ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాశిలో కాశీ తమిళ సంగమం ప్రారంభోత్సవ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం.
Posted On:
19 NOV 2022 7:00PM by PIB Hyderabad
హర హర మహదేవ! వణక్కం, కాశీ! వణక్కం తమిళనాడు!
ఈ కార్యక్రమానికి హాజరైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగిఆదిత్యనాత్ జి, నా సహచర
మంత్రిమండలి సభ్యులు శ్రీధర్మేంద్ర ప్రధాన్ జీ, శ్రీ ఎల్.మురుగన్ జీ. కేంద్ర మాజీ మంత్రులు పొన్ రాధాకృష్ణన్ జీ, ప్రపంచ
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు , రాజ్యసభ సభ్యులు ఇళయరాజాజి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సుధీర్ జైన్ జి, ఐఐడి మద్రాస్ డైరక్టర్,
ప్రొఫెసర్ కామకోటి జి, ఇతర ప్రముఖులు, కాశీ, తమిళనాడుకు చెందిన గౌరవ అతిథులు, సోదర, సోదరీమణులారా,
పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో మిమ్మలందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నగరం కాశీ. మహదేవుని నగరం కాశీకి మీ అందరికీ, కాశీ తమిళ సంగమానికి స్వాగతం పలుకుతున్నాను.
సంగమాలకు ( ఒక చోట కలుసుకోవడం) మన దేశంలో ఎంతో గొప్ప విలువ ఉంది.ప్రతి సంగమాన్ని మనం ఎంతో గొప్ప ఉత్సవంగా జరుపుకుంటాం. అది నదుల సంగమం కావచ్చు, ఆలోచనల సంగమం కావచ్చు, జ్ఞాన సంగమం, విజ్ఞాన సంగమం, సామాజిక, సాంస్కృతిక సంగమం
ఇలా సంగమాలన్నింటినీ గొప్ప ఉత్సవంగా పరిగణిస్తాం.ఈ ఉత్సవాలన్నీ భారతదేశ వైవిధ్యతను, ప్రత్యేకతను
ప్రతిబింబిస్తాయి. అందువల్ల కాశీ –తమిళ సంగమం , దానికదే ఎంతో ప్రత్యేకమైనది.ఇవాళ ఒకవైపు మనకు మన సాంస్కృతిక రాజధాని కాశీ ఉంది. ఇది మొత్తం భారతదేశాన్ని ప్రతిబింబిస్తుంది. మరోవైపు మనకు తమిళనాడు, తమిళ సంస్కృతి ఉన్నాయి. ఇది భారతదేశ ప్రాచీనతకు, గొప్పదనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రెండిరటి సంగమం గంగ ,యమునలంత పవిత్రతను కలిగి ఉంటుంది. ఇందులో గంగాయమునలంత అవకాశాలు, సామర్ధ్యాలు ఇమిడి ఉన్నాయి.కాశీ ప్రజలు,తమిళనాడు ప్రజందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నెల రోజులపాటు జరిగే కాశీ `తమిళ సంగమ సమగ్ర కార్యకమ్రాన్ని సాకారం చేసిన దేశ విద్యామంత్రిత్వశాఖను, ఉత్తరపద్రేశ్ ప్రభుత్వాన్నికూడా అభినందిస్తున్నాను. బిహెచ్‌యు, ఐఐటి మద్రాస్ వంటి సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నాయి.మన రుషులు మనకు ఏకో అహం బహు స్యం అని చెప్పారు. ఇదే చైతన్యం బహురూపాలలో విస్తరించి ఉంది. ఇదే తత్వాన్ని మనం కాశీ, తమిళనాడులలో చూడవచ్చు. కాశీ, తమిళనాడు రెండూ కాలానికి అతీతమైన సాంస్కృతిక , నాగరికతా కేంద్రాలు. కాశీ లో బాబా విశ్వనాథుడు ఉంటే, తమిళనాడు రామేశ్వరాన్ని కలిగి ఉంది. కాశీ, తమిళనాడు రెండూ శివమయం, శక్తిమయమే. కాశీలో కాశీ ఉంటే, తమిళనాడులో దక్షిణ కాశీ ఉంది. రెండు వేటికవి ప్రాధాన్యత కలిగినవి. హిందుత్వంలోని సప్తపూరీలు కాశీ `కంచి రూపంలో ఉన్నాయి. మరోరకంగా చెప్పాలంటే, కాశీయాతన్రు వారు ప్రారంభించబోయే నూతన జీవితంతో ముడిపడినదిగా చూస్తారు.తమిళ ప్రజల హృదయాలలో కాశీకి గల అపారమైన ప్రేమకు ఇది నిదర్శనం. ఇది ఎన్నటికీ చెరిగిపోనిది.ఇది ఏక్ భారత్, శ్రేష్ఠ్‌భారత్ సంప్రదాయానికి అద్దం పడుతుంది. మన పూర్వీకులు ఈ విధానం ప్రకారమే జీవించారు. ఇవాళ కాశీ `తమిళ సంగమం మరోసారి ఈ అద్భుత సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నది.
