వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పాఠ్యప్రణాళికలో భారతీయ ప్రమాణాలను ప్రవేశపెట్టేందుకు దేశంలోని ఆరు అగ్ర ఇంజినీరింగ్ సంస్థలతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్న బిఐఎస్
ఈ సంస్థలలో బిఐఎస్ స్టాండర్డైజేషన్ చైర్ ప్రొఫెసర్ ఏర్పాటు
प्रविष्टि तिथि:
30 NOV 2022 1:27PM by PIB Hyderabad
తమ పాఠ్యప్రణాళికలో భారతీయ ప్రమాణాలను పొందుపరిచేందుకు భారతదేశానికి చెందిన ఆరు అగ్ర ఇంజినీరింగ్ విద్యా సంస్థలతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్- భారతీయ ప్రమాణాల విభాగం) అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది. విద్యారంగంలో చురుకైన భాగస్వామ్యాన్ని పొందేందుకై ప్రముఖ సంస్థలతో బిఐఎస్ పరస్పర చర్యలను సంస్థాగతం చేసే దిశగా చేపట్టిన చొరవ ఇది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిహెచ్‌యు, మాలవియా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచ్చిలలో బిఐఎస్ స్టాండర్డైజేషన్ చైర్ ప్రొఫెసర్‌ను ఏర్పాటు చేసేందుకు 28 నవంబర్ 2022న ఈ అవగాహనా ఒప్పందాన్ని కుదర్చుకుంది.
ఈ ఏర్పాటు ఆయా సంస్థలలో సైన్స్ క్షేత్రం, వివిధ శాస్త్రాలలో బోధన, పరిశోధన & అభివృద్ధిలో నైపుణ్యాన్ని, నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
***
(रिलीज़ आईडी: 1880001)
आगंतुक पटल : 222