బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు బ్లాకుల కేటాయింపులో ఒక రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వచ్చిన వ్యాఖ్యలు, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పై స్పష్టత
Posted On:
09 DEC 2022 6:59PM by PIB Hyderabad
బొగ్గు బ్లాకుల కేటాయింపులో ఒక రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తున్నదంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని బొగ్గు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటువంటి వార్తల్లో వాస్తవం లేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఒక రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని, ఇటువంటి నిబంధన కూడా ఎక్కడా లేదని మంత్రిత్వ శాఖ వివరించింది. నిబంధనలు స్పష్టంగా ఉన్న సమయంలో ఒక రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత లభించింది అని చెప్పడం తప్పుదోవ పట్టించే విధంగా వాస్తవ విరుద్ధంగా ఉందని బొగ్గు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి :
2015 లో జీఎండీసీ కి రెండు లిగ్నైట్ బ్లాకులను కేటాయించడం జరిగింది. కేటాయింపుల వివరాలు .. భర్కండం లిగ్నైట్ బ్లాక్ 10.08.2015న కేటాయించబడింది
పనంద్రో ఎక్సటెన్షన్ లిగ్నైట్ బ్లాక్ 10.08.2015న కేటాయించబడింది
అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కి మూడు బొగ్గు బ్లాకులు కేటాయించబడ్డాయి
ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ను 13.08.2015న కేటాయించారు
తెలంగాణలో పెంగడప్ప బొగ్గు బ్లాకు 15.12.201న కేటాయించబడింది
30.10.2019న ఒడిశాలోని న్యూ పత్రపరా బొగ్గు బ్లాకు కేటాయింపు జరిగింది.
తెలంగాణలో ఒక బొగ్గు గని తాడిచెర్ల-I కూడా 31.08.2015న తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ లిమిటెడ్‌కు కేటాయించబడింది
తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కి కేటాయించిన పైన పేర్కొన్న మూడు బొగ్గు గనులలో పెంగడప్ప, న్యూ పత్రపరా బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వ క్షమాభిక్ష పథకం కింద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సరెండర్ చేసిందని ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. 2015లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కి కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ లో ఇప్పటివరకు పనులు ప్రారంభంకాలేదు. నైనీ బొగ్గు బ్లాక్ పని ప్రారంభించడానికి అవసరమైన అన్ని అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
గనులు మరియు ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ కోసం అమలు జరుగుతున్న గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, 1957 మరియు బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 2015 ద్వారా బొగ్గు బ్లాకుల వేలం జరుగుతోంది. ఈ రెండు చట్టాలు గనుల కేటాయింపులో పారదర్శకమైన యంత్రాంగాన్ని అందిస్తాయి.
18 జూన్ 2020 న కమర్షియల్ మైనింగ్ ప్రారంభించినప్పటి నుంచి అత్యంత పారదర్శకంగా వేలం విధానం అమలు జరుగుతోంది. దీని కింద మొత్తం బొగ్గు/లిగ్నైట్ బ్లాకుల వేలం ప్రక్రియలో ఈ విధానం అమలు జరుగుతున్నది. వాణిజ్య మైనింగ్ ప్రారంభమైన తర్వాత ఒక రాష్ట్రానికి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ కి గాని బొగ్గు/లిగ్నైట్ బ్లాకు కేటాయింపు జరగలేదు.
***
(Release ID: 1882346)