ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీఅరవిందుల వారి 150వ జయంతి కిగుర్తు గా డిసెంబర్ 13వ తేదీ న ఒక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నప్రధాన మంత్రి


ఈ కార్యక్రమం లో శ్రీ అరవిందుల వారి గౌరవార్థం స్మారక నాణేన్ని, తపాలా బిళ్ళ నుఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి

Posted On: 12 DEC 2022 5:59PM by PIB Hyderabad

శ్రీ అరవిందుల వారి 150వ జయంతి కి గుర్తు గా డిసెంబర్ 13వ తేదీ నాడు సాయంత్రం 5 గంటల కు ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా పాలుపంచుకోనున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగం గా పుదుచేరి లోని కంబన్ కళయ్ సంగమ్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమం లో శ్రీ అరవిందుల వారి గౌరవార్థం ఒక స్మారక నాణేన్ని మరియు ఒక తపాలా బిళ్ళ ను ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. దేశ వ్యాప్తం గా శ్రీ అరవిందుల వారి అనుయాయులు కూడా పాల్గొనే ఈ కార్యక్రమం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

శ్రీ అరవిందులు 1872వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నాడు జన్మించారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటాని కి ఎంతగానో తోడ్పడ్డ దార్శనికుడు ఆయన. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భం లో భారతీయుల యొక్క, భారతదేశం సంస్కృతి యొక్క, భారతదేశం కార్యసాధనల యొక్క వైభవోపేతమైనటువంటి చరిత్ర ను ఉత్సవం మాదిరి గా జరుపుకొనేందుకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను తలపెట్టడమైంది. ఈ మహోత్సవ్ కాలం లో ఏడాది పొడవునా దేశం లోని వివిధ ప్రాంతాల లో పలు కార్యాలను మరియు కార్యక్రమాల ను నిర్వహించడం ద్వారా శ్రీ అరవిందుల వారి 150వ జయంతి ని స్మరించుకొంటున్నది.

 

***



(Release ID: 1882947) Visitor Counter : 141