బొగ్గు మంత్రిత్వ శాఖ
ముంబైలో పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించనున్న బొగ్గు మంత్రిత్వ శాఖ
వాణిజ్య గనుల వేలంలో పాల్గొనేలా మరింత మందిని ఆకర్షించడం లక్ష్యం
Posted On:
29 NOV 2022 11:44AM by PIB Hyderabad
తొలి ఐదు దశలలో 64 బొగ్గు గనులను విజయవంతంగా వేలం వేసిన బొగ్గు మంత్రిత్వ శాఖ 133 బొగ్గు గనులను ఆరవ విడత వాణిజ్య వేలానికి ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో 71 బొగ్గు గనులు కొత్త బొగ్గు గనులు కాగా, 62 బొగ్గు గనులు నవంబర్ 2022లో నిర్వహించిన వాణిజ్య వేలాలలో మిగిలి ఇందులో కలిసినవి. అదనంగా వాణిజ్య వేలాల ఐదవ రౌండ్ తాలూకు రెండవ ప్రయత్నం కింద ఎనిమిది బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించగా తొలి ప్రయత్నంలో కేవలం సింగిల్ బిడ్లు మాత్రమే వచ్చాయి.
వాణిజ్య వేలాల్లో, సాంకేతిక లేక ఆర్ధికద అర్హతలు లేవు, అయితే గతంలో బొగ్గు గని తవ్వకాలు జరపని వారు విజయవంతమైన బిడ్డర్లు కాగా, వారికి బొగ్గు గనులను కేటాయించడం జరిగింది. బొగ్గు గనుల వాణిజ్య వేలంలో బిడ్డర్లు భాగస్వామ్యాన్ని బలోపేతం చేసందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ ముంబైలో 01 డిసెంబర్ 2022న పెట్టుబడిదారు సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తుండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక అతిథిగా పాల్గొంటుండగా, బొగ్గు, గనులు, రైల్వల సహాయ మంత్రి శ్రీ రావ్‌సాహెబ్ పాటిల్ దాన్వే, మహారాష్ట్ర మైనింగ్ మంత్రి శ్రీ దాదజీ భూసే ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొంటారు. బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యరద్శి శ్రీ అమృత్ లాల్ మీనా, గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ కూడా ఈ సదస్సులో పాల్గొంటారు.
వివరణాత్మక చర్చల అనంతరం గనుల జాబితాను ఖరారు చేశారు. రక్షిత ప్రాంతాలు, వన్యప్రాణుల అభయారణ్యం, 40%కి పైగా అడవులు కలిగిన కీలకమైన ఆవాసాలు, భారీ నిర్మాణాలు గల ప్రాంతాలు తదితరాలలో ఉండే గనులను మినహాయించారు. కొన్ని బొగ్గు గనులకు దట్టమైన ఆవాసాలు, ఎక్కువ పచ్చదనం, కీలక మౌలిక సదుపాయాలు తదితరాల వంటి సరిహద్దులలో గనుల పట్ల బిడ్డర్లలో ఆసక్తి పెంచి, వారు వేలంలో పాల్గొనేందుకు సంప్రదింపుల సమయంలో భాగస్వాముల నుంచి వచ్చిన సలహాల ఆధారంగా సవరించారు.
ఈ వేలం ప్రక్రియలో ముందస్తుగా చెల్లించవవలసిన మొత్తం, బిడ్ సెక్యూరిటీ మొత్తం తగ్గింపు, ఒకవేళ పాక్షికంగా తవ్విన బొగ్గు గని అయితే గనిలోని ఆ భాగాన్ని త్యజించేందుకు అనుమతి, జాతీయ బొగ్గు సూచీ, జాతీయ లిగ్నైట్ సూచీ పరిచయం, ప్రవేశంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సులభంగా పాలుపంచుకోవడం, బొగ్గు వినియోగంలో పూర్తి సరళత, అనుకూలమైన చెల్లింపు వ్యవస్థలు, త్వరితగతిన ఉత్పత్తిని ప్రారంభించేందుకు, పర్యావరణకు అనుకూలమైన బొగ్గు సాంకేతికతను వినియోగించేందుకు ప్రోత్సాహకాల ద్వారా సామర్ధ్యాల ప్రోత్సాహం వంటివి ఇందులో ఉన్నాయి.
టెండర్ పత్రాల అమ్మకాలు 03 నవంబర్, 2022న ప్రారంభమైంది. గనులు, వేలం నిబంధనలు, కాలక్రమాలు తదితరాల వివరాలను ఎంఎస్‌టిసి వేలం వేదికలో అందుబాటులో ఉంటాయి. ఈ వేలాన్ని పారదర్శకమైన రెండు దశల ప్రక్రియ ద్వారా ఆదాయ వాటాను శాతాల ఆధారంగా నిర్వహిస్తారు.
వాణిజ్య బొగ్గు గనుల వేలానికి బొగ్గు మంత్రిత్వ శాఖకు ఏకైక లావాదేవీల సలహాదారు అయిన ఎస్‌బిఐ కాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ ఈ వేలాన్ని నిర్వహించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖకు తోడ్పాటునందిస్తోంది.
****
(Release ID: 1879796)
Visitor Counter : 159