పర్యటక మంత్రిత్వ శాఖ

స్థిరమైన, బాధ్యతాయుతమైన పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధిపై ప్రాంతీయ వర్క్‌షాప్‌ ను నిర్వహించిన - కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 30 NOV 2022 12:30PM by PIB Hyderabad

కీలక ముఖ్యాంశాలు: 


*     ఈ వర్క్‌షాప్‌ లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, డామన్-డయ్యూ, గోవా వంటి మధ్య, పశ్చిమ ప్రాంతానికి చెందిన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పర్యాటక పరిశ్రమకు చెందిన భాగస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


*     ఈ వర్క్‌షాప్‌లో  పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన "ట్రావెల్ ఫర్ లైఫ్" ప్రచారాన్ని కూడా  పరిచయం చేశారు.


సుస్థిరమైన, బాధ్యతాయుతమైన పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి, దేశంలో స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ  ఐ.ఐ.టి.టి.ఎం., యు.ఎన్.ఈ.పి., ఆర్.టి.ఎస్.ఓ.ఐ. ల సహకారం తో ఖజురహో లో 2022 నవంబర్, 29వ తేదీన సుస్థిరమైన, బాధ్యతాయుతమైన పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధిపై మొదటి ప్రాంతీయ వర్క్‌షాప్‌ ను నిర్వహించింది.  ఈ వర్క్‌షాప్‌ లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, డామన్-డయ్యూ, గోవా వంటి మధ్య, పశ్చిమ ప్రాంతానికి చెందిన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పర్యాటక పరిశ్రమకు చెందిన భాగస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ ప్రశాంత్ రంజన్, ఈ సదస్సులో కీలకోపన్యాసం చేశారు.  పర్యాటక రంగంలో సుస్థిరత తో పాటు, లక్ష్యాన్ని సాధించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, పరిశ్రమల సహకారం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా వివరించారు.  పర్యావరణ సుస్థిరత కోసం ప్రధానమంత్రి దార్శనికత గురించి కూడా ఆయన తెలియజేశారు.  "లైఫ్ మిషన్‌" తో పర్యాటకాన్ని ఎలా అనుసంధానం చేయవచ్చో కూడా ఆయన నొక్కి చెప్పారు.  పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన "ట్రావెల్-ఫర్-లైఫ్" ప్రచారం గురించి ఆయన వివరించారు. 


కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఉత్తాంక్ జోషి మాట్లాడుతూ, దేశంలో పర్యాటక మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేసిన కేంద్ర ప్రాయోజిత పథకం స్వదేశ్ దర్శన్ 1.0 విజయ గాధలు తెలియజేశారు.  స్వదేశ్ దర్శన్ 2.0 గురించి పూర్తి సమాచారంతో పాటు, గమ్యం అభివృద్ధి లో సుస్థిరతను అది ఎలా సమీకృతం చేస్తుందనే విషయాన్ని కూడా ఆయన వివరించారు. 


ప్రముఖ పర్యావరణ-పర్యాటక రంగ నిపుణులు, ఆర్.టి.ఎస్.ఓ.ఐ. ప్రతినిధి శ్రీ అనిరుధ్ చావోజీ ఈ సదస్సులో ప్రసంగిస్తూ, పర్యాటకులకు అవగాహన కల్పించడంతో పాటు, బాధ్యతాయుతమైన ప్రయాణానికి డిమాండ్‌ ను సృష్టించడం గురించి చర్చించారు.


వాతావరణ మార్పు పై జరిగిన సి.ఓ.పి-26 లో భాగంగా 2021 నవంబర్ లో ప్రారంభించిన "గ్లోబల్ టూరిజం ప్లాస్టిక్స్ ఇనిషియేటివ్" తో పాటు, పర్యాటకం లో వాతావరణ ప్రభావం పై గ్లాస్గో తీర్మానం వంటి కొన్ని ప్రతిష్టాత్మక ప్రయత్నాల గురించి, శ్రీమతి మనీషా చౌదరి వివరించారు.   స్థిరమైన అభివృద్ధి కోసం జాతీయ, ప్రపంచ కట్టుబాట్లకు అనుగుణంగా వాతావరణ మార్పు, కాలుష్యం, జీవ వైవిధ్య నష్టం వంటి మూడు సంక్షోభాలను పరిష్కరించడం తో పాటు, లక్ష్యాలను నిర్దేశించుకోడానికి అటువంటి కార్యక్రమాలలో చేరాలని ఆమె భాగస్వాములను ప్రోత్సహించారు. 


సుస్థిర పర్యాటకంలో భాగంగా వారు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతుల గురించి, మధ్య, పశ్చిమ ప్రాంతాల రాష్ట్ర పర్యాటక శాఖల ప్రతినిధులు వివరించారు. 


ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు "సస్టైనబుల్ టూరిజం క్రైటీరియా ఫర్ ఇండియా - ఎస్.టి.సి.ఐ." ముఖ్య లక్షణాల గురించి, సుస్థిర పర్యాటకం కోసం సెంట్రల్ నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తున్న, "ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్" సంస్థ వివరించింది.  బాధ్యతాయుతంగా ప్రయాణించడానికి కట్టుబడి ఉంటామని, ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు, "ట్రావెల్ ఫర్ లైఫ్ - ప్రతిజ్ఞ" చేశారు.  


మధ్య, పశ్చిమ ప్రాంతాలలోని వివిధ ప్రదేశాల్లో, స్పష్టమైన సానుకూల ప్రభావాన్ని సృష్టించి, స్థిరమైన పర్యాటకాన్ని అమలు చేయడానికి, క్షేత్ర స్థాయి పరిశ్రమ భాగస్వాములు కూడా తమ వినూత్న మార్గాలను అందించారు.


ఈ వర్క్‌షాప్ సుస్థిరత లక్ష్యాలను సాధించే దిశగా పర్యాటక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిట ప్రాంతాల పరిపాలనా విభాగాలు, పరిశ్రమల భాగస్వాముల మధ్య సంబంధాలను బలోపేతం చేసింది.


*****



(Release ID: 1880176) Visitor Counter : 130