మిత్రులారా,
కాశీ నిర్మాణంలో,అభివృద్దిలో తమిళనాడు అద్భుతమైన పాత్రపోషించింది. తమిళనాడులో జన్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ పూర్వపు ఉపకులపతి. వారి సేవలను బిహెచ్‌యు
ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ప్రముఖ వేదవిద్వాంసులు, తమిళనాడుకు చెందిన శ్రీరాజేశ్వర శాస్త్రి కాశీలో నివశించారు. వారు రామ్‌ఘాట్‌లో సంఫ్‌ువేద పాఠశాలను ఏర్పాటు చేశారు. అలాగే కాశీ ప్రజలు పట్టాభిరామశాస్త్రి గారిని ఎల్లప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటుంది. వారు హనుమాన్‌ఘాట్‌లో నివశించే వారు. మీరు కాశీని సందర్శిస్తే, మీరు హరిశ్చంద్రఘాట్‌లో కాశీ కామకోటీశ్వర పంచాయతన ఆలయాన్ని చూస్తారు. ఇది తమిళ ఆలయం. అలాగే అక్కడ 200 సంవత్సరాల నాటి కుమారస్వామి మఠం, కేదార్‌ఘాట్ లో మార్కండేయ ఆశ్రమం ఉన్నాయి. హనుమాన్‌ఘాట్, కేదార్‌ఘాట్‌ల చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో తమిళులు నివాసం ఉంటుంటారు. వీరంతా తరతరాలుగా కాశీ అభివృద్ధికి ఎంతో సేవ చేశారు. తమిళనాడుకు చెందిన మరో గొప్ప వ్యక్తి, తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి జి. వీరు గొప్పస్వాతంత్య్ర సమరయోధులు కూడా.వారు సుదీర్ఘకాలం కాశీలో నివసించారు. వారు ఇక్కడి మిషన్ కాలేజిలో, జై నారాయణ్‌కాలేజీలో చదువుకున్నారు.కాశీ వారి జీవితంలో ఒక భాగమైనంతగా వారికి కాశీతో అనుబంధం ఉంది. ఎంతోమంది ఇలాంటి ప్రముఖులు, సంప్రదాయాలు, విశ్వాసాలు కాశీతో, తమిళనాడుతో ముడిపడి ఉన్నాయి. ఇది జాతీయ సమైక్యతతో అనుసంధానమై ఉంది. ఇవాళ సుబ్రహ్మణ్య భారతి పేరుమీద ఒక పీఠాన్ని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది.
మిత్రులారా,
భారతదేశం స్వాతంత్ర అమృత్‌కాల్‌లో అడుగుపెట్టిన దశలో ఈ కాశీ`తమిళ సంగమం జరుగుతుండడం విశేషం. అమృత్ కాల్‌లో మనం చెప్పుకున్న సంకల్పాలను ఐక్యత, దేశం మొత్తం సమష్టి కృషి ద్వారా నెరవేర్చడం జరుగుతుంది. సహజసిద్ధమైన సాంస్కృతిక ఐక్యతతో వేల సంవత్సరాలుగా విలసిల్లుతున్న దేశం భారతదేశం. సం వో మనాంసి జానతామ్ ( ఒకరికొకరు ఆలోచనలను అర్థంచేసుకోవడం) మంత్రాన్ని గౌరవిస్తున్నదేశం.
