ఉక్కు మంత్రిత్వ శాఖ
ఐఇఐ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు 2022 ను గెలుచుకున్న ఎన్ఎండిసి
Posted On:
17 DEC 2022 11:38AM by PIB Hyderabad
గనితవ్వకాలు చేస సంస్థ ఎన్ఎండిసి ప్రతిష్ఠాత్మకమైన ఐఇఐ (ఇనిస్ట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్, ఇండియా) ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు 2022ను శుక్రవారం, 16 డిసెంబర్ 2022న చెన్నైలో సాధించింది. దాని అత్యుత్తమ పనితీరు, ఉన్నత స్థాయి వ్యాపార నైపుణ్యాన్ని గుర్తిస్తూ 37వ ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద ముడి ఇనుము ఉత్పత్తిదారు అయిన ఈ సంస్థను సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె. పొన్ముడి చేతుల నుంచి ఎన్ఎండిసి తరుఫున సిజిఎం (ఐఇ&ఎంఎస్) శ్రీ ఎన్.ఆర్. కె. ప్రసాద్ అవార్డును అందుకున్నారు.కంపెనీ
వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, పర్యావరణ పనితీరు, పరిశోధన & అభివృద్ధి, సిఎస్ఆర్, కార్పొరేట్ పాలనా విధానాలను సమీక్షించిన అనంతరం ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) ఎన్ఎండిసికి ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేసింది. ఒకవైపు దేశీయ స్థాయిలో అగ్రగామిగా తన నాయకత్వాన్ని నిలుపుకుంటూనే, అంతర్జాతీయ మైనింగ్ కంపెనీగా మారేందుకు పర్యావరణ అనుకూల, ఆర్థిక, సమర్ధవంతమైన విధానంతో అవసరమైన పరివర్తక ప్రాజెక్టులను ఎన్ఎండిసి చేపడుతోంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్ఎండిసి ప్రారంభమైనప్పటి నుండి దేశ వృద్ధికి గణనీయమైన ఆర్ధిక సహకారం అందించాలనే దృక్పధంతో దృఢ నిశ్చయంతో ఉందని ఎన్ఎండిసి సిఎండి శ్రీ సుమిత్ దేవ్ అన్నారు. ప్రతి త్రైమాసికంలోనూ తనను తాను అధిగమించేందుకు కృషి చేయడమే కాక వినూతన్న వాణిజ్య వ్యూహాలను సృష్టించేందుకు కంపెనీ కట్టుబడి ఉందన్నారు. ఈ అవార్డు అత్యంత అర్హమైనది, తమ నిబద్ధత, చిత్తశుద్ధితో పని చేసిన బృందాన్ని అభినందిస్తున్నానని, శ్రీ దేవ్ అన్నారు.
***
(Release ID: 1884652)
Visitor Counter : 140