అంతరిక్ష విభాగం

అంతరిక్ష రంగంలో భారత్ ను కీలకమైన అంతర్జాతీయ శక్తి గా అభివర్ణించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ; యుఎఇతో అంతరిక్ష సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి భారతదేశం ఆసక్తిగా ఉందని ఉద్ఘాటన

Posted On: 05 DEC 2022 3:27PM by PIB Hyderabad

‘అబుదాబీ స్పేస్ డిబేట్" కు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ జితేంద్ర సింగ్ : ప్రారంభ కార్యక్రమంలో ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తో ఆలోచనలను పంచుకున్న డాక్టర్ జితేంద్ర సింగ్

భారతీయ అంతరిక్ష పరిశ్రమ విశ్వసనీయత , ఆర్థిక వ్యవస్థ అనే రెండు విషయాల పరంగా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది: డాక్టర్ జితేంద్ర సింగ్

విదేశీ ప్రభుత్వ , ప్రైవేట్ రంగ సంస్థల ప్రవేశాన్ని సులభతరం చేయడానికి అంతరిక్ష రంగంలో అంకుర సంస్థల అభివృద్ధిని కూడా భారతదేశం ఆసక్తిగా ప్రోత్సహిస్తోంది: డాక్టర్ జితేంద్ర సింగ్

అంతరిక్ష రంగంలో భారతదేశం కీలక అంతర్జాతీయ శక్తి గా ఉందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) తో అంతరిక్ష సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి భారతదేశం ఆసక్తిగా ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) పీఎంఓ పర్సనల్, పబ్లిక్ గ్రీవియెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఉద్ఘాటించారు

యుఎఇ శిఖరాగ్ర సదస్సు ‘అబుదాబి స్పేస్ డిబేట్" ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రారంభ వేడుకకు హాజరైన యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ కు అభివాదం తెలిపారు. ప్రధాని మోదీ తరఫున ఆయనకు, యుఎఇ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో "అబుదాబి స్పేస్ డిబేట్" రెండు రోజుల అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి డాక్టర్ జితేంద్ర సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. యు ఎ ఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో పాటు, ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్, పలు దేశాల దౌత్యవేత్తలు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆవిర్భవించి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రజల తరఫున డాక్టర్ జితేంద్ర సింగ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక బంగారు మైలురాళ్లతో తన అంతరిక్ష ప్రయాణ సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకోవడం  ఈ ఏడాది యు ఎ యి సాధించిన మరో ప్రశంసనీయ ప్రగతి అని

డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

భారతదేశం , యుఎఇ నాయకుల ప్రాధాన్యతా రంగాలలో అంతరిక్ష రంగం అభివృద్ధి ఒకటి అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు, భారతదేశం తన అంతరిక్ష ప్రయాణాన్ని ఏడు దశాబ్దాల క్రితం ప్రారంభించి నేడు ప్రముఖ అంతరిక్ష శక్తిగా గుర్తించబడిందనిఆయనఅన్నారు. దేశ శాస్త్రజ్ఞుల అంకితభావం, కఠోర కృషి ద్వారా స్వదేశీ అభివృద్ధిపై దృష్టి సారించడం భారత ప్రయాణంలో ప్రధానాంశం అని ఆయన అన్నారు.

భారతదేశంలో దేశీయంగా అభివృద్ధి చెందిన అంతరిక్ష రంగం, వేగంగా అభివృద్ధి చెందుతున్న యుఎఇ అంతరిక్ష రంగం చాలా పరిపూరకరమైనవి అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంతరిక్షం మన ఉమ్మడి మానవాళికి సేవ చేసే రంగంగా ఉండేలా చూడాలంటే, అంతరిక్షం గురించి చర్చించడానికి భాగస్వాములం దరినీ ఒకచోట చేర్చడం చాలా ముఖ్యం, ఈ విషయంలో, ఈ వేదిక అంతరిక్ష రంగం భవిష్యత్తును రూపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు.

