సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారత దిశగా విశేష కృషి చేసిన సంస్థలు, వ్యక్తులకు జాతీయ అవార్డులను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి


దివ్యాంగుల సాధికారత దిశగా సాధించిన విజయాలు, విశేష కృషి కి గుర్తింపుగా వ్యక్తులు, సంస్థలు, సంఘాలు, రాష్ట్రం/జిల్లా మొదలైన వారికి అవార్డుల ప్రదానం

Posted On: 02 DEC 2022 3:02PM by PIB Hyderabad

2022, డిసెంబర్ 3న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖ వికలాంగుల సాధికారత విభాగం (దివ్యాంగజన్) ఆధ్వర్యంలో నిర్వహించే 'అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం' సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు అవుతారు.

వికలాంగుల సాధికారతకు కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, సంస్థలు , రాష్ట్ర/జిల్లా లకు వార్షిక జాతీయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షత వహిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం,సాధికారిత శాఖ సహాయ మంత్రులు శ్రీ రామ్ దాస్ అథవాలే, శ్రీ ఎ. నారాయ ణ స్వామి, శ్రీమతి ప్ర తిమా భౌమిక్ కూడా ఈ

కార్యక్రమానికి హాజరు అవుతారు.

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా డిసెంబర్ 3వ తేదీ నాడు, సామాజిక న్యాయం,సాధికారిత మంత్రిత్వ శాఖ లోని వికలాంగుల సాధికారిత విభాగం (దివ్యాంగజన్) వికలాంగుల సాధికారిత దిశగా సాధించిన అద్భుత విజయాలు , కృషికి గాను వ్యక్తులు, సంస్థలు, సంఘాలు, స

రాష్ట్రం/జిల్లాలకు జాతీయ అవార్డులను ప్రదానం చేస్తుంది.

2021, 2022 సంవత్సరాలకు గాను వికలాంగుల సాధికారతకు జాతీయ అవార్డులు ఈ క్రింది కేటగిరీల క్రింద ఇవ్వబడతాయి:-

సర్వశ్రేష్ఠ దివ్యాంగజన్;

శ్రేష్ఠ్ దివ్యాంగజన్;

శ్రేష్ఠ్ దివ్యాంగ్ బాల్/బాలికా;

సర్వశ్రేష్ఠ వ్యక్తి – దివ్యాంగజనో కే సశక్తికరణ్ కే లియే కార్యరత్;

సర్వశ్రేష్ఠ పునర్వాస్ పేషెవర్ (పునరావాస నిపుణుడు/కార్మికుడు)

-దివ్యాంగథా కే క్షేత్ర మే కార్యరత్;

సర్వశ్రేష్ఠ

అనుసంధన్/ నవప్రవర్తన్/ ఉత్పద్వికాస్ – దివ్యాంగతాకే సశక్తికరణ్ కే క్షేత్ర మే;

దివ్యాంగ సశక్తికరణ్ హేతు

సర్వేశ్రేష్ఠ సంస్థాన్ (ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఎన్జీవో);

దివ్యాంగో కే లియే సర్వశ్రేష్ఠ నియోక్తా (ప్రభుత్వ సంస్థ/ పిఎస్ ఇలు/ అటానమస్ బాడీలు/ ప్రయివేట్ సెక్టార్);

దివ్యాంగో కే లియే సర్వశ్రేష్త్ ప్లేస్ మెంట్ ఏజెన్సీ - గవర్నమెంట్/స్టేట్ గవర్నమెంట్/లోకల్ బాడీస్ మినహాయించి;

సుగమ్యా భారత్ అభియాన్ కే కార్యన్వయాన్/బదముక్తా వారణ్ కే సృజన్ మే సర్వశ్రేష్ఠ రాజ్య/యుటి/జిలా;

సర్వశ్రేష్ఠ సుగమ్యా యతాయత్ కే సదహాన్/సూచనా ఎవెం సంచార్ ప్రోద్యోగికి (ప్రభుత్వ/ప్రైవేటు సంస్థ);

దివ్యాంగజనో కే అధికార్ అధినీయం/యుడిఐడి ఎవేం దివ్యాంగ సశక్తికరంకి అన్య యోజనోన్ కే కార్యన్వయాన్ మే సర్వశ్రేష్ఠ రాజ్య/యుటి/జిలా;

దివ్యాంగజనో కే అధికార్ అధినీయం, 2016 కే అప్నే రాజ్య మే కార్యన్వయాన్ మే సర్వశ్రేష్ఠ రాజ్య ఆయుక్తా దివ్యంగజన్

పునర్వసన్ పేషెవరోన్ కే వికాస్ మే సాన్లాంగ్న్ సర్వశ్రేష్ట సంఘటన్

2017 వరకు, అవార్డు పథకం నేషనల్ అవార్డ్స్ రూల్స్, 2013 కింద నిర్వహించ బడింది. ఇది పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్, 1995 ప్రకారం 7 కేటగిరీల వైకల్యతలను అందించింది.అయితే, 2017 ఏప్రిల్ 19 నుంచి వికలాంగుల హక్కుల చట్టం, 2016 అమల్లోకి రావడంతో, కొత్త చట్టం కింద నిర్దిష్ట వైకల్యాల సంఖ్య 7 నుంచి 21కి పెరిగింది.

దీని ప్రకారం, 2018 ఆగస్టు 2 న భారత అసాధారణ గెజిట్ లో నోటిఫై చేయబడిన జాతీయ అవార్డు మార్గదర్శకాలలో మొత్తం 21 వైకల్యాలు చేర్చబడ్డాయి.

సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖ, వికలాంగుల సాధికారత విభాగం (దివ్యాంగులు) వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులకు నామినేషన్లు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులు ,కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలకు లేఖలు రాస్తుంది.

పురస్కారాలకు విస్తృత ప్రచారం ఇవ్వడానికి జాతీయ /ప్రాంతీయ భాషా దినపత్రికలలో ప్రకటనలు కూడా ఇస్తారు. జాతీయ అవార్డుల సమగ్ర పథకం వివరాలను, దరఖాస్తులు కోరుతూ జారీ చేసిన ప్రకటనను కూడా డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ (www.disabilityaffairs.gov.in) లో డౌన్ లోడ్ చేయదగిన ఫార్మెట్ లో డిస్ ప్లే చేస్తారు.

2021 , 2022 సంవత్సరాలకు మొత్తం 21 నిర్దిష్ట వైకల్యాలకు చెందిన వ్యక్తుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఒక ప్రకటన 2022 ఆగస్టు 19 న ప్రముఖ వార్తాపత్రికలలో ప్రచురించబడింది.

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (www.awards.gov.in) సెంట్రలైజ్డ్ పోర్టల్ లో మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 15 జూలై 2022 నుండి ఆగస్టు 28, 2022 వరకు తదుపరి 4-09-2022 వరకు పొడిగించారు. ప్రకటన కాపీని డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడంతోపాటుగా, విస్తృత ప్రచారం కల్పించడం కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాయడం జరిగింది.

2021 సంవత్సరానికి గాను 844, 2022 సంవత్సరానికి గాను 1210 దరఖాస్తులు వచ్చాయి. ఎంపిక ప్రక్రియ దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలు రికార్డుల పరిశీలన తో కూడుకొని ఉంది.

ఈ దరఖాస్తులను డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీలు స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేశాయి.

ఎంజి/డికె/ఆర్/కె/ఎంపిడబ్ల్యూ

 

*****


(Release ID: 1880591) Visitor Counter : 593