సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 5

జై భీం ఒక పదం కాదు భావోద్వేగం : దర్శకుడు జ్ఞానవేల్


'విద్య ద్వారా అణగారిన వర్గాలు సాధికారత సాధించినప్పుడు మాత్రమే సినిమా లక్ష్యం నెరవేరుతుంది'..జ్ఞానవేల్

53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తదుపరి భాగాలు నిర్మాణంలో ఉన్నాయి .. సహా నిర్మాత రాజశేఖర్ కె.

  చలన చిత్రం ద్వారా కాకుండా ప్రదర్శించిన  భావోద్వేగాన్ని చూసి చలించి  ప్రేరణ పొందడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?. ఇలా జరిగిందంటే మీకు నమ్మకం కలగడం లేదా? అయితే, మీరు ఈసారి మీరు దీనిని నమ్మాలి. 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొంటున్న ప్రతినిధులు సినిమా ద్వారా కాకుండా భావోద్వేగంతో ప్రేరణ పొందే ప్రత్యేకమైన అవకాశాన్ని పొందారు.  అత్యంత సాహసోపేత  దర్శకుడిగా గుర్తింపు పొందిన జ్ఞానవేల్ మాటల్లో చెప్పాలంటే 'జై భీమ్' అనేది ఒక పదం కాదు. ఒక భావోద్వేగం. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా  'జై భీం'  53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొంటున్న జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల మన్ననలు పొందింది. 

.53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా పిఐబి నిర్వహించిన సైడ్ టాక్స్ కార్యక్రమంలో   'జై భీం' చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా మీడియా, చిత్రోత్సవానికి హాజరైన ప్రతినిధులతో  జ్ఞానవేల్ మాట్లాడారు.చిత్రానికి  'జై భీం' అని పేరు పెట్టడం వెనుక ఉన్న కారణాలను  జ్ఞానవేల్ వివరించారు. ' నా దృష్టిలో  'జై భీం' ఒక పదం కాదు.  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడూ అండగా నిలబడిన  అణగారిన మరియు అట్టడుగున ఉన్న ప్రజలకు  పర్యాయపదం.' అని జ్ఞానవేల్ వివరించారు. 

 'జై భీం' చిత్రానికి అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులు ఊహించని విధంగా ఆదరించడం పట్ల జ్ఞానవేల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అన్ని  ప్రాంతాల్లో ఒకే విధంగా ఉన్న అంశం  కథాంశంగా ఉండడంతో  'జై భీం' అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకుల మన్ననలు పొందిందని అన్నారు. '  'జై భీం' చిత్రాన్ని నిర్మించక ముందు నేను కుల వివక్షకు సంబంధించి అనే కథలు విన్నాను. చట్టంలో ఉన్న లోపాలు, న్యాయ వ్యవస్థ దీనికి కారణం' అని వ్యాఖ్యానించిన జ్ఞానవేల్ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి రాజ్యాంగం ఒక పదునైన ఆయుధంగా ఉంటుంది అని  చిత్రం ద్వారా చెప్పామని  అన్నారు. 

 

 

'జై భీమ్' సినిమా వాస్తవ సంఘటనలు, రగులుతున్న సమస్యలు ఆధారంగా రూపొందింది. గిరిజన జంట రాజకన్ను మరియు సెంగెని జీవితం మరియు పోరాటాలను చిత్రీకరిస్తుంది,  అగ్రవర్ణాల ప్రజల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఇచ్చే  చిన్న చిన్న పనులు చేస్తూ  రాజకన్ను, సెంగెని జీవిస్తూ ఉంటారు.   చేయని నేరానికి  రాజకన్ను అరెస్టయ్యాక సినిమా మలుపు తిరుగుతుంది. అప్పటి నుండి  ధిక్కార స్వరం వినిపిస్తూ  అద్భుతమైన క్షణాలతో, అధికారంలో ఉన్నవారు నిరుపేదలకు చేస్తున్న అన్యాయం, అధికార  దుర్వినియోగం, పేదలకు ఎదురయ్యే  అవమానాలను శక్తివంతంగా సంగ్రహిస్తుంది.

