యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 23 బహుళార్థ సాధక హాళ్ళతో సహా 30 క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంజూరుః శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
13 DEC 2022 3:07PM by PIB Hyderabad
వర్ధమాన క్రీడాకారులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు క్రీడా మౌలికసదుపాయాల అభివృద్ధి కోసం, విదేశాలలో శిక్షణా శిబిరాలు సహా ప్రపంచ స్థాయి సౌకర్యాలును కల్పించేందుకు ప్రభుత్వం తగినన్ని నిధులను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఖేలో ఇండియా పథకం, జాతీయ క్రీడా ఫెడరేషన్లకు సహాయం, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా క్రీడా ప్రోత్సాహక పథకాల ద్వారా సాధించింది. ఈ పథకాల కింద నిధులు డిమాండ్ ఆధారంగా ఉంటుంది. సాంకేతిక సాధ్యత, పథక మార్గదర్శనాల ఆధారంగా ప్రతిపాదనలను ఆమోదించింది.
క్రీడలు రాష్ట్ర అంశమైనందునన, క్రీడల అభివృద్ధి అనేది రాష్ట్ర ప్రభుత్వ వద్ద ప్రాథమికంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తన కృషికి అనుబంధంగా ఉంది. ఖేలో ఇండియా పథకం కింద మంత్రిత్వ శాఖ ఝాన్సీ జిల్లాలో ఒక ఖేలో ఇండియా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మంజూరు చేసింది. తదుపరి, 23 బహుళార్ధ సాధక హాళ్ళను, 30 క్రీడా మౌలిక సదుపాయ ప్రాజెక్టులను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది.
ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభకు మంగళవారం ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1883164)