నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

1000 మెగావాట్ల సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టు కోసం ఎస్‌జెవిఎన్ గ్రీన్ ఎన‌ర్జీ లిమిటెడ్‌తో రూ. 4,445 కోట్ల రుణ ఒప్పందంపై సంత‌కాలు చేసిన ఐఆర్ ఇడిఎ

Posted On: 15 DEC 2022 4:00PM by PIB Hyderabad

 రాజ‌స్థాన్ బికనీర్‌లో 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం ఎస్‌జెవిఎన్ గ్రీన్ ఎన‌ర్జీ లిమిటెడ్‌తో రూ. 4,444.71 కోట్ల చారిత్ర‌క రుణ ఒప్పందంపై ఇండియ‌న్ రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఇడిఎ) సంత‌కాలు చేసింది. 
ఐఆర్ఇడిఎ నిధుల‌తో నిర్మిత‌మ‌వుతున్న ఈ ప్రాజెక్టు  బిక‌నీర్ -2 (బిక‌నీర్ స‌మీపంలో) 400/200 కెవి స‌బ్‌స్టేష‌న్ ల‌ను అనుసంధానం చేస్తుంది. విజిఎఫ్ మ‌ద్దతుపై ఆధార‌ప‌డి పోటీ బిడ్డింగ్ ప్ర‌క్రియ ద్వారా గ్రిడ్ క‌నెక్టెడ్ సోలార్ పివి ప‌వ‌ర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం సిపిఎస్‌యు ఫేజ్‌-2, (ట్రాంచ్ 3) ప‌థ‌కం కింద ఐఆర్ ఇడిఎ విడుద‌ల చేసిన టెండ‌ర్ ద్వారా ఎస్‌జెవిఎన్ ఈ ప్రాజెక్టును కైవ‌సం చేసుకుంది. 
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు కోసం ఎస్‌జిఇఎల్‌కు అత్య‌ధిక రుణ మొత్తాన్ని ఐఆర్ఇడిఎ మంజూరు చేయ‌డం మాకు హ‌ర్ష‌దాయ‌కం అని ఐఆర్ఇడిఎ సిఎండి అన్నారు. 2030 నాటికి శిలాజేత‌ర ఇంధ‌నాల వాటా 50%గా ఉండాల‌ని భార‌త ప్ర‌భుత్వం పెట్టుకున్న ల‌క్ష్యానికి ఇటువంటి స‌హ‌కారం ద్వారా మేము మ‌ద్ద‌తునందించగ‌లుగు తున్నాము. అంతేకాకుండా, ఈ భాగ‌స్వామ్యం హ‌రిత పెట్టుబ‌డుదార‌ల‌ను ఆక‌ర్‌సించ‌డ‌మే కాక ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ఉపాధి అవ‌కాశాల‌ను క‌లిగిస్తుంది. 
ఐఆర్ఇడిఎ సిఎండి శ్రీ ప్ర‌దీప్ కుమార్ ద్వాస్ , ఎస్‌జెవిఎన్ సిఎండి శ్రీ నంద‌లాల్ శ‌ర్మ‌ల స‌మ‌క్షంలో డిజిఎం (ఐఆర్ఇడిఎ ) శ్రీ ప్ర‌దీప్త కుమార్ రాయ్‌, సిఇఒ (ఎస్‌జిఇఎల్‌) శ్రీ ఎస్‌.ఎల్‌. శ‌ర్మ ఐఆర్ఇడిఎ కార్పొరేట్ కార్యాల‌యంలో ఈ రుణ ఒప్పందంపై సంత‌కాలు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐఆర్ఇడిఎ  (సాంకేతిక‌) డైరెక్ట‌ర్ శ్రీ చింత‌న్ షా, ఎస్‌జెవిఎన్ (ఫైనాన్స్‌) డైరెక్ట‌ర్ శ్రీ ఎ.కె. సింగ్‌, సిఎఫ్ఒ డాక్ట‌ర్ ఆర్‌.సి. శ‌ర్మ‌, ఐఆర్ఇడిఎ జిఎం (టిఎస్‌) శ్రీ‌మ‌తి దేబ‌జ‌నీ భాటియా, ఇత‌ర సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు. 

***


(Release ID: 1883966)
Read this release in: English , Urdu , Hindi , Kannada