చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022 ప్రారంభం నుంచి సెప్టెంబర్ 9 వరకు వివిధ హైకోర్టుల్లో రికార్డు స్థాయిలో 165 మంది న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది, ఇప్పటివరకు ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఇదే అత్యధికం

నాడు పోస్టు చేయడమైనది: 15 DEC 2022 2:23PM by PIB Hyderabad

హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి ఇటీవల సిఫార్సు చేసిన 20 పేర్లను సుప్రీంకోర్టు కొలీజియంకు కేంద్ర ప్రభుత్వం తిరిగి పంపిందని రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరెన్‌ రిజిజు ఇవాళ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 09.12.2022 నాటికి, మంజూరైన 1108 మంది న్యాయమూర్తుల సంఖ్యలో 777 మంది న్యాయమూర్తులు హైకోర్టుల్లో పని చేస్తున్నారు. 331 (30%) న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది. 331 ఖాళీలకు గాను హైకోర్టులు పంపిన 147 ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం వద్ద వివిధ దశల్లో ఉన్నాయి. హైకోర్టుల్లో 184 ఖాళీలకు సంబంధించి హైకోర్టు కొలీజియంల నుంచి మరిన్ని సిఫార్సులు అందాల్సి ఉంది. 2022 సంవత్సరంలో 09.12.2022 వరకు, కేంద్ర ప్రభుత్వం వివిధ హైకోర్టుల్లో రికార్డు స్థాయిలో 165 మంది న్యాయమూర్తులను నియమించింది. ఇప్పటివరకు ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఇదే అత్యధికం.

రాజ్యాంగ (99వ సవరణ) చట్టం 2014, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం 2014 రాజ్యాంగ విరుద్ధమైనవి 13.04.2015 నుంచి చెల్లవంటూ 16.12.2015 నాటి తీర్పులో ఉంది. రాజ్యాంగం (99వ సవరణ) చట్టం 2014 అమలుకు ముందు ఉన్న కొలీజియం వ్యవస్థ అమలులో ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. ఉన్నత న్యాయవ్యవస్థలో నియామకాలన్నీ ప్రస్తుతమున్న ఎంవోపీ ప్రకారం జరుగుతున్నాయి.

 

******


(రిలీజ్ ఐడి: 1883830) సందర్శకుల సూచీ సంఖ్య : : 172
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Tamil