వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌.టి.ఎ) సంప్రదింపులను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించిన ఇండో `గల్ఫ్‌ సహకార మండలి (జిసిసి) సమగ్ర ఎఫ్‌.టి.ఎ ఎన్నో ఉద్యోగాలను కల్పించనుంది. ఉభయ దేశాలలో ఇది జీవన ప్రమాణాలను పెంచనుంది.


జిసిసి వంటిపెద్ద వాణిజ్య బ్లాక్‌ తో ఇండియా వాణిజ్యాన్ని పెద్ద ఎత్తున విస్తరించడానికి, వివిధ రంగాలకు విస్తరించడానికి ఎఫ్‌.టి.ఎ ఉపకరించనుంది.

Posted On: 25 NOV 2022 9:09AM by PIB Hyderabad

ఇండియా `జిసిసిఎఫ్‌టిఎ మధ్య సంప్రదింపులను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలించాలన్న ఆసక్తిని కేంద వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ,టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి శ్రీ పియూష్‌ గోయల్‌, హిజ్‌ ఎక్సలెన్సీ, గల్ఫ్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జిసిసి) డాక్టర్‌ నయీఫ్‌ పలా ఎం. అల్‌ హజ్‌రఫ్‌

లు వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని వారు ఒక సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడిరచారు. భవిష్యత్‌ చర్చలకు మార్గం సుగమం చేస్తూ, వివిధ పరిష్కారాల ప్రాతిపదికన ద్వైపాక్షిక సంబంధాలు పరస్పర ప్రయోజనకరమైన వివిధ అంశాలపై మంచి ప్రగతిని సాధించాయి. ఇండియా`జిసిసి దేశాలమధ్య ఆర్థిక ద్వైపాక్షిక సంబంధాలలో చర్చలు పురోగతి సాధించాయి..

ఎఫ్‌.టి.ఎ సంప్రదింపులు లాంఛనంగా కొనసాగించడానికి అవసరమైన చట్టపరమైన, సాంకేతిక అంశాల విషయాన్ని ఒక కొలిక్కితెచ్చేందుకు ఈ విషయంలో తీసుకోవలసిన చర్యలను వేగవంతం చేసేందుకు  ఉభయపక్షాలూ అంగీకరించాయి.ఎఫ్‌.టి.ఎ ఆధునిక, సమగ్ర ఒప్పందంగా ఉండనుంది. ఇందులో చెప్పుకోదగిన స్థాయిలో సరుకులు, సేవలకు సంబంధించిన అంశాలను చేర్చనున్నారు. ఎఫ్‌.టి.ఎ ఉభయ దేశాలలో చెప్పుకోదగిన స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించగలదని ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుందని, విస్తృత సామాజిక, ఆర్ధిక అవకాశాలను ఇండియాలో, అన్ని జిసిసి దేశాలలో కల్పిస్తుందని తెలిపారు. ఇండియా`జిసిసి ఆర్థిక వ్యవస్థలలో ఉన్నశక్తి సామర్ధ్యాల దృష్ట్యా ట్రేడ్‌ బాస్కెట్‌ను పెద్ద ఎత్తున విస్తరించేందుకు గల అవకాశాలను వారు ప్రస్తావించారు.

జిసిసి ప్రస్తుతం ఇండియాకు అతిపెద్ద వాణిజ్యభాగస్వామ్య బ్లాక్‌ గా ఉంది. 2021`22 ఆర్థిక సంవత్సరంలో  ద్వైపాక్షకి వాణిజ్యం విలువ 154 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు పైగా ఉన్నాయి. ఎగుమతులు సుమారు  44 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు కాగా, దిగుమతులు సుమారు 110 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు.(ఇందులో నాన్‌ ఆయిల్‌ ఎగుమతులు 33.8 బిలియన్‌ అమెరికన్‌డాలర్లు. నాన్‌ ఆయిల్‌ దిగుమతులు 37.2 అమెరికన్‌ డాలర్లు) సేవలరంగానికి సంబంధించి ఇండియా `జిసిసి మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం  2021`22 ఆర్థిక సంవత్సరంలో  సుమారు 14 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లుగా ఉంది. ఎగుమతల విలువ 5.5 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు. దిగుమతులు సుమారు 8.3 బిలియన్‌డాలర్లు.

భారతదేశపు చమురు దిగుమతులలో జిసిసి దేశాల వాటా సుమారు 35 శాతం వరకు ఉంది. గ్యాస్‌ దిగుమతులలో 70 శాతం వరకు ఉంది. ఇందియా మొత్తం ముడి చమురు దిగుమతులు 2021`22 ఆర్థిక సంవత్సరంలో  సుమారు 48 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఎల్‌.ఎన్‌.జి, ఎల్‌.పి.జి దిగుమతులు 2021`22లో సుమారు 21 బిలియన్‌ డాలర్లు. జిసిసి కూటమి దేశాల పెట్టుబడులు ప్రస్తుతం ఇండియాలో 18 బిలియన్‌డాలర్ల విలువకు పైగా ఉన్నాయి.

****


(Release ID: 1878999) Visitor Counter : 175