ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీఅరబిందో 150వ జయంతి ని స్మరించుకొంటూ నిర్వహించిన కార్యక్రమం లో   వీడియో కాన్ఫరెన్స్   మాధ్యం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి


శ్రీ అరబిందో గౌరవార్థం స్మారక నాణేన్ని మరియు తపాలా బిళ్ల ను విడుదల చేశారు


‘‘1893వసంవత్సరం శ్రీ అరబిందో, స్వామి వివేకనంద మరియు మహాత్మా గాంధీ లజీవితాల లో ఒక ముఖ్యమైన సంవత్సరం’’


‘‘ప్రేరణ, చర్య కలిసినప్పుడు, అసాధ్యమైన లక్ష్యం కూడా నెరవేరి తీరుతుంది"

‘‘శ్రీ అరబిందో జీవితం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కు ప్రతిబింబం గా ఉంది’’

‘‘భారతదేశంతన సంస్కృతి , సంప్రదాయాల ద్వారా దేశాన్ని ఎలాకలుపుతుందో చెప్పడానికి కాశీ తమిళ సంగమంచ ఒక గొప్ప ఉదాహరణ’’

“మనం ‘ఇండియాఫస్ట్’ అనే మంత్రం తో పని చేస్తున్నాం. మన వారసత్వాన్ని యావత్తు ప్రపంచం ఎదుటగర్వం గా ఆవిష్కరిస్తున్నాం’’

‘‘భారతదేశం అంటే మానవ నాగరకత కు అత్యంతపవిత్రమైన భావన; అత్యంత సహజ మైనమానవత్వ స్వరం’’

Posted On: 13 DEC 2022 6:37PM by PIB Hyderabad

శ్రీ అరబిందో 150వ జయంతి ని పురస్కరించుకొని పుదుచ్చేరి లోని కంబన్ కళై సంగమ్ లో ఈ రోజు న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగం గా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రసంగించారు. శ్రీ అరబిందో గౌరవార్థం ఒక స్మారక నాణేన్ని , తపాలా బిళ్ల ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, సంవత్సరం పొడవునా ఎంతో ఉత్సాహం తో జరుపుకొంటున్న శ్రీ అరబిందో 150వ జయంతి కి గల ప్రాముఖ్యాన్ని గురించి వివరించారు. శ్రీ అరబిందో స్మారక నాణేన్ని , తపాలా బిళ్ల ను విడుదల చేయడం ద్వారా దేశం ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. దేశం చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు భారతదేశం యొక్క సంకల్పాల కు కొత్త శక్తి ని, బలాన్ని ఇస్తాయన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్య క్తం చేశారు.

 

 

 

అనేక గొప్ప కార్యక్రమాలు ఒకేసారి జరిగినప్పుడు, తరుచుగా 'యోగ శ క్తి' అంటే వాటి వెనుక ఒక సామూహిక, సమైక్య శక్తి ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్ర్య సంగ్రామాని కి తోడ్పడడమే కాకుండా దేశ ఆత్మకు కొత్త జీవాన్ని అందించిన ఎంతో మంది గొప్ప వ్యక్తుల ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తు కు తెచ్చుకొన్నారు. వారిలో ముగ్గురు మహనీయుల- శ్రీ అరబిందో, స్వామి వివేకనందుల వారు మరియు మహాత్మ గాంధీ- ల జీవనం లో ఒకే సమయం లో అనేక గొప్ప ఘటన లు జరిగాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఘటన లు ఈ ప్రముఖుల జీవనాన్ని మార్చడం ఒక్కటే కాకుండా జాతి జీవనం లోనూ దూరగామి పరివర్తన ను తీసుకు వచ్చాయి అని ఆయన అన్నారు. 1893లో శ్రీ అరబిందో భారతదేశాని కి తిరిగి వచ్చారు; అదే సంవత్సరం స్వామి వివేకనందుల వారు విశ్వ ధర్మ మహాసభ లో తమ ప్రతిష్ఠిత ఉపన్యాసాన్ని ఇవ్వడం కోసమని అమెరికా కు వెళ్లారు అని ప్రధాన మంత్రి అన్నారు. అదే సంవత్సరం లో గాంధీజీ దక్షిణాఫ్రికా కు వెళ్లారు, ఆయన మహాత్మ గాంధీ గా మారే యాత్ర అక్కడ మొదలైంది అని ప్రధాన మంత్రి అన్నారు. వర్తమాన కాలం లో ఏకకాలం లో సంభవిస్తున్న ఇటువంటి అనేక ఘట్టాల కు సాక్షి గా భారతదేశం నిలుస్తోంది.. ఆ ఘట్టాలు ఏవేవి అంటే వాటి లో- దేశాని కి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు కావడం తాలూకు ఉత్సవాన్ని మనం జరుపుకొంటూ ఉండడం, అమృత కాలం యొక్క యాత్ర ను ప్రారంభించుకోవడం, ఇంకా శ్రీ అరబిందో యొక్క 150వ జయంతి ని మరియు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క 125వ జయంతి ని జరుపుకోవడం- వంటివి చేరి ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రేరణ, చర్య కలగలిసినప్పుడు, అసాధ్యం అని అనిపించే లక్ష్యం కూడా తప్పక నెరవేరుతుంది. ప్రస్తుతం అమృత కాలం లో దేశం యొక్క సఫలత లు మరియు సబ్ కా ప్రయాస్సంకల్పం దీనికి నిదర్శన గా నిలుస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