‘‘భారతీయ అంతరిక్ష పరిశ్రమ నేడు

విశ్వసనీయత , ఆర్థిక వ్యవస్థ అనే రెండు అంశాల పరంగా ప్రఖ్యాతి గాంచింది.

ప్రపంచంలో తన ఫ్లాగ్ షిప్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్వి ) కు అత్యధిక విజయ నిష్పత్తిని కలిగి ఉన్నందుకు భారతదేశం గర్వపడుతోంది.

కొద్ది వారాల క్రితం, భారతదేశ పిఎస్ఎల్వి అభివృద్ధి చెందిన , అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి సహా 36 ఉపగ్రహాలను ప్రయోగించింది‘‘ అని

డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటివరకు 100 కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించిందని, జిశాట్, భూ పరిశీలన ఉపగ్రహాలు , అంతరిక్ష ఆధారిత ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థల కోసం అపారమైన అంతర్గత ఉపగ్రహ నిర్మాణ సామర్థ్యాలను కలిగి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భారత దేశం

తన సొంత జీపీఎస్ ను కూడా అభివృద్ధి చేసిందని, దీన్నే భారత ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ లేదా ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ అని పిలుస్తామని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. 2013 లో భారతదేశ మార్స్ ఆర్బిటర్ మిషన్ ను విజయవంతంగా ప్రారంభించడంతో పాటు, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 పేరుతో చంద్రుడిపైకి తన మిషన్ ను పంపడానికి భారతదేశం రెండుసార్లు ప్రయత్నించింది. చంద్రుడిపైకి మూడో ఉపగ్రహ మిషన్ చంద్రయాన్-3ను వచ్చే ఏడాది ప్రయోగించనున్నట్లు వివరించారు.

భారతదేశ ఇతర ప్రధాన అంతరిక్ష కార్యక్రమాలలో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ లేదా మనం పిలుస్తున్న గగన్ యాన్ ప్రాజెక్ట్ అని , దీని కింద మనం 2024 లో మొదటి సిబ్బంది విమానాన్ని అంతరిక్షంలోకి పంపాలని

యోచిస్తున్నామని చెప్పారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, వసుదైక కుటుంబం అనే భారతీయ సిద్ధాంతం తత్వశాస్త్రం వెలుగులో - ప్రపంచం ఒకే కుటుంబం, అంతరిక్ష అభివృద్ధి ఫలాలను అన్ని దేశాలకు పంచాలని, అంతరిక్ష రంగంలో ప్రభుత్వాలు , ప్రైవేట్ సంస్థల మధ్య సన్నిహిత సహకారాన్ని తీసుకురావాలని భారతదేశం కోరుకుంటోందని చెప్పారు.

ఈ ఆలోచనతో, భారతదేశం ఇటీవల మైలురాయి సంస్కరణలను తీసుకువచ్చిందని, ఇది మన పరిశోధన సామర్థ్యాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ,ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి విధాన చొరవలకు దారితీసిందని ఆయన అన్నారు.

విదేశీ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ప్రవేశాన్ని సులభతరం చేయడానికి అంతరిక్ష రంగంలో అంకుర సంస్థల అభివృద్ధిని కూడా భారతదేశం ఆసక్తిగా ప్రోత్సహిస్తోందని మంత్రి చెప్పారు. ఈ విషయంలో, భారత అంతరిక్ష ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ -ఐఎన్-స్పేస్ అనే ప్రత్యేక సంస్థను భారతదేశం ఏర్పాటు చేసిందని, ఇది అంతరిక్ష రంగంలో మన నూతన ప్రైవేట్ సంస్థలను నడిపించే లక్ష్యంతో పని చేస్తుందని ఆయన తెలిపారు.

