రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆకాష్ ఆయుధ వ్యవస్థ (భారత సైనిక రకం) ఏహెచ్‌ఎస్‌పీని క్షిపణి వ్యవస్థల నాణ్యత నిర్ధరణ ఏజెన్సీకి అప్పగించిన డీఆర్‌డీవో

Posted On: 04 DEC 2022 10:36AM by PIB Hyderabad

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), హైదరాబాద్‌లోని క్షిపణి వ్యవస్థల నాణ్యత నిర్ధరణ ఏజెన్సీకి (ఎంఎంస్‌క్యూఏఏ) ఆకాష్ ఆయుధ వ్యవస్థ (భారత సైనిక రకం) రహస్య వివరాలను కలిగి ఉండడానికి, నమూనాల సరఫరా అధికారాన్ని (ఏహెచ్‌ఎస్‌పీ) డిసెంబర్ 03, 2022న అప్పగించింది. ఆకాశ్‌ ఆయుద్ధ వ్యవస్థను రూపొందించిన, నోడల్ ఏజెన్సీగా ఉన్న రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాలలో (డీఆర్‌డీఎల్‌) ఈ కార్యక్రమం జరిగింది. ఏహెచ్‌ఎస్‌పీ బదిలీలో భాగంగా సాంకేతిక అంశాలు & నాణ్యత పత్రాలు, పూర్తి ఆయుధ వ్యవస్థ భాగాల నమూనాలను సీలు చేసి ప్రాజెక్ట్ ఆకాష్ ద్వారా ఎంఎంస్‌క్యూఏఏకి అప్పగించారు.

డీఆర్‌డీవో, భారత సైన్యం, రక్షణ పరిశ్రమను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఏహెచ్‌ఎస్‌పీ బదిలీని కీలక మైలురాయిగా అభివర్ణించారు. సేవల అవసరాలను తీర్చడంలో ఇది విజయవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏహెచ్‌ఎస్‌పీ ద్వారా క్షిపణులు, బహుళ క్షేత్ర వ్యవస్థలతో కూడిన సంక్లిష్ట వ్యవస్థను క్షిపణి క్లస్టర్ నుంచి ఎంఎంస్‌క్యూఏఏ బదిలీ చేసినందుకు రక్షణ విభాగం ఆర్‌&డీ కార్యదర్శి, డీఆర్‌డీవో ఛైర్మన్ డా.సమీర్ వి కామత్ ప్రాజెక్ట్ ఆకాష్ బృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో తయారయ్యే క్షిపణి వ్యవస్థల కోసం ప్రస్తుత బదిలీ ప్రక్రియ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి అత్యాధునిక ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ ఆకాశ్. దాదాపు దశాబ్ద కాలం పాటు సాయుధ దళాల కలిసి పాటు భారత గగనతలాన్ని రక్షిస్తుంది. భారత సైనిక దళం, నౌకాదళం రూ.30,000 కోట్లతో దీని తయారీకి పురమాయించాయి. స్వదేశీ క్షిపణి వ్యవస్థ కోసం ఇచ్చిన అతి పెద్ద సింగిల్-సిస్టమ్ ఆర్డర్లలో ఇది ఒకటి.

డీఆర్‌డీఎల్‌తో పాటు, మరికొన్ని డీఆర్‌డీవో పరిశోధనశాలలు కూడా ఆకాశ్‌ వ్యవస్థ అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. అవి, రీసెర్చ్ సెంటర్ ఇమారత్; ఎలక్ట్రానిక్స్ & రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్; రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఇంజినీర్స్‌); ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్; ఆర్మమెంట్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్; హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ, వెహికల్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, లార్సెన్ & టూబ్రో, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బీఈఎంఎల్‌ లిమిటెడ్‌తో పాటు మరికొన్ని సహా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ వ్యవస్థ ఉత్పత్తిలో పాల్గొంటాయి.

***



(Release ID: 1880882) Visitor Counter : 154