 

 

శ్రీ అరబిందో జీవనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు ప్రతిబింబం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఎందుకంటే ఆయన బంగాల్ లో జన్మించారు. ఆయన కు గుజరాతీ, బంగాలీ, మరాఠీ, హిందీ, సంస్కృతం లతో సహా అనేక భాష లు వచ్చు. ఆయన తన జీవనం లో ఎక్కువ భాగం గుజరాత్ లో, పుదుచ్చేరి లో గడిపారు. ఆయన ఎక్కడకు వెళ్ళినా తన బలమైన ముద్ర ను వేశారు. శ్రీ అరబిందో బోధ లను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, మనం ఎప్పుడయితే మన సంప్రదాయాల ను, సంస్కృతి ని గురించి తెలుసుకొంటామో, మరి వాటి మాధ్యం ద్వారా జీవించడం మొదలుపెడతామో అప్పుడు మన వివిధత్వం మన జీవనం లోని ఒక స్వాభావిక ఉత్సవం గా మారిపోతుంది అన్నారు. ‘‘ఇది ఆజాదీ కా అమృత కాలానికి గొప్ప ప్రేరణ కారకం గా ఉంది. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ ను వివరించడానికి ఇంతకంటే మెరుగైన మార్గం మరొకటి లేదు’’ అని ఆయన అన్నారు.

 

 

కాశీ తమిళ సంగమం లో పాల్గొనే అవకాశాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తు చేసుకొన్నారు. భారతదేశం తన సంస్కృతి , సంప్రదాయాల ద్వారా దేశాన్ని ఎలా కలుపుతుందో చెప్పడానికి ఈ అద్భుతమైన సంఘటన ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘నేటి యువత భాష, వస్త్రధారణ ల ఆధారంగా వేరు చేసే రాజకీయాల ను వదలిపెట్టి, ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్ రాజకీయాల ను స్వీకరిస్తోందని కాశీ తమిళ సంగమం చాటింది. ప్రస్తుతం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు అమృత కాలం లో మనం కాశీ తమిళ సంగమం తాలూకు భావన ను విస్తరించవలసిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు.

 

 

శ్రీ అరబిందో వ్యక్తిత్వం ఎటువంటిది అంటే ఆయన జీవనం లో ఆధునిక శాస్త్రీయ ఆలోచనల సరళి, రాజకీయ తిరుగుబాటు తో పాటే దైవీక భావన కు కూడా చోటు ఉందని ప్రధాన మంత్రి అన్నారు. బంగాల్ విభజన కాలం లో ఆయన ఇచ్చిన ఎటువంటి రాజీ కి తావు లేదుఅనే నినాదాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తు కు తెచ్చుకొన్నారు. శ్రీ అరబిందో యొక్క సైద్ధాంతిక స్పష్టత, సాంస్కృతిక శక్తి మరియు దేశభక్తి అనేవి ఆయన ను ఆ కాలం లో స్వాతంత్ర్య సమరయోధుల కు ఒక ఆదర్శ వ్యక్తి గా మార్చివేశాయి అని ప్రధాన మంత్రి అన్నారు. తాత్విక, ఆధ్యాత్మిక అంశాల పై గట్టి పట్టు ఉన్న శ్రీ అరబిందో లో ఋషి వంటి లక్షణాల ను గురించి కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ‘ఉపనిషత్తుల కు సామాజిక సేవ అనే తత్వాన్ని శ్రీ అరబిందో జోడించారు’ అని ఆయన తెలిపారు. ఎటువంటి న్యూనత భావాని కి తావు ఇవ్వకుండా అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క మన యాత్ర లో అన్ని అభిప్రాయాల ను స్వీకరిస్తున్నాం అని ప్రధాన మంత్రి అన్నారు. మరి మనం ఇండియా ఫస్ట్అనే మంత్రం తో పని చేస్తూ యావత్తు ప్రపంచం సమక్షం లో మన వారసత్వాన్ని సగర్వం గా ఆవిష్కరిస్తున్నాం.అని ఆయన అన్నారు.