శ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ చేపట్టిన అనేక మార్గదర్శక కార్యక్రమాలలో అబుదాబి స్పేస్ డిబేట్ ఒకటని, ఇది అంతరిక్ష రంగం పట్ల ఆయన నిబద్ధత, దార్శనికతను ప్రతిబింబిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. యుఎఇ మార్స్ కక్ష్యకు అంతరిక్ష మిషన్ పంపడంతో ఈ విజన్ ఇప్పటికే సాకారం అయ్యిందని, తద్వారా అంతరిక్ష రంగంలో తన పరాక్రమాన్ని ప్రదర్శించే ఆరవ దేశంగా అవతరించిందని, అంతేకాకుండా యుఎఇ తన మొదటి ప్రయత్నంలోనే మార్స్ ఆర్బిటర్ ను విజయవంతంగా ప్రయోగించిన భారతదేశం కాకుండా రెండవ దేశంగా అవతరించిందని ఆయన అన్నారు.

ఆరు నెలల పాటు నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం ద్వారా వచ్చే ఏడాది రెండవ మానవ అంతరిక్ష యాత్రను ప్లాన్ చేసినందుకు యుఎఇని మంత్రి అభినందించారు.సమీప భవిష్యత్తులో యుఎఇ మూన్ మిషన్ -రషీద్ రోవర్ ప్రయోగం ,అంతరిక్ష నిధిని సృష్టించడం అంతరిక్ష రంగంలో రాణించడానికి యుఎఇ నిబద్ధత ,సంకల్పాన్ని ప్రతిబింబించే మైలురాళ్ళు అని అన్నారు.

యుఎఇతో భారతదేశ క్రియాశీల అంతరిక్ష భాగస్వామ్యం 2017 నాటిదని, పర్యావరణ అంతరిక్ష డేటాను సేకరించడానికి ఉద్దేశించిన యుఎఇ మొదటి నానో శాటిలైట్ - 'నయీఫ్ -1' ను పిఎస్ఎల్వి ప్రయోగించిందని ఆయన గుర్తు చేశారు.

అంతరిక్ష వ్యాపారం , సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధికారపరచడంలో ప్రభుత్వాల పాత్రను నిర్మించడానికి అబుదాబి స్పేస్ డిబేట్ ఉద్దేశాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు.

వాతావరణ సమస్యలను పరిష్కరించడానికి అంతరిక్ష రంగం పాత్ర, పర్యావరణ కట్టుబాట్లకు జవాబుదారీతనం తీసుకురావడం,

రాజకీయ ప్రక్రియకు అంతరిక్షం నుండి, అంతరిక్షానికి బెదిరింపులు ఇంకా అంతరిక్ష ఆవిష్కరణలు చేయగల ప్రైవేటు రంగం, వ్యక్తుల ఉనికిని పెంచడం పై సదస్సు చర్చిస్తుంది. ఇవి మన కాలానికి చాలా సందర్భోచితమైనవి . దృష్టి పెట్టవలసిన అంశాలు. గతంలో అంతరిక్ష రంగంలో ఇలాంటి ఇతర సమావేశాల కు ఈ చొరవ భిన్నమైనది.

రాబోయే సంవత్సరాల్లో అబుదాబి స్పేస్ డిబేట్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని, అంతరిక్ష సంబంధిత విషయాలలో చర్చలకు ఒక ప్రముఖ వేదికగా మారుతుందని, భారతదేశం-యుఎఇ అంతరిక్ష సహకారాన్ని పూర్తిగా భిన్నమైన ,మరింత ఉన్నత ప్రాదేశిక కక్ష్యలోకి తీసుకువెళుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1 న భారతదేశం జి -20 అధ్యక్ష పదవిని చేపట్టినందున భారత్ అధ్యక్ష హయాంలో జరిగే జి -20 శిఖరాగ్ర సమావేశం , జి -20 సమావేశాలకు హాజరు కావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ యుఎఇని ఆహ్వానించారు.

<><><><><>



(Release ID: 1881046) Visitor Counter : 652