ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబిడిఎం) కింద ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా (ఏబిహెచ్‌ఏ) నంబర్‌లతో 4 కోట్లకు పైగా పౌరుల ఆరోగ్య రికార్డులు డిజిటలైజ్ చేయబడ్డాయి. అలాగే లింక్ చేయబడ్డాయి


పౌరులు తమ డిజిటల్ హెల్త్ రికార్డ్‌లను ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు మరియు నిర్వహించవచ్చు. అలాగే ఏబిడిఎం క్రింద పేపర్-లెస్ డిజిటల్ ఆరోగ్య సేవలను కూడా పొందవచ్చు

Posted On: 17 DEC 2022 2:27PM by PIB Hyderabad

దేశంలో సమగ్ర డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ఫ్లాగ్‌షిప్ పథకం అయిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబిడిఎం) స్థిరమైన పురోగతిని సాధిస్తోంది. వ్యక్తులకు చెందిన ఏబిహెచ్‌ఏ ఖాతాలకు 4 కోట్ల డిజిటల్ హెల్త్ రికార్డ్‌లు అనుసంధానించబడి ఉండటం ద్వారా ఈ పథకం ఒక ముఖ్యమైన మైలురాయిని దాటింది. ఇప్పటివరకు 29 కోట్ల మందికి పైగా పౌరులు తమ ప్రత్యేకమైన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలను (ఏబిహెచ్‌ఏ) రూపొందించారు.

ఆరోగ్య రికార్డులను వారి ఏబిహెచ్‌ఏ ఖాతాలకు డిజిటల్‌గా లింక్ చేయడంతో పౌరులు సౌలభ్యం ప్రకారం ఈ రికార్డులను యాక్సెస్ చేయగలరు. అలాగే నిర్వహించగలరు. ఇది వివిధ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలలో సమగ్ర వైద్య చరిత్రను సృష్టించేందుకు పౌరులను అనుమతిస్తుంది. తద్వారా క్లినికల్ నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా, పౌరులు ఏబిడిఎం రిజిస్టర్డ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్లతో డిజిటల్‌గా సంబంధిత ఆరోగ్య రికార్డులను కూడా పంచుకోవచ్చు.

ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడంలో ఏబిడిఎం పాత్ర గురించి వివరిస్తూ ఎన్‌హెచ్‌ఏ, సీఈఓ డాక్టర్. ఆర్‌. ఎస్‌. మాట్లాడుతూ " నేషనల్ హెల్త్ అథారిటీ డిజిటల్ ఆరోగ్య సేవల ప్రయోజనాలను మరింతగా పొందేలా ఏబిడిఎం వివిధ వాటాదారులతో కలిసి పని చేస్తోంది.  ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌ను మరింత ప్రోత్సహించడానికి ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు మొదలైన ఆరోగ్య సౌకర్యాల కోసం ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించాలని మేము ప్లాన్ చేస్తున్నాము. మేము ఏబిడిఎంతో ఏకీకృతం చేయడానికి వివిధ ఆరోగ్య లాకర్ అప్లికేషన్‌లను కూడా ప్రోత్సహిస్తున్నాము, తద్వారా పౌరులకు తమ డిజిటల్ రికార్డులను నిల్వ చేయడానికి మరియు నిర్వహించడానికి అవకాశం లభిస్తుంది" అని చెప్పారు.

"ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌పై నిరంతర కృషి చేస్తున్నామని అలాగే పేపర్‌లెస్ మెడికల్ కన్సల్టేషన్‌లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. తద్వారా రోగి మరియు హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య ప్రతి లావాదేవీలో మరింత ఖచ్చితత్వం ఉంటుంది" అని కూడా ఆయన తెలిపారు.

ఏబిహెచ్‌ఏతో పౌరులకు చెందిన ఆరోగ్య రికార్డుల ఈ డిజిటల్ లింకింగ్ రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో దేశంలోని వివిధ ఆరోగ్య సౌకర్యాలలో విస్తృతంగా నిర్వహించబడుతోంది. ఏబిహెచ్‌ఏ-లింక్డ్ హెల్త్ రికార్డులకు ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆయుష్మాన్ భారత్ పిఎం-జేఏవై, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్యం (ఆర్‌సిహెచ్‌) పథకం, ఈ హాస్పటల్‌ మరియు కోవిన్‌ వంటివి ఉన్నాయి.


 

****(Release ID: 1884646) Visitor Counter : 141