రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"జాతీయ విద్యుత్ పొదుపు అవార్డు"లను అందజేసిన భారత రాష్ట్రపతి


- "జాతీయ విద్యుత్ పొదుపు దినోత్సవం" సందర్భంగా అవార్డుల ప్రదానం

- తొమ్మిది జాతీయ విద్యుత్ పొదుపు అవార్డులను అందుకున్న భారతీయ రైల్వే

- న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డుల ప్రదానం

Posted On: 15 DEC 2022 8:54AM by PIB Hyderabad

జాతీయ విద్యుత్ పొదుపు దినోత్సవం సందర్భంగా గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (డిసెంబర్ 14, 2022) న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్, నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డ్స్, జాతీయ చిత్రలేఖన పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా, భారతీయ రైల్వేలకు 2022 సంవత్సరానికి గాను తొమ్మిది జాతీయ విద్యుత్ పొదుపు అవార్డులు లభించాయి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ అవార్డులను అందజేశారు. 2022 సంవత్సరంలో అత్యుత్తమ విద్యుత్తు నిర్వహణ పద్ధతులకు గాను ఈ అవార్డులు ప్రకటించబడ్డాయి. రైల్వే స్టేషన్ల విభాగంలో విద్యుత్తు వినియోగపు సంరక్షణ చర్యలకు గాను దక్షిణ మధ్య రైల్వే మొదటి మరియు రెండవ బహుమతిని అందుకుంది. కాచిగూడ స్టేషన్‌కు ప్రథమ బహుమతి లభించింది. రెండో బహుమతి గుంతకల్ రైల్వే స్టేషన్‌కు లభించింది. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ (ఎన్.సి.ఆర్), రాజమండ్రి రైల్వే స్టేషన్ (ఎస్.సి.ఆర్), తెనాలి రైల్వే స్టేషన్ (ఎస్.సి.ఆర్) లకు మెరిట్ సర్టిఫికెట్ లభించింది. భవనాల కేటగిరీ కింద, వాయువ్య  రైల్వేకు చెందిన అజ్మీర్ వర్క్‌షాప్‌కు మొదటి బహుమతి లభించింది. రైల్వే హాస్పిటల్ గుంతకల్ (ఎస్.సి.ఆర్), ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్, విజయవాడ (ఎస్.సి.ఆర్) మరియు డివిజనల్ రైల్వే హాస్పిటల్, ప్రతాప్‌నగర్ (పశ్చిమ రైల్వే)లకు మెరిట్ సర్టిఫికెట్లు లభించాయి.

ఈరోజు అందజేసే అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయిః

1. రవాణా వర్గం / రైల్వే స్టేషన్ల రంగం:

• కాచిగూడ రైల్వే స్టేషన్ మొదటి బహుమతిని గెలుచుకుంది

• గుంతకల్ రైల్వే స్టేషన్ రెండవ బహుమతిని గెలుచుకుంది

• కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ మెరిట్ సర్టిఫికెట్ గెలుచుకుంది

• తెనాలి రైల్వే స్టేషన్ మెరిట్ సర్టిఫికెట్ గెలుచుకుంది

• రాజమండ్రి రైల్వే స్టేషన్ (ఎస్.సి.ఆర్) మెరిట్ సర్టిఫికెట్ గెలుచుకుంది.

2. భవనాల వర్గం / ప్రభుత్వ భవనాల విభాగంలో:

• వాయువ్య  రైల్వేకు చెందిన అజ్మీర్ వర్క్‌షాప్ మొదటి బహుమతిని గెలుచుకుంది.

• రైల్వే హాస్పిటల్ / గుంతకల్ (ఎస్.సి.ఆర్) మెరిట్ సర్టిఫికెట్ గెలుచుకుంది

• ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటీటీసీ), విజయవాడ (ఎస్.సి.ఆర్) మెరిట్ సర్టిఫికెట్ గెలుచుకుంది.

• డివిజనల్ రైల్వే హాస్పిటల్, ప్రతాప్‌నగర్ (పశ్చిమ రైల్వే ) మెరిట్ సర్టిఫికెట్ గెలుచుకుంది.

మేటి విద్యుత్ సామర్థ్యం కలిగిన ఎల్ఈడీ లైటింగ్ మరియు ఇతర చర్యల వంటి వివిధ విద్యుత్ సంరక్షణ చర్యలను రైల్వేలు స్థిరంగా అమలు చేస్తున్నాయి.

***


(Release ID: 1883961) Visitor Counter : 143