ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జి20కిఅధ్యక్ష బాధ్యతల ను భారతదేశంస్వీకరించిన నేపథ్యం లోఅఖిలపక్ష సమావేశంజరిగింది


జి20కిఅధ్యక్షత అనేది యావత్తు దేశప్రజల కు సంబంధించింది
ప్రపంచంసమక్షం లో భారతదేశం యొక్కప్రతిష్ట ను అపూర్వం గాఆవిష్కరించడానికి జి20అధ్యక్షతఒక అవకాశాన్ని అందిస్తోంది
భారతదేశంపట్ల ప్రపంచం అంతటా ఆసక్తిమరియు ఆకర్షణ నెలకొన్నాయి
జి20కిఅధ్యక్షతఅనేది పర్యటన రంగాని కి మరియుస్థానిక ఆర్థిక వ్యవస్థ కుగొప్పవైన అవకాశాల ను తీసుకురానుంది

Posted On: 05 DEC 2022 10:44PM by PIB Hyderabad

జి20 కి భారతదేశం అధ్యక్షత వహించడం తో ముడిపడ్డ పార్శ్వాల పైన చర్చించడం కోసమని డిసెంబర్ 5వ తేదీ న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం లో భారతదేశం నలు మూలల కు చెందిన రాజకీయ నాయకులు ఉత్సాహం గా పాలుపంచుకున్నారు.

జి20 కి భారతదేశం అధ్యక్షత వహించడం యావత్తు దేశ ప్రజల కు సంబంధించిన అంశం; అంతేకాకుండా భారతదేశం యొక్క బలాల ను ప్రపంచవ్యాప్తం గా చాటిచెప్పడానికి అందివచ్చిన ఒక విశిష్టమైన అవకాశం కూడా ను అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం భారతదేశం అంటే ప్రపంచం అంతటా ఎక్కడలేని ఆసక్తి మరియు ఆకర్షణ నెలకొన్నాయి. ఈ పరిణామాల వల్ల జి20 కి అధ్యక్షత వహించే విషయం లో భారతదేశాని కి ఉన్న శక్తి సామర్థ్యాలు మరింత గా ప్రబలం గా మారుతున్నాయి అని కూడా ఆయన అన్నారు.

ఒక జట్టు వలె కలిసికట్టు గా పని చేయడాని కి ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, జి20 ఆధ్వర్యం లో జరిగే వేరు వేరు కార్యక్రమాల నిర్వహణ లో నేత లు అందరు వారి వారి సహకారాన్ని అందించాలి అంటూ విజ్ఞప్తి ని చేశారు. జి20 అధ్యక్ష బాధ్యత భారతదేశం లో సాంప్రదాయిక మహానగరాల లోని ప్రాంతాల ను కళ్ళ కు కట్టడం లో సాయపడగలదని, తద్ద్వారా మన దేశం లో ప్రతి ప్రాంతం యొక్క అద్వితీయత పెల్లుబుకుతుంది కూడాను అని ఆయన అన్నారు.

జి20 కి భారతదేశం అధ్యక్షత వహించే కాలం లో పెద్ద సంఖ్య లో సందర్శకులు భారతదేశాని కి తరలి వచ్చేందుకు గల ఆస్కారాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, జి20 సమావేశాల ను ఏర్పాటు చేసే ప్రాంతాల లో పర్యటన రంగాన్ని ప్రోత్సహించేందుకు మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ లను వృద్ధి చెందింపచేసేందుకు ఉన్న అవకాశాల ను గురించి పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి ప్రసంగించడాని కంటే ముందు గా, వివిధ రాజకీయ నాయకులు జి20 కి భారతదేశం అధ్యక్షత వహించడం అనే అంశం పై వారి వారి విలువైన సూచనల ను వెల్లడించారు. ఆ రాజకీయ నేతల లో శ్రీ జె.పి. నడ్డా, శ్రీ మల్లికార్జున్ ఖర్ గే, మమత బనర్జీ గారు, శ్రీ నవీన్ పట్నాయక్, శ్రీ అరవింద్ కేజ్ రీవాల్, శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి, శ్రీ సీతారాం ఏచూరి, శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ ఎమ్.కె. స్టాలిన్, శ్రీ ఎడాప్పడి కె. పళనిస్వామి, శ్రీ పశుపతినాథ్ పారస్, శ్రీ ఏక్ నాథ్ శిందే మరియు శ్రీ కె.ఎమ్. కాదర్ మొహీదీన్ లు ఉన్నారు.

సమావేశం సాగిన క్రమం లో, హోం మంత్రి మరియు ఆర్థిక మంత్రి క్లుప్తం గా మాట్లాడారు. జి20 పట్ల భారతదేశం యొక్క ప్రాధాన్యాల ను గురించి న ఒక సమగ్ర నివేదిక ను కూడా ఈ సందర్భం లో ఆవిష్కరించడం జరిగింది.

సమావేశం లో పాలుపంచుకొన్న వారి లో మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింహ్, శ్రీ అమిత్ శాహ్, శ్రీమతి నిర్మలా సీతారమణ్ , డాక్టర్ శ్రీ ఎస్. జయ్ శంకర్ , శ్రీ పీయూష్ గోయల్, శ్రీ ప్రహ్లాద్ జోశి, శ్రీ భూపేందర్ యాదవ్ మరియు పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ లు ఉన్నారు.

****


(Release ID: 1881106) Visitor Counter : 203