పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఢిల్లీ-ఎన్.సి.ఆర్. లో తక్షణమే అమల్లోకి వచ్చిన - సవరించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జి.ఆర్.ఏ.పి) మూడవ దశ
Posted On:
04 DEC 2022 6:13PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు
* గత 24 గంటల్లో ఢిల్లీ-ఎన్.సీ.ఆర్. లో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించిన నేపథ్యంలో జి.ఆర్.ఏ.పి. కింద చర్యల కోసం సి.ఏ.క్యూ.ఎం. సబ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
* 'తీవ్రమైన' గాలి నాణ్యత కోసం, జి.ఆర్.ఏ.పి. మూడవ దశ కింద సూచించిన అన్ని చర్యలు - ఎన్.సి.ఆర్. లో తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా సంబంధిత అన్ని ఏజెన్సీలు సరైన శ్రద్ధతో అమలు చేయాలి; మొదటి, రెండవ దశ చర్యలను బలోపేతం చేయాలి
గత 24 గంటల్లో ఢిల్లీ-ఎన్.సీ.ఆర్. లో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించిన దృష్ట్యా, ఎన్.సి.ఆర్. మరియు పరిసర ప్రాంతాల్లో (సి.ఎ.క్యూ.ఎం) గాలి నాణ్యత యాజమాన్య కమిషన్ కు చెందిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జి.ఆర్.ఎ.పి) కింద చర్యలను ప్రారంభించే సబ్-కమిటీ ఈరోజు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ మొత్తం గాలి నాణ్యత సూచీ (ఏ.క్యూ.ఐ) 407 మార్కు దాటింది, ఇది స్థానికంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల ప్రభావం కావచ్చు.
14.11.2022 తేదీ నుంచి ఢిల్లీ-ఎన్.సి.ఆర్. ప్రాంతంలో మొత్తం గాలి నాణ్యతపై మూడవ దశ కింద చర్యల ఉపసంహరణ ప్రభావంతో పాటు జి.ఆర్.ఏ.పి. మొదటి, రెండవ దశ కింద అమలై కొనసాగుతున్న నియంత్రణ / నివారణ చర్యలను కమిషన్ సమగ్రంగా సమీక్షించింది. అకస్మాత్తుగా నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, గాలి నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించేందుకు ముందస్తు చర్యగా మొత్తం ఎన్.సి.ఆర్. ప్రాంతంలో తక్షణ ప్రభావంతో జీ.ఆర్.ఆ.పి. మూడవ దశను మళ్లీ అమలు చేయడం అవసరమని, మొత్తం గాలి నాణ్యతా ప్రమాణాలను నిశితంగా సమీక్షిస్తున్న సమయంలో భావించినట్లు, ఈ సమావేశంలో సబ్‌కమిటీ పేర్కొంది.
డైనమిక్ మోడల్ తో పాటు, వాతావరణ / వాతావరణ సూచన ప్రకారం, ఈ ఆకస్మిక స్పైక్ బహుశా స్థానికీకరించిన కారకాల వల్ల కావచ్చు, అందువల్ల గాలి నాణ్యత మరింత క్షీణించకుండా, అదేవిధంగా, ఢిల్లీ ఏ.క్యూ.ఐ. లో హెచ్చు తగ్గులు లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగా, జి.ఆర్.ఏ.పి. - 'తీవ్రమైన' గాలి నాణ్యత (ఢిల్లీ ఏ.క్యూ.ఐ. 401–450 మధ్య) మూడవ దశ కింద ఊహించిన విధంగా అన్ని చర్యలను తిరిగి ప్రారంభించాలని సబ్-కమిటీ పిలుపు నిచ్చింది. ఇది జి.ఆర్.పి. మొదటి, రెండవ దశ, మూడవ దశ లో పేర్కొన్న నివారణ / నియంత్రణ చర్యలకు అదనం.
దీని ప్రకారం, ఇప్పటికే అమలులో ఉన్న జి.ఆర్.ఏ.పి. మొదటి, రెండవ దశ నివారణ / నిర్బంధ చర్యలతో పాటు, జి.ఆర్.ఏ.పి. మూడవ దశ ప్రకారం 9-అంశాల కార్యాచరణ ప్రణాళిక మొత్తం ఎం.సి.ఆర్. లో నేటి నుండి తక్షణ ప్రభావంతో అమల్లోకి వస్తుంది.
ఈ 9-అంశాల కార్యాచరణ ప్రణాళిక లో ఎన్.సి.ఆర్., డి.పి.సి.సి. కి చెందిన వివిధ ఏజెన్సీలు, పి.సి.బి.లు అమలు చేయాల్సిన, నిర్ధారించవలసిన దశలు ఉన్నాయి.
ఈ దశలు:
1. యంత్రాల సహాయంతో, వాక్యూమ్ ఆధారంగా రోడ్లను ఊడ్చే ప్రక్రియను తీవ్రతరం చేయడం
2. వేడిగా ఉండే ప్రదేశాలు, రాకపోకలు ఎక్కువగా ఉండే రహదారులు, నిర్దేశించిన ప్రదేశాలు, పల్లపు ప్రదేశాలలో సేకరించిన దుమ్మును సరిగ్గా పారవేయడంతో పాటు, రహదారులపై, ట్రాఫిక్ రద్దీకి ముందు, దుమ్ము ను నిరోధించే చర్యలతో పాటు, రోజువారీ నీటిని చిలకరించడం.
3. ప్రజా రవాణా సేవలను తీవ్రతరం చేయడం. రద్దీ లేని సమయాల్లో ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఆ సమయాల్లో రేట్లు తగ్గించే విధానాన్ని ప్రవేశపెట్టడం.
4. నిర్మాణం, కూల్చివేత (సి & డి ) కార్యకలాపాలు:
(i) ఈ దిగువ పేర్కొన్న వర్గాల ప్రాజెక్టులు మినహా మొత్తం ఎన్.సి.ఆర్. లో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై కఠినమైన నిషేధాన్ని అమలు చేయాలి:
ఏ) రైల్వే సేవలు / రైల్వే స్టేషన్లు
బి) మెట్రో స్టేషన్లతో సహా మెట్రో రైలు సేవలు.
సి) విమానాశ్రయాలు, అంతర్ రాష్ట్ర బస్సు టెర్మినల్స్.
డి) జాతీయ భద్రత / రక్షణ సంబంధిత కార్యకలాపాలు / జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు
సి) ఆసుపత్రులు/ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు.
ఎఫ్) రహదారులు, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఓవర్ బ్రిడ్జిలు, విద్యుత్ సరఫరా లైన్లు, పైప్ లైన్లు మొదలైన లీనియర్ పబ్లిక్ ప్రాజెక్టులు.
జి) మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, నీటి సరఫరా ప్రాజెక్టులు మొదలైన పారిశుద్ధ్య ప్రాజెక్టులు.
హెచ్) పైన పేర్కొన్న వర్గాలకు చెందిన ప్రాజెక్టులకు ప్రత్యేకమైన, అనుబంధంగా ఉన్న ప్రాజెక్టుల అనుబంధ కార్య కలాపాలు.
గమనిక: పైన పేర్కొన్న మినహాయింపులు సి&డి వ్యర్ధ పదార్థాల నిర్వహణ నియమాలు,
(Release ID: 1881004)
Visitor Counter : 183