రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
నాగాలాండ్‌లోని దిమాపూర్ నుంచి కొహిమా వరకు (ప్యాకేజీ-1) 4 వరుసల 14.93 కి.మీ. రహదారి ప్రాజెక్టు ఈ ఏడాది పూర్తవుతుందని వెల్లడించిన శ్రీ నితిన్ గడ్కరీ
प्रविष्टि तिथि:
06 DEC 2022 5:11PM by PIB Hyderabad
నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్ నుంచి కొహిమా వరకు (ప్యాకేజీ-1) 4 వరుసల 14.93 కి.మీ. రహదారి ప్రాజెక్టు ఈ ఏడాది పూర్తవుతుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ వరుస ట్వీట్లలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.387 కోట్లుగా పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే నాగాలాండ్-మణిపూర్ మధ్య రహదారి అనుసంధానం మెరుగుపడడంతో పాటు, ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుందని శ్రీ గడ్కరీ చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అత్యుత్తుమ రహదారి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న దృక్పథంతో పని చేస్తున్నామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
*****
(रिलीज़ आईडी: 1881246)
आगंतुक पटल : 121