మన దేశంలో 12 జ్యోతిర్లింగాలను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునే సంప్రదాయం ఉంది. సౌరాష్ట్రే సోమనాథం నుంచి సేతు బంధేతు రామేశ్వరం వరకు నిద్రలేవగానే చెప్పుకుంటాం. మనం నిద్రలేస్తూనే దేశ ఆథ్యాత్మిక ఐక్యతను గుర్తుచేసుకుంటాం. మనం స్నానం చేసేటపుడు, పూజాది కార్యక్రమాలప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాలు చెప్పుకుంటాం. అంటే గంగ, యమున, నుంచి గోదావరి, కావేరి వరకు సకల నదుల పవిత్రజాలలు మన జలంలో ఉన్నాయని భావిస్తాం. ఆ రకంగా మనం సకల పవిత్ర నదీజాలలో స్నానం చేసినట్టు భావిస్తాం.వేలాది సంవత్సరాలుగా వస్తున ఈ సంప్రదాయ పరంపరను మనం , సంస్కృతిని మనం బలోపేతం చేయాలి. స్వాతంత్య్రానంతరం దీనిని దేశ ఐక్యతా సూత్రంగా చేయాల్సి ఉండిరది. కానీ దురదృష్టవశాత్తు ఈ దిశగా పెద్దగా ప్రయత్నమేదీ జరగలేదు. ఈ సంకల్పానికి కాశీ `తమిళ సంగమం ఒక వేదిక కావాలి. ఇది మన బాధ్యతను మనం తెలుసుకునేట్టు చేయడమే కాదు, మన దేశ ఐక్యతను మరింత శక్తిమంతం చేస్తుంది.
మిత్రులారా, విష్ణుపురాణంలో ఒక శ్లోకం ఉంది. ఇది భారతదేశ రూపాన్ని వివరిస్తుంది. ఇది उत्तरं यत् समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम्। वर्षं तद् भारतं नाम भारती यत्र सन्ततिःఅంటే ఇండియా హిమాలయాలనుంచి హిందూ మహాసముద్రం వరకు అన్ని వైవిధ్యాలు, ప్రత్యేకతలతో కూడినదని అర్థం. ఈ తల్లి ప్రతి బిడ్డా భారతీయుడు. ఈ భారతీయ మూలాలను మనం అనుభవంలోకి తెచ్చుకున్నట్టయితే, ఉత్తర, దక్షిణాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ అవి ఎంత సన్నిహితమైనవో మనం గమనించగలుగుతాం. సంగం తమిళ సాహిత్యం ఎక్కడో వేల మైళ్ల దూరంలో ప్రవహిస్తూ ఉన్న గంగను ఎంతగానో కీర్తించింది. తమిళ గ్రంథం కళిత్తోకైలో వారణాశి ప్రజలను ఎంతగానో ప్రశంసించింది. మన పూర్వీకులు భగవంతుడైన మురుగన్‌ను , కాశీని తిరుప్పగల్ ద్వారా ఎంతగానో ఆరాధించారు. తెంకాశిని ఏర్పాటు చేశారు. ఇది దక్షిణకాశిగా ప్రశిద్ధి.
ఈ అనుబంధమే, భౌతిక దూరపు అడ్డంకులను,భాషను అధిగమించి స్వామి కుమారగురుపార తమిళనాడు నుంచి కాశీకి వచ్చి ఈ ప్రాంతాన్ని తన కార్యక్షేత్రంగా మలచుకున్నారు. ధర్మపురం అధీనానికి చెందిన స్వామి కుమారగురుపార కాశీలోని కేదారేశ్వర ఘాట్‌లో కేదారేశ్వర ఆలయాన్ని నిర్మించారు. అనంతరం ఆయన భక్తులు తంజావూరు జిల్లాలో కావేరీ నది ఒడ్డున కాశీ విశ్వనాథ ఆలయాన్ని నిర్మించారు. మనోన్మనియం సుందరనార్ జి తమిళనాడు రాష్ట్రగీతం తమిళ తాయి వల్తు రాశారు. వారి గురువు కొడవగనల్లుర్ సుందర స్వామిగళ్ జి ఎంతోకాలం, కాశీలోని మణికర్ణికాఘాట్ లో నివశించారు. మనోన్మనియం సుందరనార్‌జీ పై కాశీ ప్రభావం చాలా ఉంది. తమిళనాడులో జన్మించిన రామానుజాచార్య, వంటి మహా పురుషులు కాశీ నుంచి కాశ్మీర్ వరకు వేలాది మైళ్లు ప్రయాణించారు. ఇవాళ్టికి కూడా వారి విజ్ఞానాన్ని ఒక రుజువుగా పరిగణిస్తారు.
