రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్‌ రైలు!


రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన
తమిళ సమాగమ యాత్రను జయప్రదం చేసిన

ప్రతినిధి బృందానికి అభినందలు
తమకు అందించిన ఆతిథ్యానికి ప్రతినిధుల ప్రశంశలు

వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్‌లో
పునరాభివృద్ధిపై రైల్వేమంత్రి సమీక్ష

పరిసర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేలా
పునరభివృద్ధి ప్రణాళిక రూపొందాలని సూచన

Posted On: 10 DEC 2022 12:13PM by PIB Hyderabad

  కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్‌ పేరిట కాశీ-తమిళనాడు మధ్య కొత్త రైలు సర్వీసును కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కాశీ తమిళ సమాగమ కార్యక్రమం జ్ఞాపకార్థం ఈ సర్వీసును ఆయన ప్రారంభించారు. కాశీ తమిళ సమాగమం పేరిట కేంద్ర ప్రభుత్వ ఆహ్వానంతో తమిళనాడు నుంచి వచ్చిన ప్రతినిధులతో మాట్లాడుతూ, అశ్వినీ వైష్ణవ్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఈ ప్రకటన చేశారు. యాత్రను విజయవంతంగా పూర్తిచేసినందుకు ప్రతినిధులను అభినందించారు. వారణాసి జంక్షన్ రైల్వేస్టేషన్ పునరభివృద్ధి ప్రణాళికను కూడా ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు.

  సమాగమం ఎనిమిదో బృందం ప్రతినిధులతో కేంద్రమంత్రి సంభాషించారు. ప్రతినిధులు కూడా తమ పర్యటనలో అనుభవాలను ఆయనతో పంచుకున్నారు, తమను ఎలా ఆదరంగా చూసుకున్నదీ వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన రైల్వే మంత్రిత్వ శాఖ, ఐ.ఆర్.సి.టి.సి.  బృందం కృషిని కేంద్రమంత్రి ప్రశంసించారు. ప్రజలకు,  ప్రజలకు మధ్య పరస్పర అభిప్రాయాల మార్పిడి ప్రక్రియతో సంప్రదాయాలు, విజ్ఞానం, సంస్కృతి మరింత చేరువ అవుతాయని, భాగస్వామ్య వారసత్వంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుందని కేంద్రమంత్రి అన్నారు.

https://ci3.googleusercontent.com/proxy/7vdJolrVl8A2UMn8ulqInAO10tnD49L16q1zXKJzpmq-vv8O4-TbxigdVn9RZ4gpvLEABa6J4YFLHNT4g2i6I1wXgnaQHEae7PgWC9y7wUURUG-cllS1Tlkdww=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001IRUK.jpg

  కాశీ, తమిళనాడు మధ్య కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్‌ పేరిట కొత్త రైలు సర్వీసు సేవలు త్వరలో ప్రారంభమవుతాయని వైష్ణవ్ తెలిపారు. వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ పునరభివృద్ధి ప్రణాళికలను కూడా రైల్వే మంత్రి సమీక్షించారు. భవిష్యత్తులో ఏర్పడబోయే రద్దీని దృష్టిలో ఉంచుకుని రద్దీని తగ్గించేలా రైల్వే స్టేషన్‌న పునరభివృద్ధికి ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు.

https://ci4.googleusercontent.com/proxy/6FMlwCKf4GXZk9Jhd7inUIijadXMtEd7UdipNxvIWXztY77Lx-eRaBaHbRj3M0ZLJZJtbtdZWlOhkV8q1gNeTMXbHYf4I2wawiq_y5XkLiQAqce87xqlXg0UCw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ZY8M.jpg

 వారణాసి (కాశీ) జంక్షన్ రైల్వే స్టేషన్‌ పరిస్థితులను ఆయన పరిశీలించారు. రైల్వేస్టేషన్‌ను ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ లాగా అధునాతనంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని దార్శనికతకు అనుగుణంగా ఈ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా అన్ని హంగులతో అభివృద్ధి చేసినట్టు కేంద్రమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన స్టేషన్లలో ఒకటిగా ఈ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దేందుకు సుమారు రూ.7000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

https://ci6.googleusercontent.com/proxy/UDWVpI-f8zyGJ0_E4U-Bqw9WauWtGYQ_KBgWrKKp3LaP0LYOndZ53QvSIzOPTV_oZ_jzGMOraIw-WzmafJTRtV9giU7fDZEzG0EoDwWSH5A9du8114nY4iwnFQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BCDR.jpg

  రాబోయే 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా స్టేషన్ పునరభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నట్లు  వైష్ణవ్ చెప్పారు. వారణాసీ నగరంలోని స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ పరిసర ప్రాంతంలోని అన్ని రైల్వేస్టేషన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు స్లీపర్ సదుపాయంతో వందే భారత్ రైళ్ల తయారీని త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

   ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే నెల రోజుల కార్యక్రమమే, కాశీ తమిళ సమాగమం. కాశీలో జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ, ఐ.ఆర్.సి.టి.సి. ఆహ్వానంతో విచ్చేసిన ప్రతినిధులను కాశీ, ప్రయాగ్‌రాజ్, అయోధ్య ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్లి వారికి సముచిత రీతిలో ఆతిథ్యం అందించారు.

 

****


(Release ID: 1882639) Visitor Counter : 175