హోం మంత్రిత్వ శాఖ
నిర్భయ నిధి
Posted On:
13 DEC 2022 3:32PM by PIB Hyderabad
కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) 2019-20 మరియు 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో "నిర్భయ నిధి" కింద అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు (యుటీలకు) రూ. 98.86 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందించింది. ప్రస్తుతం ఉన్న మానవ అక్రమ రవాణాను నియంత్రణ యూనిట్లను (ఎ.హెచ్.టి.యు.లను) బలోపేతం చేయడానికి మరియు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలోని అన్ని జిల్లాలను కవర్ చేసే కొత్త ఎ.హెచ్.టి.యు లను ఏర్పాటు చేయడానికి వీలుగా ఈ సహాయం అందించడమైంది.
‘పోలీస్’ మరియు ‘పబ్లిక్ ఆర్డర్’ భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని ‘స్టేట్-లిస్ట్’ (రాష్ట్ర జాబితాలోని) అంశాలు. కావున గూఢచార్యం వివరాల సేకరణ, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ చట్టంలోని ప్రస్తుత నిబంధనల ప్రకారం అటువంటి విషయాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించబడుతుంది. ఇందుకు గాను తగిన సహాయం అందించడం జరుగుతోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) న్యాయ అధికారులు, పోలీసు అధికారుల సామరథ్యం పెంపొందించే లక్ష్యంతో కాలానుగుణంగా న్యాయపరమైన కొలోక్వియంలు మరియు రాష్ట్ర స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రాలు మరియు యుటీలకు క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందిస్తోంది. మానవ అక్రమ రవాణాను నిరోధించడం మరియు ఎదుర్కోవడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతోంది. మానవ అక్రమ రవాణాలో పాల్గొన్న వ్యక్తులు మరియు ముఠాలను గుర్తించడానికి మరియు వారి సంబంధాలు, కార్యనిర్వహణ కార్యకలాపాల గురించి సమాచారాన్ని సేకరించడానికి 'ఇంటెలిజెన్స్' మరియు 'నిఘా' యంత్రాంగాలను ఏర్పాటు చేయవచ్చని ఎంహెచ్ఏ రాష్ట్రాలు మరియు యుటీలకు ఒక అడ్వైజరీని కూడా జారీ చేసింది.
రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేకించి మానవ అక్రమ రవాణా కేసులను నిర్వహించే పోలీసు అధికారులకు క్రమ వ్యవధిలో శిక్షణ మరియు అవగాహన కల్పించాలని మరియు వారికి విధానపరమైన చట్టాలు, కోర్టు తీర్పులు, పరిపాలనా విధానాలు, పిల్లల స్నేహపూర్వక దర్యాప్తులో తగిప నైపుణ్యాలను అందించాలని కూడా సూచించింది. ముఖాముఖి, విచారణ, శాస్త్రీయ సమాచార సేకరణ, బాధితులు/సాక్షి రక్షణ కార్యక్రమాలను సులభతరం చేయడం మొదలైనవి కూడా చేపట్టాలని సూచించింది. లోక్‌సభలో ఈరోజు ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా అందించిన సమాధానంలో హోం శాఖ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా ఈ విషయాన్ని తెలిపారు.
*****
(Release ID: 1883288)
Visitor Counter : 167