ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎయిమ్స్ బీబీ నగర్‌లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


కొత్తగా ఎంబీబీఎస్ లో చేరిన విద్యార్థులతో మహర్షి చరక్ ప్రతిజ్ఞ చేయించిన కేంద్ర ఆరోగ్య మంత్రి

వైద్య విద్యార్థులు నిబద్ధత మరియు అంకితభావంతో మానవాళికి సేవ చేయాలి.డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 18 DEC 2022 6:38PM by PIB Hyderabad
బీబీనగర్ ఎయిమ్స్ లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) సేవలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు  ప్రారంభించారు .  రియల్ టైమ్ వీడియో స్పెషలిస్ట్ సంప్రదింపులు జరుగుతున్న తీరును మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ABDM అనేది దేశవ్యాప్తంగా ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్యూఆర్ కోడ్ ఆధారంగా రోగుల నమోదు, నమోదైన రోగులు, రోగులకు అందిస్తున్న సేవలు, పరీక్ష కేంద్రాలు అందించిన నివేదిక లాంటి అంశాలను దేశంలో ఏ ఆస్పత్రి నుంచి అయినా చూసి వైద్య  సేవలు అందించడానికి హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS)ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కలిగి ఉంది.. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) కార్డ్ సహాయంతో రోగులు తమ వైద్య రికార్డులను ఎక్కడైనా, ఎప్పుడైనా భారతదేశం అంతటా చూసుకోవడానికి వీలవుతుంది అని  డాక్టర్ మాండవీయ తెలిపారు. 
  కొత్తగా ఎంబీబీఎస్ లో చేరిన విద్యార్థులతో   (2022-23' బ్యాచ్) డాక్టర్ మాండవీయ మహర్షి చరక్ ప్రతిజ్ఞ చేయించారు. మొదటి సంవత్సరం విద్యార్థులను మంత్రి అభినందిస్తూ ఎయిమ్స్ వంటి ప్రఖ్యాత సంస్థ లో చదువుతున్నందుకు  గర్వపడాలి అని  అన్నారు. డాక్టర్ మాండవీయ  మాట్లాడుతూ "ఎయిమ్స్  ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ.ఏదైనా వ్యాధికి ఎయిమ్స్ లో  చికిత్స అందుబాటులో లేకపోతే, దేశం మొత్తంలో మరెక్కడా చికిత్స అందుబాటులో లేదని ప్రజలు భావిస్తారు." అని అన్నారు.  ప్రతి వైద్య విద్యార్థి విజయం సాధించడానికి  నిబద్ధత మరియు అంకితభావంతో పని చేయాలని  కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు. ఆరోగ్యాన్ని ఎప్పుడూ వ్యాపార వస్తువుగా  పరిగణించరాదని విద్యార్థులకు మంత్రి సలహా ఇచ్చారు. వైద్యాన్ని వ్యాపారంగా కాకుండా మానవాళికి చేసే సేవగా భావించాలని  అని శ్రీ మాండవ్య అన్నారు. కోవిడ్ వల్ల ఏర్పడిన  సంక్షోభాన్ని అవకాశంగా పరిగణించకుండా భారతదేశం   హైడ్రాక్సీక్లోరోక్వినైన్ మరియు అజిత్రోమైసిన్ లను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కోవిడ్‌కు ముందు ధరలకు  సరఫరా చేసిందని విద్యార్థులకు మంత్రి గుర్తు చేశారు.  ఇది ‘వసుదైవ కుటుంబం’ సూత్రాలకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. నిరుపేదలకు సేవలందించేందుకు యువ వైద్యులు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేలా ఎయిమ్స్‌లోని ఉపాధ్యాయులు వారిని తీర్చి దిద్దాలని డాక్టర్ మాండవీయ కోరారు. 
 
 
 స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఆరోగ్య మంత్రి సమక్షంలో ఎయిమ్స్  లో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు.   బీబీనగర్‌ ఎయిమ్స్  లో ఎంబీబీఎస్ 1వ సంవత్సరంలో చేరిన విద్యార్థులు 101 ఔషధ  మొక్కలను నాటారు. ఎయిమ్స్ బీబీనగర్‌బై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ భాటియా సంస్థ సాధించిన ప్రగతి నివేదికను  మంత్రికి అందించారు. అనంతరం   ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించిన డాక్టర్ మాండవీయ పురోగతిలో ఉన్న పనులను సమీక్షించారు.
 
 
ఈ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్ ) వికాస్ భాటియా, డీన్ (అకడమిక్స్) ప్రొఫెసర్ (డాక్టర్ ) రాహుల్ నారంగ్, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ (డాక్టర్) నీరజ్ అగర్వాల్ పాల్గొన్నారు.

వివరాలు:

Youtube Live link:https://youtu.be/SDaO_GexZjo

Tweet Links of AIIMS Bibi Nagar event: 

https://twitter.com/PIBHyderabad/status/1604372391810850818?t=wCBCTqWaHirC4RG-D8H3QQ&s=08

https://twitter.com/PIBHyderabad/status/1604368778921250816?t=aUkbJ4QqJtGGOkSXP0gJug&s=08

https://twitter.com/PIBHyderabad/status/1604365500862996481?t=SbKg-KNbXD4emWA66RQn4Q&s=08

https://twitter.com/PIBHyderabad/status/1604374360910753793?t=2mymS_OPMEqbvaHjvXHx4Q&s=08

Relevant Links:

1.   ప్రధానమంత్రి ప్రారంభించిన  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వివరాలు..  

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1758520

https://pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1758502

https://pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1758511

2. జాతీయ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి కోసం జాతీయ ఆరోగ్య మిషన్ సాంకేతిక సంస్థలు/వ్యక్తులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంది. 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1816789

3.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా దేశ ప్రజలు తమ ఆరోగ్య రికార్డులను ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా చూసుకోవచ్చు. 

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1884387

 

***


(Release ID: 1884661) Visitor Counter : 209