మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

‘పరీక్షా పే చర్చ 2023’లో విస్తృతంగా పాల్గొనండి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు

Posted On: 06 DEC 2022 3:21PM by PIB Hyderabad

      "పరీక్ష పే చర్చ 2023" పేరిట నిర్వహించే 6వ విడత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వారా మార్గదర్శకత్వం వహించే అవకాశాన్ని పొందవలసిందిగా ఆయన వారిని ఆహ్వానించారు.

   జీవితాన్ని పండుగలా సాగించేందుకు వీలుగా ప‌రీక్ష‌ల ఒత్తిడిపై చర్చించి, ఒత్తిడిని అధిగమించడానికి దేశవ్యాప్తంగా, విదేశాల్లోను ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ప్రధానితో సంభాషించేందుకు వీలుగా "పరీక్ష పే చర్చ" అనే విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించారు. గత ఐదేళ్లుగా ఈ కార్యక్రమాన్నికేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని

పాఠశాల విద్య-అక్షరాస్యత శాఖ విజయవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంకోసం  9 నుంచి 12 తరగతుల వరకు గల పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే సృజనాత్మక రచనల పోటీ ద్వారా ఈ ఎంపిక జరుగుతుంది. ఇందుకోసం https://innovateindia.mygov.in/ppc-2023/ అనే పోర్టల్ ద్వారా  పేర్లను నమోదు చేసుకోవచ్చు. 2022 నవంబరు 25 నుంచి డిసెంబరు 30వ తేదీవరకూ  వర పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ దిగువ జాబితాలో పొందుపరిచిన ఇతివృత్తాలపై రచనల పోటీ నిర్వహిస్తారు.

 

I. విద్యార్థులకు కేటాయించిన ఇతివృత్తాలు

 

  1. మీ స్వాతంత్ర్య సమరయోధులను గురించి తెలుసుకోండి

 మీ రాష్ట్రం లేదా ప్రాంతంలోని స్వాతంత్ర్య సమరయోధుల గురించి  ఏ జీవిత కథలు విన్నారు? వారి జీవితం నుంచి మీరు ఎలాంటి స్ఫూర్తిని పొందుతారు? మీ దేశానికి మీరు ఎలా సేవ చేయాలని అనుకుంటున్నారు?

  1. మన సంస్కృతి మనకు గర్వకారణం

మీ రాష్ట్ర సంస్కృతికి సంబంధించిన ప్రత్యేకత ఏమిటి? ఆ సంస్కృతిలోని ఏయే అంశాలు   దేశానికే గర్వకారణంగా మీరు భావిస్తున్నారు?

  1.   నా పుస్తకం నాకు స్ఫూర్తి

 మిమ్మల్ని గొప్పగా తీర్చిదిద్దిన పుస్తకం ఏది? ఎందుకు?

  1.  భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడండి

సుస్థిర అభివృద్ధి గురించి మీకున్న భావనలు, ఆలోచనలు ఏమిటి? వాతావరణంలో పెనుమార్పులతో మన భావితరాలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయని మీరు అంచనా వేస్తున్నారు? మన పర్యావరణ రక్షణకు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సుస్థిర అభివృద్ధికి విద్యార్థిగా మీరు ఎలా సహకరించగలరు?

 

 

  1.  నా జీవితం, నా ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండడం ఎందుకు ముఖ్యం? మంచి ఆరోగ్యంతో ఉండటానికి మీరు  ఏం చేస్తారు?

  1.  నా స్టార్టప్ కల

జీవితంలో విజయం సాధించడానికి, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు, పని సంస్కృతికి దోహదపడటానికి వీలుగా స్వావలంబన సాధించాలంటే విద్యార్థులలో వ్యవస్థాపకత, ఔత్సాహిక క్రియాశీలత అవసరం. మీ సొంత స్టార్టప్‌పై మీరు కంటున్న కలలు ఏమిటి?

  1. స్సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (ఎస్.టి.ఇ.ఎం.-స్టెమ్) విద్య/ఎల్లలు లేని అధ్యయనం

  విద్యార్థుల పాఠ్యాంశాల ఎంపికలో 2020వ సంవత్సరపు జాతీయ విద్యావిధానం (ఎన్.ఇ.పి.-2020) ఎంతో సౌలభ్యాన్ని అందిస్తుంది.  నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవడానికి, సొంత మార్గాన్ని ఎంచుకునేందుకు, తమకు నచ్చిన వృత్తిని కొనసాగించడానికి విద్యార్థులకు తగిన స్వేచ్ఛ ఉంటుంది. విజ్ఞానశాస్త్రం (సైన్స్), గణితానికి అతీతమైన జీవితం కూడా ఉంది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? విద్యపై పరివర్తనా పూర్వకమైన ఈ సిఫార్సులతో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయని మీరు భావిస్తున్నారు? మీ సూచనలు, సలహాలు ఏమిటి?

  1. పాఠశాలల్లో అధ్యయనానికి ఆట బొమ్మలు-క్రీడలు

 విషయాలు నేర్చుకోవడానికి ఆట బొమ్మలు-క్రీడలు కూడా ఒక కారణం కావచ్చు. మాధ్యమిక స్థాయిలో ఆటబొమ్మలు-క్రీడలతో విద్యార్థుల అధ్యయనం అన్న అంశంపై మీ అభిప్రాయాన్ని రాయండి.

