మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కాశీ తమిళ సంగమంలో పాల్గొనేందుకు కాశీ చేరుకున్న తమిళ ఔత్సాహికుల బృందం
శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన అతిథులు; సాయంత్రం గంగా హారతి వీక్షణ
Posted On:
06 DEC 2022 2:55PM by PIB Hyderabad
'కాశీ తమిళ సంగమం'లో పాల్గొనేందుకు తమిళ ఔత్సాహికుల బృందం ఎర్నాకులం-పట్నా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పవిత్ర కాశీ నగరాన్ని చేరుకున్నారు. అదనపు ప్రాంతీయ రైల్వే మేనేజర్ శ్రీ లాల్జీ చౌదరి పూలమాలలు వేసి, పూలు చల్లినిన్న రాత్రి వారణాసి రైల్వే స్టేషన్‌లో వారికి స్వాగతం పలికారు.


తమిళ బృంద సభ్యులు ఉదయం శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా ఘాట్లను సందర్శించి పూజలు చేసింది.
మాతా విశాలాక్షి, మాతా అన్నపూర్ణ దేవాలయాలను కూడా సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ పర్యటన ప్రయాణంలో భాగంగా, రవిదాస్ ఘాట్‌ను వద్దకు వెళ్లి గంగా హారతిని వీక్షిస్తారు.
ఇవాళ బీహెచ్‌యూ ప్రాంగణంలో కార్తీక దీపం పండుగను నిర్వహించనున్నారు. ఆ ప్రాంగణంలో వేలాది దీపాలు వెలిగిస్తారు. వేదికను బీహెచ్‌యూ విద్యార్థులు, తమిళనాడు నుంచి వచ్చిన అతిథులు అలంకరించారు.
****
(Release ID: 1881245)
Visitor Counter : 138