వ్యవసాయ మంత్రిత్వ శాఖ

హార్టీకల్చర్‌ క్లస్టర్‌ అభివృద్ధి కార్యక్రమంతో రైతులకు ప్రయోజనం :కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్‌ తోమర్‌ ఏ పథకానికైనా రైతుప్రయోజనాలే ముఖ్యం : `శ్రీ నరేంద్రసింగ్‌ తోమర్‌

Posted On: 30 NOV 2022 4:23PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ హార్టీకల్చర్‌ క్లస్టర్‌ డవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (సిడిపి)ను రూపొందించింది. ఈ కార్యక్రమం సరిగా అమలు జరిగేలా చూసేందుకు కేంద్ర వ్యవసాయం ,రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్‌ చౌదరి వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రధాన లక్ష్యం వ్యవసాయ రంగాన్ని ప్రమోట్‌ చేయడం, రైతుల రాబడిని పెంచడమేనని అన్నారు. రైతులకు వారు పండిరచిన పంటకు సహేతుక ధర వచ్చేట్టు చేయడం, తమ లక్ష్యమని అన్నారు. అందువల్ల ప్రభుత్వం తీసుకువచ్చే ఏ కార్యక్రమం, పథకం పరమోన్నత లక్ష్యం రైతుల ప్రయోజనాలను కాపాడడమేనని ఆయన అన్నారు.

 

క్లస్టర్‌ డవలప్‌మెంట్‌ ప్రోగ్రాం అమలు ద్వారా దేశంలో హార్టీకల్చర్‌ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు ప్రయోజనం పొందేట్టుచూడనున్నామన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, పశ్చిమబెంగాల్‌, మణిపూర్‌, మిజోరం, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాలను ఎంపికచేసిన 55 క్లస్టర్ల జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. ప్రధానంగా ఆయా పంటల ఆధారంగా వీటిపై దృష్టిపెట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమం అమలు కోసం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చి (ఐసిఎఆర్‌) , దాని అనుబంధ సంస్థల వద్ద అందుబాటులో ఉన్న భూమిని వినియోగించుకోవడం జరుగుతుందని అన్నారు. పంటల వైవిద్యీకరణ గురించి కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఉత్పత్తి అయిన సరకుకు మార్కెట్‌ కల్పించడం, సామర్ధ్యాల నిర్మాణం వంటి వాటిని ఈ కార్యక్రమంతో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.

వ్యవసాయ శాఖ సహాయమంత్రి శ్రీ చౌదరి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కింద మౌలిక సదుపాయాల జియోటాగింగ్‌ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనివల్ల చిన్నరైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పంట పొలాలలో చేపట్టే వివిధ కార్యకలాపాల ట్రాకింగ్‌, పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందన్నారు. క్లస్టర్‌ డవలప్‌మెంట్‌ ప్రోగ్రాం దేశంలోని మొత్తం హార్టీకల్చర్‌ రంగం పరిస్థితులను పరివర్తనచెందించే శక్తి కలిగి ఉందని ఈ సందర్బంగా తెలిపారు. మల్టీమోడల్‌ట్రాన్స్‌పోర్ట్‌  ను ఉపయోగించి చిట్టచివరి ప్రాంతానికి కూడా సేవలు అందేట్టు చూడడానికి, సకాలంలో సమర్ధవంతంగా హార్టీకల్చర్‌ ఉత్పత్తుల తరలింపు, రవాణాకు ఇది అవకాశం కల్పిస్తుందని అన్నారు.

సిడిపి, ఆయా క్లస్టర్‌లకు ప్రత్యేకమైననే బ్రాండ్‌లను రూపొందిస్తుందని, ఇది ఆర్థికరంగానికి చేయూతనివ్వడమే కాక, వీటిని జాతీయ అంతర్జాతీయ వాల్యూచెయిన్‌తో అనుసంధానం చేస్తుందని అన్నారు.దీనిద్వారా రైతులకు పెద్ద మొత్తంలో రాబడి వస్తుందన్నారు. సిడిపి 10 లక్షల మంది రైతులకు, సంబంధిత స్టేక్‌ హోల్డర్లకు  ప్రయోజనం కలిగించనుంది. సిడిపి లక్షిత పంటలకు 20 శాతం వరకు ఎగుమతులు మెరుగుపరిచే లక్ష్యంతో ఉంది. ఇది క్లస్టర్‌ ప్రత్యేక బ్రాండ్‌లను రూపొందించడంతోపాటు, క్లస్టర్‌ పంటలను పోటీకి నిలబెట్టనుంది. సిడిపి ద్వారా పెద్దఎత్తున హార్టీకల్చర్‌ రంగంలో పెట్టుబడులు తరలి రానున్నాయి.

ఈ సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ నరేంద్రసింగ్‌ తోమర్‌ క్లస్టర్‌ వారీగా 12బ్రోచర్లను విడుదల చేశారు. ఇందులో వివిధ ప్రభుత్వ పథకాల కింద ఆయా పంటలకు ఆర్థిక సహాయం పొందేందుకు అవకాశం ంటి వాటిని పేర్కొన్నారు. ప్రధానంగా దృష్టిపెడుతున్న పంటలు, ఎగుమతులకు అవకాశాలు, విలువజోడిరపు వంటి వాటి గురించిన సమాచారం కూడా ఇందులో పేర్కొన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్‌ అహుజ, సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రియరంజన్‌ , హార్టీకల్చర్‌ కమిషనర్‌ శ్రీ ప్రభాత్‌ కుమార్‌, వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన పలువురు అధికారులు, నేషనల్‌ హార్టీకల్చర్‌ బోర్డ్‌ (ఎన్‌హెచ్‌బి)కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 (Release ID: 1880165) Visitor Counter : 182