 

II. ఉపాధ్యాయుల కోసం కేటాయించిన ఇతివృత్తాలు

  1. మన వారసత్వం

 అభ్యాసకుల పరిపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా  'భారతీయ' సాంప్రదాయ జ్ఞానాన్ని బోధించడంలో కీలకమైన అంశాలు ఏమిటి? మీరు చేపట్టే పాఠశాల పరిధిలోని ప్రాంతాలలో సమగ్రపరుస్తూ, ఈ అంశాన్ని బోధించేందుకు మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందించుకుంటారు. ?

  1. అభ్యాసానికి అనువైన పరిస్థితులకు దోహదపడటం

 మీ అభ్యాసకుల మెరుగైన అభ్యాసం, మనోభావాలకు ప్రాధాన్యం, మానసిక క్షేమం కోసం ఆరోగ్యకరమైన, అనుకూలమైన తరగతి గది వాతావరణాన్ని కల్పించడంలో ఉపాధ్యాయుడుగా మీ పాత్ర ఏమిటి? అభ్యాసకులందరి భాగస్వామ్యం, అభ్యాసం సక్రమంగా జరిగేలా నిర్ధారించడానికి కార్యకలాపాలను ఎలా రూపొందిస్తారు? ‘విద్యార్థులు పరస్పరం ఒకరినుంచి మరొకరు నేర్చుకునే అధ్యయనం సాగించే పీర్ లెర్నింగ్’పై మీ ఆలోచనలు, అభిప్రాయం ఏమిటి?

  1. నైపుణ్యం కోసం విద్య

 నైపుణ్య విద్య చాలా ముఖ్యం. మన దేశంలో నైపుణ్య విద్యను అందించడానికి మొత్తం విద్యావ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మాధ్యమిక విద్యార్థులలో వృత్తి విద్యను ప్రోత్సహించడం ప్రస్తుతం తక్షణావసరంగా ఉంది. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు విద్యావేత్తలు/ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇష్టపడరు, బదులుగా జీవితంలో ముందుకు సాగడానికి వివిధ మార్గాలను అన్వేషించాలని వారు అనుకుంటున్నారు. దీనిపై మీ ఆలోచనలు, భావనలు ఏమిటి?

  1. తక్కువ పాఠ్యాంశాల భారం-పరీక్షలంటే భయం లేని విధానం

  తాము ఏమి నేర్చుకుంటాం, ఎలా నేర్చుకుంటాం అనే దానిపై విద్యార్థులు తగిన ఆత్మవిశ్వాసం కలిగి ఉండేలా చూసేందుకు వారికి అనుభవపూర్వక అభ్యాసం, ప్రాజెక్ట్ ఆధారిత పాఠ్యాంశాల అధ్యయనం అందుబాటులో ఉండాలి; దీనితో వారిపై పరీక్షల ఒత్తిడి అదే తగ్గిపోతుంది. ఎన్.ఇ.పి. 2020లో పొందుపరిచిన ఈ అంశాన్ని అమలు చేయడానికి ఉపాధ్యాయుడుగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.?

  1. భవిష్యత్తు విద్యా సవాళ్లు

మీ అభిప్రాయం ప్రకారం విద్యాపరంగా ప్రస్తుతం ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? విద్యాభ్యాస పరంగా అంచనాలలో వచ్చిన మార్పులను తట్టుకునేందుకు వీలుగా పాఠశాలను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, పిల్లలను ఎలా సిద్ధం చేయాలి?

 

III. తల్లిదండ్రుల కోసం  కేటాయించిన ఇతివృత్తాలు

  1. నా బిడ్డ, నా గురువు

 మీ బిడ్డ ద్వారా మీకు నేర్చుకున్న ఆసక్తికరమైన విషయం ఏమిటి? మీరు దానిని ఎలా నేర్చుకున్నారు, దానికి ఎలా అలవాటు పడ్డారు.? మన పిల్లల అభిరుచులకు అనుగుణంగా మారడం ఎందుకు ముఖ్యం.?

  1. వయోజన విద్య- అందరినీ అక్షరాస్యులుగా మార్చడం

 మీ అభిప్రాయం ప్రకారం వయోజన విద్య ప్రాముఖ్యత ఏమిటి? దేశ సాధికారతకు అది ఎలా దోహదపడుతుంది? ఆధునిక సమస్యలపై పెద్దల అవగాహనకు పిల్లలు ఎలా సహకరించగలరు?

  1. కలిసి నేర్చుకోవడం, కలసి పెరగడం

 పాఠశాలలో చదువుకునే మీ చిన్నారిని ఇంట్లో మీరు ఎలా అభినందిస్తారు? మీ పిల్లల ఆరోగ్యకరమైన అభ్యాస ప్రక్రియలో తల్లిదండ్రులుగా మీ పాత్ర గురించి సృజనాత్మకంగా రచన చేయండి.  

    మై గవ్‌(MyGov) పోర్టల్ ద్వారా నిర్వహించిన పోటీల్లో ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పి.పి.సి. కిట్లను కానుకలుగా ప్రదానం చేస్తారు. అలాగే, జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి.) డైరెక్టర్ నుంచి వారికి ప్రశంసా పత్రాన్ని అందిస్తారు.

 **** 



(Release ID: 1881288) Visitor Counter : 177