నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒకే రోజులో అత్యధికంగా 6,49,730 మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించి మరో మైలురాయిని సాధించిన పారాదీప్ పోర్ట్

Posted On: 16 DEC 2022 3:45PM by PIB Hyderabad

14 డిసెంబర్ 2022న, ఒకే రోజులో అత్యధికంగా 6,49,730 మెట్రిక్ టన్నుల కార్గో ట్రాఫిక్‌ను నిర్వహించిన పారాదీప్ పోర్ట్ మరో మైలురాయిని సాధించింది. అద్భుత పనితీరును కనబరిచిన పీపీఏ బృందాన్ని పీపీఏ ఛైర్మన్ శ్రీ పి.ఎల్‌.హరనాథ్‌ అభినందించారు. నిరంతర మద్దతు, అపారమైన సహకారం అందించిన సంబంధిత వర్గాల అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఉత్తరం వైపున్న రేవులో పూడిక తీసిన తర్వాత, 1,46,554 టన్నుల కోకింగ్ బొగ్గును మోసుకెళ్లే 16.20 ఎంటీఆర్‌ నౌక ఎంవీ గోల్డెన్ బార్నెట్‌ పారాదీప్ పోర్టులోని కేఐసీటీ బెర్త్ వద్ద ఇటీవల విజయవంతంగా లంగరు వేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 125 ఎంఎంటీల సరకు నిర్వహణ మైలురాయిని అందుకోవడానికి ఈ ఓడరేవు పోటీ పడుతున్నందున, మెరుగైన సామర్థ్యం &ఆర్థిక ప్రయోజనాల కోసం నౌకాశ్రయంలోని నిర్వహణ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని సంబంధిత వర్గాలను పారాదీప్ పోర్టు కోరింది.

****


(Release ID: 1884277) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi , Odia