నీతి ఆయోగ్
కమ్యూనిటీ ఇన్నొవేటర్ ఫెలోషిప్ కోసం తాజా దరఖాస్తులను ప్రారంభించిన అటల్ ఇన్నొవేషన్ మిషన్
Posted On:
01 DEC 2022 3:16PM by PIB Hyderabad
వ్యవస్థాపకత ప్రయాణంలో అత్యవసరమైన ఔత్సాహిక ఆవిష్కర్తలకు మౌలికసదుపాయాల తోడ్పాటును, విజ్ఞాన నిర్మాణాన్ని సులభతరం చేసేందుకు యుఎన్‌డిపి ఇండియాతో సహకారంతో అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతీ అయోగ్ చేపట్టిన చొరవ అయిన కమ్యూనిటీ ఇన్నొవేటర్ ఫెలోషిప్ (సిఐఎఫ్)కు 01 డిసెంబర్ 2022న దరఖాస్తులను నీతీ అయోగ్‌కు చెందిన అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం) మంగళవారం ప్రారంభించింది. ఎఐఎం కార్యక్రమమైన అటల్ కమ్యూనిటీ ఇన్నొవేషన్ సెంటర్ (ఎసిఐసి)లో ప్రస్తుతం 22మంది కమ్యూనిటీ ఇన్నొవేటర్ ఫెలోస్‌కు శిక్షణ, సహాయసహకారాలను అందిస్తున్నారు.
తమ వ్యాపారం ద్వారా సామాజిక సవాళ్ళను పరిష్కరించాలన్న భావన కలిగిన వ్యవస్థాపక ఆలోచనా ధోరణి ఉన్న వ్యక్తే కమ్యూనిటీ ఇన్నొవేటర్ ఫెలో. వీరి ప్రయాణాన్ని 5 దశలుగా రూపొందించారు, దరఖాస్తుదారులు https://aim.gov.in/acic-fellowship.php అన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.
సూక్ష్మ స్థాయిలో స్టార్టప్ విప్లవం భారతదేశంలోని 2 టైర్, 3 టైర్ నగరాలకు చేరుకోవడమే కాక ఈ ప్రాంతాలలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరిచిందని ఈ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ ఎఐఎం మిషన్ డైరక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఆర్థిక సేవలు వంటి సమస్యలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడం అన్న లక్ష్యంతో ఆవిష్కర్తలను సాధికారం చేయడం అటల్ ఇన్నొవేషన్ మిషన్‌కు కీలకమైన చోదక శక్తిగా ఉంది. వ్యూహాత్మక ప్రాంతాలలో అటల్ కమ్యూనిటీ ఇన్నొవేషన్ కేంద్రాలు క్షేత్రస్థాయి ఆవిష్కర్తలు తమ పూర్తి స్థాయి వృత్తి ఎంపికగా వ్యవస్థాపకతను కొనసాగించే పరివర్తన ప్రయాణానికి సాక్షిగా ఉన్నాయి. ఫెలోషిప్‌లకు దరఖాస్తులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో సమాజంలో మార్పును సృష్టించ ప్రయాణాన్ని అనుభూతించవలసిందిగా దరఖాస్తుదారులకు పిలుపిస్తున్నాను అని ఆయన అన్నారు.
ఇఇద ఒక సంవత్సరపాటు కొనసాగే లోతైన ఫెలోషిప్ కార్యక్రమం. ఇందులో ఔత్సాహిక సమాజ ఆవిష్కర్తలు తమ సామాజిక- ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ విజ్ఞానం, మార్గదర్శకత్వం, సమాజంతో మమేకం కావడం, కలిసిపోవడం వంటివన్నీ కూడా తగినంత మౌలికసదుపాయాలు, నిధులు సమకూర్చడం ద్వారా అనుకూలమైన వాతారణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఫెలోషిప్ కాలంలో, ప్రతి ఫెలోని అటల్ కమ్యూనిటీ ఇన్నొవేషన్ సెంటర్‌లో ఆతిథ్యం స్వీకరిస్తూ, తమ భావనలపై పని చేస్తున్న సమయంలోనే ఎస్‌డిజి చైతన్యాన్ని, వ్యవస్థాపక నైపుణ్యాలు, జీవిత నైపుణ్యాలను పొందుతారు.
దేశవ్యాప్తంగా అటల్ కమ్యూనిటీ ఇన్నొవేషన్ సెంటర్ల (ఎసిఐసి)ను ఎఐఎం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం 9 రాష్ట్రాలలో 14 అటువంటి కేంద్రాలు ఉండగా, సమీప భవిష్యత్తులో 36 నూతనంగా రానున్నాయి, తద్వారా ఎసిఐసిల సమిష్టి సంఖ్య 50కి చేరుకుంటుంది.
ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు లింక్ -
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd8v1_D8DntoHPr9rSL1rBSeBCF2cUKgt4k-h4AiOVGV6BFBA/viewform
సిఐఎఫ్ గురించి తెలుసుకునేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి -
https://aim.gov.in/acic-fellowship-program-structure.php
***
(Release ID: 1880443)
Visitor Counter : 190