 

 

శ్రీ అరబిందో జీవనం భారతదేశాని కి దక్కిన మరో శక్తి కి ప్రతీక గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. అది ‘పంచ్ ప్రణ్’ (ఐదు ప్రతిజ్ఞల లో) ఒకటైన ‘‘బానిసత్వ మనస్తత్వం నుండి స్వేచ్ఛ’’ గా ఉన్న శక్తి కి సంకేతం అని ప్రధాన మంత్రి చెప్పారు. పాశ్చాత్య ప్రభావం అధికం గా ఉన్నప్పటికీ కూడాను భారతదేశాని కి తిరిగి వచ్చినప్పుడు శ్రీ అరబిందో తాను జైలు లో ఉన్న సమయం లో గీత తో బంధాన్ని ఏర్పరచుకొన్నారని, ఆయన భారతీయ సంస్కృతి యొక్క బాగా పదునైనటువంటి స్వరం గా ఉద్భవించారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శాస్త్రాల ను అధ్యయనం చేశారు; రామాయణం, మహాభారతం, ఇంకా ఉపనిషత్తు ల మొదలు కాళిదాసు, భవభూతి, భర్తృహరి ల వరకు వారి యొక్క గ్రంథాల ను అనువదించారు అని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘ప్రజలు భారతదేశాన్ని శ్రీ అరబిందో ఆలోచన ల రూపం లో చూశారు, అదే శ్రీ అరబిందో ను ఒకప్పుడు ఆయన యవ్వన దశ లో భారతీయత కు దూరం గా ఉంచడం జరిగింది. ఇది భారతదేశం యొక్క, భారతీయత యొక్క సిసలు బలం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

‘‘భారతదేశం ఎటువంటి అమర బీజం అంటే ప్రతికూల పరిస్థితుల లో అది కొద్ది గా అణచివేతకు గురి కావచ్చు. కాస్తంత ముకుళించనూ వచ్చు అయితే అది జీవాన్ని మాత్రం కోల్పోదు..’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం యొక్క ఘనమైనటువంటి సాంస్కృతిక చరిత్ర ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘భారతదేశం మానవ నాగరకత యొక్క అత్యంత పవిత్ర మైనటువంటి ఆలోచన, మానవత్వం యొక్క అత్యంత సహజమైన స్వరం. మహర్షి అరబిందో కాలం లో భారతదేశం అమరం గా ఉండింది, అది వర్తమాన ‘ఆజాదీ కా అమృత్ కాల్’ లో కూడా అమరం గానే ఉంది’’ అన్నారు. ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర లో ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్ల ను గురించి ప్రస్తావించారు. ఈ సవాళ్ళ ను అధిగమించడం లో భారతదేశం యొక్క పాత్ర కు ఉన్న ప్రాముఖ్యాన్ని స్పష్టంచేశారు. ‘‘అందుకే మహర్షి అరబిందో నుండి ప్రేరణ ను పొంది మనల ను మనం సన్నద్ధపరచుకోవలసి ఉంటుంది. మరి ‘సబ్ కా ప్రయాస్’ ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించవలసి ఉంది’’ అంటూ ప్రధాన మంత్రి పిలుపు ను ఇచ్చారు.

 

పూర్వరంగం

 

శ్రీ అరబిందో 1872వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నాడు జన్మించారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటాని కి ఎంతగానో తోడ్పడ్డ దార్శనికుడు ఆయన. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భం లో భారతీయుల యొక్క, భారతదేశం సంస్కృతి యొక్క, భారతదేశం కార్యసాధనల యొక్క గౌరవశాలి చరిత్ర ను ఉత్సవం మాదిరి గా జరుపుకొనేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను తలపెట్టడమైంది. ఈ మహోత్సవ్ కాలం లో దేశవ్యాప్తం గా ఏడాది పొడవునా అనేక కార్యాల ను మరియు కార్యక్రమాల ను నిర్వహించడం ద్వారా శ్రీ అరబిందో యొక్క 150వ జయంతి ని పాటించడం జరుగుతున్నది.

I bow to Sri Aurobindo. He was a prominent freedom fighter and a philosopher whose ideals have inspired generations. https://t.co/AiSAhPUYzk

— Narendra Modi (@narendramodi) December 13, 2022

Today, a commemorative coin and postal stamp in honour of Sri Aurobindo have been released. pic.twitter.com/pW2PxPp9CK

— PMO India (@PMOIndia) December 13, 2022

जब प्रेरणा और कर्तव्य, मोटिवेशन और एक्शन एक साथ मिल जाते हैं, तो असंभव लक्ष्य भी अवश्यम्भावी हो जाते हैं। pic.twitter.com/DOX7y7SFMw

— PMO India (@PMOIndia) December 13, 2022

Sri Aurobindo's life is a reflection of 'Ek Bharat, Shreshtha Bharat.' pic.twitter.com/J2STQguds6

— PMO India (@PMOIndia) December 13, 2022

India's youth is inspired by the 'Rashtra Neeti' of 'Ek Bharat, Shreshtha Bharat.' pic.twitter.com/95Wq2BAnpF

— PMO India (@PMOIndia) December 13, 2022

महर्षि अरबिंदो के जीवन में हमें भारत की आत्मा और भारत की विकास यात्रा के मौलिक दर्शन होते हैं। pic.twitter.com/3O5M5CXdha

— PMO India (@PMOIndia) December 13, 2022

भारत मानव सभ्यता का सबसे परिष्कृत विचार है, मानवता का सबसे स्वाभाविक स्वर है। pic.twitter.com/pI0liaOW5L

— PMO India (@PMOIndia) December 13, 2022

India has a pivotal role in tackling challenges faced by the world today. pic.twitter.com/12CJ03r2MA

— PMO India (@PMOIndia) December 13, 2022

*****

DS/TS

 



(Release ID: 1883303) Visitor Counter : 141