అంతరిక్ష విభాగం
ఇస్రో ఆధ్వర్యంలో శుక్ర గ్రహ యాత్ర సాధ్యాసాధ్యాల అధ్యయనం: కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర
प्रविष्टि तिथि:
14 DEC 2022 12:22PM by PIB Hyderabad
శుక్రగ్రహ యాత్ర సాధ్యాసాధ్యాలతోబాటు వైమానికశాస్త్ర అధ్యయనాలకు ఇస్రో చొరవ తీసుకుంటున్నట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రధాని కార్యాలయం, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణు విద్యుత్, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి) డాక్టర్ జితేంద్ర చెప్పారు.
వాతావరణానికి ఆవల భూమికి, ఇతర సౌరమండల భాగాలకు మధ్య ఉన్న ప్రాంతాల శాస్త్రీయ అధ్యయనానికి 60 ఏళ్ల కిందట పెట్టిన పేరు వైమానిక శాస్త్రం. ఇందులో రసాయన, గతి శాస్త్రాలతోబాటు తటస్థ, శక్తి పొందిన రేణువుల శక్తిని అధ్యయనం చేస్తారు.
లోక్ సభకు ఈరోజు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో డాక్టర్ జితేంద్రసింగ్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ రెండు మిషన్స్ ను కాన్సెప్ట్స్ గా రూపొందించి శాస్త్రీయ పరిధిని నిర్ణయించేందుకు జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలతీ చర్చిస్తామని తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 1883557)
आगंतुक पटल : 236