హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భద్రత మరియు సరిహద్దు నిర్వహణపై భారత్‌, బంగ్లాదేశ్ మధ్య 18వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జె డబ్ల్యు జి) 18వ సమావేశం

Posted On: 06 DEC 2022 8:43PM by PIB Hyderabad

 

భారత్‌ మరియు బంగ్లాదేశ్ మధ్య భద్రత మరియు సరిహద్దు నిర్వహణపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జె డబ్ల్యూ జి) 18వ సమావేశం డిసెంబర్ 5 మరియు 6, 2022 తేదీలలో జరిగింది. భారత ప్రతినిధి బృందానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ నాయకత్వం వహించారు. భారత్ మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి బంగ్లాదేశ్ ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ఎ.కె. ముఖ్లేసూర్ రెహమాన్ నాయకత్వం వహించారు.

న్యూఢిల్లీలో జరిగిన 'నో మనీ ఫర్ టెర్రర్' సదస్సు సందర్భంగా నవంబర్ 18న బంగ్లాదేశ్ హోం మంత్రి శ్రీ అసదుజ్జమాన్ ఖాన్‌తో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఇరు పక్షాలు సరిహద్దు నిర్వహణ మరియు సాధారణ భద్రత సంబంధిత సమస్యలపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

గత నెలలో ఇరు దేశాల మంత్రుల మధ్య జరిగిన సమావేశాన్ని అనుసరించి నేటి సమావేశంలో ఇరుదేశాల మధ్య అద్భుతమైన ద్వైపాక్షిక సంబంధాలను హైలైట్ చేశారు. భద్రత మరియు సరిహద్దు సంబంధిత అంశాలలో పరస్పర సహకారాన్ని మరింత లోతుగా మరియు బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారతదేశ సహకారాన్ని ఈ సందర్భంగా బంగ్లాదేశ్  గుర్తుచేసుకుంది.

అంతర్జాతీయ సరిహద్దుల్లో 150 గజాలలోపు సరిహద్దు కంచె, అభివృద్ధి పనులు, అక్రమ క్రాసింగ్, ఉగ్రదాడిని అరికట్టడంలో ద్వైపాక్షిక సహకారం, ఉగ్రవాదంపై పోరు, వ్యవస్థీకృత నేరాలు, స్మగ్లింగ్ తదితర ద్వైపాక్షిక అంశాలపై సమావేశంలో చర్చించారు.


 

****


(Release ID: 1881282) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi , Bengali