సినిమా ద్వారా సమాజంలో పరివర్తన ఎలా తీసుకు రావచ్చు అన్న అంశాన్ని జ్ఞానవేల్ వివరించారు. విద్య ఒక్కటే సాధనమని మహా పండితుడు బీఆర్ అంబేద్కర్  ఆలోచన ఆధారంగా అణగారిన వర్గాల హక్కుల  కోసం పోరాడే వ్యక్తి పాత్ర ద్వారా  తన సినిమా సందేశాన్ని ఇచ్చిందని  జ్ఞానవేల్ అన్నారు. విద్యకి  ప్రజలను శక్తివంతంగా రూపొందించగల బలం ఉంటుంది అని అన్నారు.  . “నిజ జీవితంలో హీరోలు ఉండరు. విద్య ద్వారా తమను తాము శక్తివంతం చేసుకోవడం ద్వారా ఎవరికి వారు  హీరోలుగా మారాలి.  అణగారిన వారందరికీ సాధికారత లభించినప్పుడే నా సినిమా అసలు లక్ష్యం నెరవేరుతుంది.' అని జ్ఞానవేల్ పేర్కొన్నారు. 

జస్టిస్ కె చంద్రు న్యాయవాది గా పనిచేసిన సమయంలో ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. న్యాయవాది పాత్రలో   ప్రముఖ నటుడు సూర్య నటించారు. 

తన సినిమాలో కథ హీరో పాత్ర పోషించిందని జ్ఞానవేల్ తెలిపారు. కథలో తగిన సారాంశం ఉంటే దానిని గ్రహించి ఎవరికి వారు సరైన రీతిలో స్పందిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.

జర్నలిస్టుగా, రచయితగా పనిచేసిన  జ్ఞానవేల్ ఏళ్ల తరబడి అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్నారని చిత్ర సహనిర్మాత రాజశేఖర్ కె అన్నారు.  జ్ఞానవేల్‌కు ఆదర్శంగా తీసుకుని నటుడు సూర్య అగరం ఫౌండేషన్‌పేరిట ఒక  ఎన్‌జిఓ నెలకొల్పారని వివరించారు."సినిమాను నిర్మించడానికి సూర్యను సంప్రదించాను.  కానీ  కథ విన్న తర్వాత ఆశ్చర్యం కలిగించే విధంగా సూర్య  చిత్రంలో నటిస్తాను అని చెప్పారు " అని రాజశేఖర్ తెలిపారు. 

ఈ చిత్రంలో   ఇరులా తెగకు చెందిన వ్యక్తులు కూడా నటించారు. నటీనటులను ఎంపిక చేయడానికి చేసిన కృషిని రాజశేఖర్ వివరించారు.   రాజాకన్ను గా నటించిన నటులు మణికందన్ మరియు సెంగెనిగా నటించిన లిజోమోల్ జోస్ 45 రోజుల పాటు గిరిజన ప్రజలతో కలిసి జీవించి  వారి జీవన శైలి గురించి తెలుసుకున్నారని తెలిపారు. 

ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ పట్ల హర్షం వ్యక్తం చేసిన రాజశేఖర్ చిత్రం తదుపరి భాగం ఉంటుందని దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. 

 

 

 మలయాళంలో సినిమా నటుడు లిజోమోల్ జోస్ మాట్లాడుతూ  తమిళం మాట్లాడే ఇరులా పాత్రలో నటించడం నిజమైన సవాలు అని అన్నారు. "నా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో గిరిజన ప్రజలతో కలిసి జీవించడం కీలకం" అని లిజోమోల్ జోస్ అన్నారు. 

నటుడు మణికందన్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించే అవకాశం తనకు అనుకోకుండా లభించిందని అన్నారు. చిత్రం తనను తాను మార్చుకోవడానికి సహాయపడింది అని  అన్నారు.  “ప్రపంచంలో తమకు ప్రతిదీ ఉందని భావించే వ్యక్తులతో  నేను కలిసి జీవించాను,. వారిలో అనైతికంగా ప్రతి దానిని పొందాలన్న ఆలోచన కనిపించలేదు' అని మణికందన్ అన్నారు. దీనివల్ల తన అంతర్గత భావాలు మారాయని అన్నారు. 

  53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో   'జై భీం' చిత్రాన్ని ప్రదర్శించారు. 

 

    

 

  దర్శకుడు జ్ఞానవేల్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు.  తమిళ చలనచిత్ర పరిశ్రమలో రచయితగా గుర్తింపు పొందారు.  జై భీమ్ చిత్రం ద్వారా ఆయన అందరి దృష్టి ఆకర్షించారు.  ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం  కూతతిల్ ఒరుతన్  (2017).

చిత్రాన్ని నిర్మించిన  2D ఎంటర్‌టైన్‌మెంట్ ను నటుడు, నిర్మాత మరియు  సూర్య తో పాటు రాజశేఖర్ పాండియన్, జ్యోతిక మరియు కార్తీ నెలకొల్పారు. విజయం సాధించిన అనేక చిత్రాలను సంస్థ పంపిణీ చేసింది. సంస్థ నిర్మించిన అనేక చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి. 

 

***

iffi reel

(Release ID: 1879667) Visitor Counter : 224