ఇవాల్టికి కూడా దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు దేశంమొత్తం సి.రాజగోపాలాచారి గారు రాసిన రామాయణం, మహాభారతం నుంచి ప్రేరణ పొందుతారు. నాకు విద్య నేర్పిన గురువులలో ఒకరు అంటుండేవారు, మీరు రామాయణం, మహాభారతం చదివి ఉంటారు.కానీ మీరు ఆవటిని లోతుగా అవగాహన చేసుకోవాలంటే రాజాజీ రాసిన రామాయణ , మహాభారతాలను చదవాలని చెప్పేవారు. దక్షిణాదిన శ్రీరామానుజాచార్య, శ్రీఆది శంకరాచార్య,నుంచి రాజాజీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వరకు ప్రముఖుల భరతీయ తాత్వికతను అర్థంచేసుకోకుండా భారతదేశాన్ని మనం అర్థం చేసుకోలేము.మనం అర్థం చేసుకోవలసిన గొప్ప వ్యక్తులు వీరు.
మిత్రులారా,
ఇవాళ ఇండియా పంచ ప్రాణ్ (ఐదు ప్రతిజ్ఞల) ద్వారా,మన వారసత్వంలోని గొప్పదనాన్ని ముందుకు తీసుకెళుతున్నది. ప్రపంచంలోని ఏదేశానికైనా ప్రాచీన వారసత్వం ఉన్నదంటే , ఆదేశం దానిని గర్వంగా భావిస్తుంది. దానిని సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలను మనం గమనించవచ్చు.ఈజిప్టులోని పిరమిడ్లనుంచి ఇటలీలోని కొలోసియంల, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా వరకు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష తమిళం మనకు ఉంది. ఈ భాష ఎంతో పాపులర్. ప్రంపంచంలోని ప్రాచీన భాష ఇండియాలో ఉందని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు.కానీ మనం దీనిని గొప్పగా చెప్పుకోవడంలో వెనకబడుతున్నాం. ఈ తమిళ వారసత్వాన్ని కాపాడాల్సిసన బాధ్యత ,దానిని మరింత పరిపుష్టం చేయాల్సిన బాధ్యత 130 కోట్లమంది ప్రజలపై ఉంది. మనం తమిళాన్ని మరిచిపోతే మనం దేశానికి ఏమీ చేయనట్టేనని అన్నారు. తమిళ ఆంక్షల మధ్య ఉండేలా చేస్తే, మనం దేశానికి తీవ్ర అన్యాయం చేసినవాళ్లం అవుతాం. అందువల్ల మనం భాషపరమైన విభేదాలను పక్కన పెట్టే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలన్నారు. భాష పరమైన విభేదాలను తొలగించి ఐక్యతను నెలకొల్పాలన్నారు.
కాశీ తమిళ సంగమం మాటలకన్న ఒక అనుభవానికి సంబంధించినది. కాశీయాత్ర సందర్భంగా మీరు మీ జీవితంలో ఎన్నటికీ గుర్తుండిపోయే అనుభూతులను జ్ఞాపకాలను సొంతం చేసుకుంటారు.
కాశీ ప్రజలు మీకు ఆతిథ్యం ఇవ్వడంలో తమకు దొరికిన ఏ అవకాశాన్నీ విడిచిపెట్టరు. ఇలాంటి వాటిని తమిళనాడులో అలాగే దక్షిణాది రాష్ట్రాలలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి. దీనివల్ల వారు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి భారతదేశాన్ని దర్శించి తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ కాశీ –తమిళ సంగమం నుంచి వచ్చిన మంచి ఫలితాలను మరింత ముందుకు తీసుకుపోవడంతోపాటు , ఈ విషయమైయువత కోసం మరింత పరిశోధన చేయాలి. ఈ సమావేశం నుంచి మొలకెత్తిన విత్తనాలు జాతీయ ఐక్యత అనే మహా వట వృక్షంకాగలవు నట్టు నల్నే నమ్డు నాలన్ (జాతీయ ప్రయోజనాలే మన ప్రయోజనాలు) అనేది మన దేశ ప్రజల జీవన మంత్రం కావాలి. ఈ స్ఫూర్తితో నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాన.
భారత్ మాతా కీ జై
భారత్ మాతా కీ జై
భారత్ మాతాకీ జై
ధన్యవాద్
వణక్కం.
***
(Release ID: 1880449)
Visitor Counter : 150
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam