శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక అవార్డులు, 2023 కోసం దరఖాస్తులు ఆహ్వానించిన టీడీబీ డీఎస్టి


ఐదు విభాగాల్లో ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక అవార్డులు, 2023

ప్రధాన ,ఎంఎస్ఎంఈ, స్టార్టప్,ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ విభాగాల్లో అవార్డులు

Posted On: 16 DEC 2022 9:45AM by PIB Hyderabad
జాతీయ సాంకేతిక దినోత్సవం
  పోఖ్రాన్ శ్రేణిలో భారత సైన్యం 1998 మే 11న విజయవంతంగా నిర్వహించి దేశానికి చిరస్మరణీయ, గర్వించదగిన విజయాన్ని అందించింది. ఈ చిరస్మరణీయ విజయం సాధించిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి దివంగత శ్రీ  అటల్ బిహారీ వాజ్‌పేయి భారతదేశాన్ని పూర్తి అణు దేశంగా ప్రకటించారు. అప్పటి నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంకిత భావంతో  పని చేస్తూ ఘన విజయాలు సాధించిన  శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజనీర్ల గౌరవార్ధం భారతదేశం ప్రతి ఏడాది  మే 11 వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవం గా పాటిస్తోంది. 
జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు(టీడీబీ) దేశాభివృద్ధికి సహకరిస్తున్న వినూత్న సాంకేతిక ఆవిష్కరణలను గుర్తించి 1999 నుంచి జాతీయ సాంకేతిక అవార్డులు ప్రధానం చేస్తోంది. 2000 లో ఎస్ఎస్ఐ యూనిట్లను జాతీయ అవార్డుల జాబితాలో చేర్చింది. ప్రస్తుతం ఈ యూనిట్లను ఎంఎస్ఎంఈ లుగా  గుర్తించారు ఇంతేకాకుండా, దేశాభివృద్ధికి స్టార్టప్ సంస్థలు అందిస్తున్న సేవలను గుర్తించడానికి 2004లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ విభాగంలో అవార్డు ప్రవేశ పెట్టడం జరిగింది. వాణిజ్య పరంగా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉన్నసాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసిన స్టార్టప్ సంస్థలకు ఈ అవార్డు అందిస్తారు. 2021 నుంచి శాస్త్ర సాంకేతిక రంగంలో  'ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్' విభాగంలో అవార్డు ప్రవేశపెట్టారు. 
2021 సంవత్సరానికి సంబంధించి జాతీయ సాంకేతిక అవార్డుల కోసం  టీడీబీ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రధాన ,ఎంఎస్ఎంఈ, స్టార్టప్,ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ విభాగాల్లో అవార్డులు  అందజేయడం జరుగుతుంది. వాణిజ్య అభివృద్ధికి అవకాశం ఉన్న స్వదేశీ  ఆవిష్కరణలకు అవార్డులు అందిస్తారు. ఆత్మ నిర్బర్ భారత్ సాధన కోసం తమ వంతు సహకారం అందించేలా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ అవార్డులు అవకాశం కలిగిస్తాయి. 
  1. జాతీయ సాంకేతిక అవార్డు (ప్రధాన)

స్వదేశీ సాంకేతికతను వాణిజ్య పరంగా అభివృద్ధి చేసేందుకు జరిగిన కృషికి గుర్తింపు గా జాతీయ సాంకేతిక అవార్డు (ప్రధాన) అవార్డు అందిస్తారు.  ఏప్రిల్ 2017  లేదా ఆ తర్వాత స్వదేశీ సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసి వాణిజ్యీకరించిన విజయానికి గుర్తింపుగా  ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఒకవేళ, సాంకేతిక అభివృద్ధి చేసిన వారు / సేవలు అందిస్తున్నవారు  మరియు టెక్నాలజీ కమర్షియల్‌లైజర్ రెండు వేర్వేరు సంస్థలు అయితే ప్రతి ఒక్కరికి   25 లక్షల నగదు, ట్రోఫీ అందిస్తారు. 

.i. 25 లక్షల నగదు పురస్కారం

 

ii. అవార్డుల సంఖ్య: ఒకటి

2. జాతీయ సాంకేతిక అవార్డులు (ఎంఎస్ఎంఈ)
ఏప్రిల్ 2017 న లేదా ఆ తర్వాత స్వదేశీ సాంకేతికత ఆధారంగా ఉత్పత్తిని విజయవంతంగా వాణిజ్యీకరించిన ఎంఎస్ఎంఈ  లకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది.
i. 15 లక్షల నగదు 
ii. అవార్డుల సంఖ్య: మూడు (మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈ  కి రిజర్వ్ చేయబడిన ఒక అవార్డు సహా)
3. జాతీయ సాంకేతిక అవార్డులు (స్టార్టప్‌)
వాణిజ్యీకరణకు అవకాశం ఉన్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరించిన  టెక్నాలజీ స్టార్టప్‌కు ఈ అవార్డు ఇవ్వబడుతుంది.
i. 15 లక్షల నగదు 
ii. అవార్డుల సంఖ్య: ఐదు (మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌ కు  రిజర్వ్ చేయబడిన దానితో సహా)
4) జాతీయ సాంకేతిక అవార్డులు (అనువాద పరిశోధన)
వినూత్న స్వదేశీ సాంకేతికతలను వాణిజ్యీకరించడంలో శాస్త్రవేత్తల విశేష కృషికి ఈ అవార్డును అందజేస్తారు.
i. 5 లక్షల నగదు పురస్కారం
ii. అవార్డుల సంఖ్య: రెండు (ఒకటి మహిళా శాస్త్రవేత్త ద్వారా అనువాద పరిశోధన కోసం రిజర్వ్ చేయబడింది)
5. జాతీయ సాంకేతిక అవార్డులు (టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్)
వివిధ సాంకేతిక రంగాలలో వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో స్టార్టప్‌ సంస్థలను ప్రోత్సహించడం కోసం ఈ అవార్డు అందిస్తారు.
i. 5 లక్షల నగదు పురస్కారం
ii. అవార్డుల సంఖ్య: ఒకటి
ఈ అవార్డులను 11  మే, 2023 న జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తారు.
దరఖాస్తు కోసం   https://awards.gov.in/ చూడవచ్చు.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ- 2023  జనవరి 15 సాయంత్రం 5:00 గంటల లోపు. 

 
***
 

(Release ID: 1884283) Visitor Counter : 175