సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ

Posted On: 08 DEC 2022 1:01PM by PIB Hyderabad

దేశంలోని ‘ఎంఎస్‌ఎంఇ’ రంగానికి మద్దతుగా స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:

  1. సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)సహా వ్యాపారాల కోసం రూ.5 లక్షల కోట్లతో అత్యవసర దశలవారీ రుణహామీ పథకం (ఇసిఎల్‌జిఎస్‌);
  2. ఎంఎస్‌ఎంఇ-స్వావలంబన భారతం నిధి కింద రూ.50,000 కోట్లతో వాటా మూలధన మద్దతు;
  3. ‘ఎంఎస్‌ఎంఇ’ల వర్గీకరణకు సవరించబడిన కొత్త మార్గదర్శకాలు;
  4. రూ.200 కోట్లదాకా ప్రభుత్వ కొనుగోళ్లకు అంతర్జాతీయ టెండర్లు అక్కర్లేదు;
  5. ‘ఎంఎస్‌ఎంఇ’లకు వాణిజ్య సౌలభ్యం దిశగా ‘ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌’;
  6. ‘ఎంఎస్‌ఎంఇ’లకు చేయూత, ఫిర్యాదుల పరిష్కారంసహా ఇ-పరిపాలనలోని అనేక అంశాలను చేరుస్తూ 2020 జూన్లో ఆన్‌లైన్ పోర్టల్ “ఛాంపియన్స్” ప్రారంభం.

న్‌ఐసి కోడ్‌ ద్వారా గుర్తించబడిన చేనేత, హస్తకళలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి సంబంధిత ‘ఎంఎస్‌ఎంఇ’ల సంఖ్యతోపాటు అటువంటి సంస్థలలో రాష్ట్రాల వారీగా ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య వివరాలు అనుబంధం-1లో ఇవ్వబడ్డాయి. అలాగే జార్ఖండ్‌లోని హజారీబాగ్, రామ్‌గఢ్ జిల్లాల్లో చేనేత, హస్తకళలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి సంస్థలలో ఉపాధి పొందే మహిళల సంఖ్య అనుబంధం-2లో ఉంది. కాగా- ఈ మేరకు జార్ఖండ్‌లోని హజారీబాగ్, రామ్‌గఢ్ జిల్లాల్లో ‘ఉద్యమ్‌’ పోర్టల్‌లో నమోదైన ‘ఎంఎస్‌ఎంఇ’లకు ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో లభ్యమయ్యే వివిధ పథకాల మార్గదర్శకాల ప్రకారం ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుంది.

 

******



(Release ID: 1881999) Visitor Counter : 89