చాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ఎర్త్ మరియు హెల్త్ ఎర్త్ కోసం సైకిల్ తొక్కడం మన జీవితంలో భాగం చేద్దాం" అని డాక్టర్ మాండవీయ అన్నారు. 

ఆరోగ్య పరిరక్షణకు శారీరక వ్యాయామం తప్పనిసరి అని స్పష్టం చేసిన డాక్టర్ మాండవీయ సైకిల్ తొక్కడం కూడా ఒక శారీరక  వ్యాయామం  అని అన్నారు. “శారీరక మరియు మానసిక ప్రయోజనాల కోసం మన జీవితంలో వ్యాయామాన్ని అలవర్చుకోవాలి. శారీరక కార్యకలాపాలు అనేక అంటువ్యాధులు, జీవనశైలి వల్ల సంక్రమించే  వ్యాధులను దూరంగా ఉంచుతాయి.ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణ కోసం “గో-గ్రీన్” కార్యక్రమాన్ని అమలు చేస్తున్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ ని డాక్టర్ మాండవీయ అభినందించారు. 

సైకిల్ ర్యాలీ లో డాక్టర్ మాండవీయ తో పాటు  నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధ్యక్షుడు డాక్టర్ అభిజాత్ షేత్, పాలక మండలి సభ్యులు, సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు. 

  https://www.youtube.com/ watch?v=SgxvYc7i2WI లో కార్యక్రమాన్ని చూడవచ్చు. 

 

***



(Release ID: 1884848) Visitor Counter : 145