సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పిచింగ్ యానిమేషన్ ఐపి అన్న అంశంపై సూచనలు చేసిన ప్రఖ్యాత యానిమేటర్ డాక్టర్ క్రిస్టియన్ జెజ్‌డిక్
మూల భావనను కలిగి ఉండడం యానిమేషన్ టివి సిరీస్‌ను రూపొందించేందుకు ఉత్తమ మార్గం
యానిమేషన్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే రచన చాలా కీలకమైంది. పుస్తకాలలో రాసిన భాష స్క్రీన్ ప్లే భాషకన్నా భిన్నమైంది. ఒకవేళ ఏదైనా కామిక్ పుస్తకాన్ని లేదా మరేదైనా కథను అనుసరించేటప్పుడు దాని లిప్యంతరీకరణ (transliterate) చేసేందుకు నిర్ధిష్ట సిబ్బంది అవసరం ఉంటుందని, బిక్యూ ఎంటర్టైన్‌మెంట్ సిఇఒ డాక్టర్ క్రిస్టియన్ జెజ్‌డిక్ పేర్కొన్నారు. 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫ్ఫి) సందర్భంగా హౌ టు పిచ్ యువర్ యానిమేషన్ ఐపి అన్న అంశంపై శుక్రవారం ఆయన మాస్టర్ క్లాస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.
ఒక యానిమేషన్ తయారు చేయడానికి ఖర్చు చాలా అధికంగా ఉంటుందని డాక్టర్ జెజ్‌డిక్ చెప్పారు. కేవలం 26 నిమిషాల యానిమేషన్‌ను రూపొందించడానికి 7-10 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. అయితే, అందుకు నిర్మాతలను, దర్శకులను, చిత్రకారులను, స్క్రీన్‌ప్లేవారిని కనుగొని, ఎంచుకోవడం కష్టమన్నారు. కాగా, మూల భావన అత్యంత ముఖ్యమైందన్నారు.
తొంభైల నుంచి వీడియో గేమ్స్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ పరిశ్రమల పరిణామాన్ని పట్టి చూపుతూ, అది విశేషంగా వృద్ధి చెందడమే కాక యూరోప్, యుఎస్‌లలో మాత్రమే కాకుండా భారత్‌లో కూడా సంప్రదాయ పరిశ్రమ స్థానాన్ని ఆక్రమిస్తోందన్నారు. నేను పలు కంపెనీలతో కలిసి 90లలో భారత్‌కు వచ్చేవాడిని. ప్రస్తుతం మేం భారత్‌లోని పూణె, బెంగళూరు, కోల్‌కత, ఢిల్లీ తదితర ప్రాంతాలలో ఉన్న అనేక కంపెనీలతో కలిసి చురుకుగా పని చేస్తున్నాం అని ఆయన చెప్పారు.
యానిమేషన్ సిరీస్ ఐడియాలను సంభావ్య పెట్టుబడిదారులు, నిర్మాతలు, ప్రసారకర్తలు, ఇతర భాగస్వాముల ఎదుట ఉంచేందుకు ఈ రంగంలోకి కొత్తగా వచ్చిన వారికి డాక్టర్ క్రిస్టియన్ జెజ్‌డిక్ కొన్ని సూచనలు చేశారు.
యానిమేషన్ టివి సిరీస్‌ను రూపొందించేందుకు ఉత్తమ పద్ధతి మూల భావనను కలిగి ఉండటం
మీ యానిమేషన్ ఐపిలను ఎవరి ముందు ఉంచనున్నారు - ఫెస్టివలా లేక నిర్ధిష్ట మార్కెట్లా. యూరోప్‌లో వెయ్యిమందికి పైగా నిర్మాతలు, ప్రసారకులు ఉన్న కార్టూన్ ఫోరంలో తమ ప్రాజెక్టులను ఉంచేందుకు వెడతారు. కనుక, ముందుగా ఎవరైనా ప్రసారకులను లేదా యూట్యూబ్‌నైనా కలవడం ముఖ్యం.
మీ కూర్పును ఎంపిక చేసుకోండి. సాధ్యమైనంతవరకూ సంభావ్య పెట్టుబడిదారు ఎదుట లిఖిత పత్రాల నుంచి చదవకుండా ఉండండి. అంశాలను గుర్తుపెట్టుకోవడానికి మార్గాన్ని కనుగొనండి.
పిచ్ చేసేందుకు అత్యవసర అంశాలు
మీ భావనను మూడు వరుసలలో సంక్షిప్తం చేయండి: భావన, పాత్రలు, విశ్వం
క్లుప్తంగా, అందంగా నిర్మించిన ట్రైలర్‌ను ప్రదర్శించండి.
ఈ ట్రైలర్‌లో మీ పాత్రలను పరిచయం చేయండి
మీకు కథ తెలుసునని రుజువు చేసేందుకు కథాంశాన్ని కలిగి ఉండండి
మీరు పిచ్ చేసేటప్పుడు మీ కథాంశాన్ని చదవండి- మీ మనసులో ఏముందో చూపండి
ఒక్క భావనను అసంఖ్యాకమైన పద్ధతుల్లో చూపవచ్చు కనుక మీ నమూనా/ శైలి గురించి ఆలోచించండి.
మీ పనిని అమలు చేసేందుకు అవసరమైన బడ్జెట్ గురించి తెలుసుకొని ఉండండి.
మీ టీం & భాగస్వాముల గురించి ముందుగానే ఆలోచించి పెట్టుకోండి.
***
(Release ID: 1879021)
Visitor Counter : 161